లక్నో : బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ తమకు భారీ మొత్తంలో బిల్ ఎగ్గొట్టాడని బీఎస్‌ఎన్‌ఎల్ ఆరోపించింది. రూ.38,616ల ఫోన్ బిల్లు చెల్లించకుండా ఫిలిబిత్ లోక్‌సభ నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు చేసిన వరుణ్ గాంధీపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారికి బీఎస్‌ఎన్‌ఎల్ ఫిర్యాదు చేసింది. 2009-14 మధ్య కాలంలో వరుణ్ గాంధీ ఫిలిబిత్ ఎంపీగా ఉన్న సమయంలో అక్కడ ఏర్పాటు చేసిన నియోజకవర్గ ఆఫీసుకు సంబంధిన ఫోన్ బిల్లు రూ. 38,616 కట్టలేదని ఫిర్యాదులో పేర్కొంది. బీఎస్‌ఎన్‌ఎల్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోకుండానే వరుణ్ గాంధీ నామినేషన్ దాఖలు చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరింది .
అయితే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులందరూ.. ప్రభుత్వ సంస్థల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకుని నామినేషన్ పత్రాలకు జతపర్చాలన్న విషయం తెలిసిందే. ఒక వేళ అభ్యర్థి ఈ నియమాలు పాటించకపోతే ఆ నామినేషన్ తిరస్కరిస్తారు. ఇక 2014 లో సుల్తాన్‌పూర్ లోక్‌సభ నుంచి పోటీ చేసి గెలుపొందిన వరుణ్ గాంధీ.. ఈ సారి ఫిలిబిత్ నుంచి పోటీ చేస్తున్నారు.
ఆయన తల్లి మనేకా గాంధీ సుల్తాన్‌పూర్ నుంచి పోటీ చేస్తుండటంతో.. ఆయన మళ్లీ ఫిలిబిత్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. ఈ నియోజకవర్గ పరిధిలో ఏప్రిల్ 23న ఎన్నికలు జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment