
సమగ్ర విధానాలే సాగుకు రక్ష
రైతు ఆత్మహత్యలకు ప్రధాన కారణం రుణగ్రస్తతే.
రైతు ఆత్మహత్యలకు ప్రధాన కారణం రుణగ్రస్తతే. నికరాదాయం తగ్గిపోతున్నప్పటికీ, అనుత్పాదక ఉపయోగం కోసం అధిక వడ్డీతో రుణాలను తెచ్చుకునేందుకు రైతులు పూనుకుంటున్నారు. రైతులు తమను తాము చంపుకుంటున్నట్లు వర్గీకరించడం సబబు కాదు. పైగా అలాంటి పదజాలం ఒక అపప్రయోగం కూడా. వాస్తవానికి జీవించి ఉండటానికి జరిపే సుదీర్ఘ పోరాటంలో వారు ఓడిపోయారంతే. రైతు ఆత్మహత్యల వెనుక మానవ విషాదాన్ని అర్థం చేసుకోని ప్రభుత్వ పథకాలు వైఫల్యానికే బాటలు తీస్తుంటాయి.
దేశంలో రైతుల ఆత్మహత్యలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. 1997-2006 దశాబ్దిలో ఇండియాలో 1,66,304 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది. అయితే భూమిలేని గ్రామీణ కూలీలు, మహిళల ఆత్మహత్యలను దీంట్లో పొందుపర్చలేదు. జాతీయ నేర నమోదు బ్యూరో ప్రకారం గత ఏడాది 5,650 మంది రైతులు ఆత్మహత్యల పాలయ్యారు. దేశవ్యాప్తంగా రైతులు ఆత్మహత్యల్లో 90 శాతం వరకు తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోనే నమోదు కావటం గమనార్హం. ఒక్క మహారాష్ట్రలోనే 2011-2013 మధ్యకాలంలో 10 వేల మంది పైగా రైతులు ఆత్మహత్యల బారిన పడ్డారు. ఈ రాష్ట్రంలోని మరట్వాడా ప్రాంతంలో ఈ సంవత్సరం ఇంతవరకు 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రైతుల ఆత్మహత్యలు ప్రతి ఏటా 2 శాతం పెరుగుతున్నాయి. దేశంలో ఆత్మ హత్య చేసుకుంటున్న ప్రతి ఐదు మంది పురుషుల ఆత్మహత్యల్లో ఒకటి రైతు ఆత్మహత్యగా నమోదవుతోంది.
సంఖ్యల వెనుక మానవ విషాదం
ఈ సంఖ్యల వెనుక దాగిన మానవ విషాదం చాలా బాధాకరమైంది. ఒక చిన్న ఉదాహరణ. ఈ ఏడాది మే 10న సీతాపూర్ జిల్లా నది గ్రామంలో ఉమేష్ చంద్ర శర్మ అనే రైతు ఆత్మహత్య చేసుకుంటే ఆ బాధ భరించలేని ఆయన కుమారుడు వారం తర్వాత మామిడి చెట్టుకు ఉరివేసుకుని చని పోయాడు. బ్యాంకు రుణాలు చెల్లించలేక, మిల్లుల నుంచి చెల్లిపులు రాక బిజ్నోర్ జిల్లా షాపూర్ గ్రామంలోని చౌదరి అశోక్‌సింగ్ ఆత్మహత్య పాలయ్యాడు. బహ్రాయ్ జ్లిలా సర్సా గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న లక్ష్మీ నారాయణ్ శుక్లా కుటుంబాన్ని ఇటీవలే నేను కలిసి, సహాయం చేయగలిగాను. కుటుంబ పెద్దను కోల్పోయిన ఈ కుటుంబాల ప్రతినిధిగా ఎంపీగా ఐదేళ్లపాటు నేను పొందే వేతనం మొత్తాన్ని ఉత్తరప్రదేశ్‌లో రైతుల సంక్షేమానికి కేటాయించాను. ప్రస్తుతం దేశంలోని రైతులు తమను తాము చంపుకోవడానికి కాకుండా జీవించడానికి మరింత ధైర్యంతో ఉండవలసిన పరిస్థితులను కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
