అవన్నీ పనికిమాలిన ఆరోపణలు: వరుణ్‌ | Varun Gandhi says charges against him false | Sakshi
Sakshi News home page

అవన్నీ పనికిమాలిన ఆరోపణలు: వరుణ్‌

Published Sun, Oct 23 2016 11:01 AM | Last Updated on Mon, Sep 4 2017 6:06 PM

అవన్నీ పనికిమాలిన ఆరోపణలు: వరుణ్‌

అవన్నీ పనికిమాలిన ఆరోపణలు: వరుణ్‌

న్యూఢిల్లీ: ఆయుధాల వ్యాపారి అభిషేక్‌ వర్మకు రక్షణ రహస్యాలు చెప్పారనే ఆరోపణలపై బీజేపీ ఎంపీ వరుణ్‌ గాంధీ స్పందించారు. అవన్నీ తప్పుడు, పనికిమాలిన ఆరోపణలని కొట్టిపారేశారు. కావాలని తన ప్రతిష్టను దెబ్బతీయాలనుకున్న వారిపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటానని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 2009లో డిఫెన్స్‌ స్టాండింగ్‌ కమిటీ, డిఫెన్స్‌ కన్సలే్టటివ్‌ కమిటీల్లో సభ్యుడిగా నియమితుడైనప్పటి నుంచి కన్సలే్టటివ్‌ కమిటీ భేటీకి ఒక్కదానికీ తాను హాజరుకాలేదని తెలిపారు.

ఎడ్మండ్స్‌ అలెన్‌ అనే అమెరికా న్యాయవాది వరుణ్‌ కీలకమైన రక్షణ రహస్యాలను అభిషేక్‌ వర్మకు వెల్లడించారని పీఎంవోకు రాసిన లేఖను స్వరాజ్‌ అభియాన్‌ నేతలు ప్రశాంత్‌ భూషణ్, యోగేంద్ర విడుదల చేయడం తెలిసిందే. ఎడ్మండ్‌ను తానెప్పుడూ కలవలేదని వరుణ్‌ పేర్కొన్నారు. ఇక అభిషేక్‌ తనకు ఇంగ్లండ్‌లో కాలేజీ స్నేహితుడని, అయితే అతన్ని కలసి చాలాకాలమైందని వరుణ్‌ వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement