
క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు!
జైపూర్: ఐపీఎల్ మాజీ చైర్మన్, వివాదాస్పద వ్యాపారవేత్త లలిత మోదీ క్రికెట్‌తో తన అనుబంధానికి స్వస్తి పలికాడు. రాజస్థాన్‌లోని నాగౌర్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఆయన రాజీనామా చేశారు. ఈ మేరకు మూడు పేజీల లేఖను శుక్రవారం అర్ధరాత్రి రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్‌కు పంపించాడు.
'రాబోవు తరాలకు అవకాశం ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని భావిస్తున్నాను. అందుకు క్రికెట్ అడ్మినిస్ట్రేషన్‌కు గుడ్‌బై పలుకాలని నిర్ణయించాను' అని మోదీ తన లేఖలో పేర్కొన్నారు. మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న లలిత్ మోదీ ప్రస్తుతం భారత ఏజెన్సీల నుంచి తప్పించుకొని విదేశాల్లో ప్రవాసముంటున్న సంగతి తెలిసిందే. అతనికి వ్యతిరేకంగా అంతర్జాతీయ వారెంట్ జారీ చేయాలంటూ భారత్ ఇంటర్‌పోల్‌ను కోరినా.. ఇంటర్‌పోల్ అందుకు నిరాకరించిన సంగతి తెలిసిందే. నాగౌర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్‌లో లలిత్ మోదీ ఉండటంతో రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్‌ను బీసీసీఐ నిషేధించిన సంగతి తెలిసిందే. దీంతో గత మూడేళ్లలో రాజస్థాన్ ఒక్క ఐపీఎల్ మ్యాచ్‌గానీ, అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌గానీ అతిథ్యం ఇవ్వలేకపోయింది.