భారత్‌లో తీవ్రమైన వ్యవసాయ సంక్షోభమే రైతులకు అతికొద్ది స్థాయిలో ప్రత్యామ్నాయ జీవన అవకాశాలను కల్పిస్తూ, వారి జీవితాలను కల్లోలంలో ముంచెత్తుతోంది. దేశంలో వ్యవసాయ కమతాల పరిమాణం చాలా చిన్నది. దాదాపు 12 కోట్ల మంది సన్నకారు ైరైతుల వద్ద 44 శాతం భూమి మాత్రమే ఉంది. దేశంలోని మొత్తం రైతుల్లో మూడింట ఒకవంతు రైతుల వద్ద సగటున 0.4 హెక్టార్లకంటే తక్కువ భూమి మాత్రమే ఉంటోంది. 50 శాతం వ్యవసాయ కుటుంబాలు అప్పుల్లో కూరుకుపోయాయి. ప్రతి రైతుకు రూ.47 వేల మేరకు అప్పు భారం ఉంటోందని అంచనా. ఐదేళ్లలో ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌లో వ్యవసాయ ఉత్పత్తి ఖర్చులు 33 శాతం పెరిగాయి. ఇదే సమయంలో ప్రభుత్వం వ్యవసాయ సబ్సిడీలను పరిమితం చేసింది. ఇలాంటి రైతులే ఇప్పుడు దారిద్య్రంలో మునిగిపోయారు. తగ్గు తున్న రాబడులు, పెరుగుతున్న భూ కమతాలు, క్షీణిస్తున్న పంట దిగుబ డులు మొత్తంగా రైతు జీవితానికి ఒక తార్కిక ముగింపు పలుకుతున్నాయి. నిజంగానే ఇప్పుడు వ్యవసాయం గౌరవప్రద మైనది కాకుండాపోయింది.
పరిహారం తప్పనిసరి
భారత్‌లో క్రమబద్ధంగా ఉండని పంటల విధానం, నష్టపరిహార వ్యవస్థ రైతుల వ్యథలను మరింతగా తీవ్రతరం చేస్తోంది. భూగర్భ జలాలు అడుగంటు తున్నప్పటికీ మెట్టప్రాంతాల్లో నివసించే రైతులను అధిగ దిగుబడినిచ్చే గోధుమ, వరి పంటలను పండించేలా ఒత్తిడి చేస్తున్నారు. దేశంలో 61 శాతం వ్యవసాయం భూగర్భజలాలమీదే ఆధారపడుతోం ది. రాజస్థాన్, మహారాష్ట్రలలో వ్యవసాయ స్వావ లంబన స్థాయి అడుగంటి పోయింది. ఈ రాష్ట్రాల్లోని అత్యధిక వ్యవసాయ మండలాలను ఇప్పటికే మోతాదుకు మించి సాగుభూములను పిండుతున్న ప్రాంతాలుగా గుర్తించారు. పంటలకు నష్టం కలిగితే ప్రస్తుతం అందిస్తున్న పరిహార విధానం భూ యజమానులకే ఎక్కువ ప్రయో జనం కలిగిస్తూ, వ్యవసాయ కూలీలకు నష్టదాయ కంగా మారింది. దీనికి తోడుగా పంటల నష్టంపై అంచనా విధానం, దానికనుగుణమైన నిధుల బదలాయింపు కూడా సంక్లిష్టంగా తయారయ్యాయి.
పంటల నష్టంపై తగిన డాక్యుమెంటేషన్ లేమి, లంచగొండి అధికార వర్గం, అసమర్థ స్థానిక యంత్రాంగం కారణంగా నష్టపరిహారాన్ని అందిం చడం, సకాలంలో చౌక రుణాలను లేదా బీమాను కల్పించడం అనేవి సవా లుగా మారాయి. భూ యాజమాన్య హక్కులలో పారదర్శకతను పెంచడం, భూ సంబంధిత న్యాయ సంస్కరణలు చేపట్టడం వల్ల ఇలాంటి సంస్థాగత వ్యవస్థలను బలోపేతం చేయవచ్చు. ఉపగ్రహ ఛాయాచిత్రాలను, చౌక వ్యయంతో కూడిన ద్రోన్‌లను సమర్థవంతంగా ఉపయోగించటం ద్వారా పంటల నష్టం అంచనాకు పట్టే సమయాన్ని గణనీయంగా తగ్గించవచ్చు.
