ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం హాట్ టాపిక్‌గా మారింది. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న ఈ స్థానం నుంచి ఈ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ పోటీ చేయనున్నట్లు ప్రచారం సాగుతోది. అయితే ఆమెకు పోటీగా అదే కుటుంబానికి చెందిన వరుణ్ గాంధీని రంగంలోకి దించాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. కానీ పార్టీ ప్రతిపాదనను వరుణ్ గాంధీ తిరస్కరించినట్లు సమాచారం. రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానంలో తన సోదరి ప్రియాంక గాంధీపై పోటీ చేసేందుకు ఆయన నిరాకరించినట్లు సమాచారం.
కాగా రాయ్‌బరేలీ, అమేథీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు తన అభ్యర్థులను ప్రకటించలేదు. అటు బీజేపీ కూడా రాయ్‌బరేలీలో తన అభ్యర్థిని ఖరారు చేయలేదు. కాగా కాంగ్రెస్ నుంచి యాంక గాంధీ పోటీ చేసే అవకాశం ఉంది. రాయ్‌బరేలీ నుంచి గత లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసిన మాజీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఈ ఏడాది ఫిబ్రవరిలో రాజ్యసభకు ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్కడి నుంచి ప్రియాంక బరిలో దిగనున్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో తన సిట్టింగ్ స్థానమైన పిలిబిత్ నుంచి బీజేపీ టికెట్ నిరాకరణకు గురైన వరుణ్ గాంధీ.. రాయ్‌బరేలి నుంచి పోటీకి దించితే కాంగ్రెస్‌కు గట్టిపోటీ ఎదురవుతుందని బీజేపీ హైకమాండ్ పావులు కదుపుతోంది. ఈ విషయంపై వరుణ్‌ను సంప్రదించగా.. ఆయన నిరాసక్తి కనబర్చినట్లు తెలుస్తోంది. ‘గాంధీ వర్సెస్ గాంధీ’ పోటీ ఉండటం తనకు నచ్చకపోవడంతో రాయ్‌బరేలీ పోరు నుంచి తప్పుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment