పాకిస్థాన్ అంపైర్ ను ఎందుకు అరెస్ట్ చేయలేదు!
పాకిస్థాన్ అంపైర్ ను ఎందుకు అరెస్ట్ చేయలేదు!
Published Mon, Feb 10 2014 6:50 PM | Last Updated on Sun, Sep 2 2018 5:50 PM
ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో ముంబై పోలీసుల దర్యాప్తు తీరును సుప్రీం కోర్టు ప్యానెల్ తప్పుపట్టింది. ఈ కుంభకోణంలో అంతర్జాతీయ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం కోణంలో పోలీసులు ఎందుకు దర్యాప్తు చేపట్టలేదని ముంబై పోలీసులను ముగ్గురు సభ్యుల ముకుల్ ముద్గల్ ప్యానెల్ ప్రశ్నించింది. ఈ కుంభకోణంలో పాత్ర ఉందనే ఆరోపణలు వచ్చిన పాకిస్థానీ అంపైర్ ను దేశాన్ని విడిచి వెళ్లేందుకు ఎలా అనుమతించారు అని కమిటీ నిలదీసింది.
ముంబైలోని బెట్టింగ్ సిండికేట్ కు దావూద్ అండ ఉందని తెలిసినా దర్యాప్తులో ఎందుకు నిర్లక్ష్యం వహించారు..ప్యానెల్ దృష్టికి ఎందుకు తీసుకురాలేదని కమిటీ అడిగింది. మే 15 తేదికి మూడు రోజుల ముందే రాజస్థాన్ రాయల్స్, ముంబై జట్ల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతుందని పాకిస్థానీ అంపైర్ అసద్ రావూఫ్ ఫోన్ కాల్ ద్వారా వెళ్లడైనా.. అతనిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ కేసులో ప్రత్యక్ష పాత్ర ఉన్నా.. రావూఫ్ ను అదుపులోకి తీసుకోకపోవడంపై పలు అనుమానాల్ని కమిటీ లేవనెత్తింది.
Advertisement
Advertisement