రుణగ్రస్తత నుంచి ఉపశమనం
రైతు ఆత్మహత్యలకు ప్రధాన కారణం రుణగ్రస్తతే. నికరాదాయం రానురాను తగ్గుముఖం పడుతున్నప్పటికీ, అనుత్పాదక ఉపయోగం కోసం అధిక వడ్డీతో రుణాలను తెచ్చుకునే తీవ్ర చర్యలకు రైతులు పూనుకుంటున్నారు. ఒకవైపు అధిక దిగుబడులను, పంటలకు అధిక ధరలను ఆశిస్తూ, మరోవైపు ఆత్మ హత్యలకు పాల్పడుతున్న రైతు కుటుంబాలు పేరుకుపోయిన రుణాల గురించే ఎక్కువగా ప్రస్తావిస్తున్నాయి. బీటీ కాటన్ ప్రవేశంతో ఉత్పాదక ఖర్చులు తారస్థాయికి చేరుకున్నాయి. బీటీ పత్తి పంట దిగుబడులు సాగునీటి లభ్యతపైనే ఎక్కువగా ఆధారపడుతుండగా, రైతులు మాత్రం బావులు, పంప్ సెట్లపై మదుపు చేస్తున్నారు. వర్షాలు తగ్గినప్పుడు, భూగర్భ జలాలు అడుగుకు వెళ్లిపోయిప్పుడు రైతులు పెట్టే ఈ రకం పెట్టుబడులు ప్రాణాం తకంగా మారుతున్నాయి. సాగునీటి వ్యవస్థ పెరుగుతున్నప్పటికీ వ్యవ సాయం రాన్రానూ అస్థిరంగా మారుతోంది. మార్కెట్ కానీ, వాతావరణం కానీ నిరాశపర్చిందంటే రైతులు మరింత దారిద్య్రంలోకి కూరుకు పోతున్నారు.
ఈ విపత్కర పరిస్థితుల్లో వ్యవస్థీకృత పెట్టుబడులు రైతులకు సులభంగా అందుబాటులోకి తీసుకురావాలి. షావుకార్ల నుంచి రుణాలు తీసుకోవడాన్ని తగ్గించాలి. పదే పదే రుణవలయంలో కూరుకుపోవడాన్ని తగ్గించాలంటే నిధుల చెల్లింపుల సమయంలో రైతులకు మేలు కలిగించే నిబంధనలను సులభతరం చేయాలి. తమ ఆస్తులకు, ఆదాయాలకు మించి అధిక రుణాలు తీసుకున్న రైతుల వివరాలను గ్రామస్థాయిలో క్రమానుగతంగా రూపొందించి, రుణభారంతో ఆత్మహత్యల వైపు మొగ్గే అవకాశం కనిపిస్తున్న రైతులను గుర్తించగలగాలి. ఇలాంటి వారికి సకా లంలో రుణాలను కల్పించడానికి, బీమా క్లెయి ముల పరిష్కారానికి గాను సిద్ధంగా ఉన్న రైతుల జాబితాను ఉపయోగించవచ్చు. తద్వారా ఆత్మహ త్యలవైపు కొట్టుకుపోకుండా రైతులకు కౌన్సె లింగ్‌ను అందించవచ్చు.
సాగునీటి పునర్వ్యవస్థీకరణ
సాగునీటిని పునర్వ్యవస్థీకరించడం దేశంలో ఇప్పటికీ సంక్లిష్టంగా ఉంది. బిందు సేద్యం దీనికి ఒక స్పష్టమైన పరిష్కారంగా కనిపిస్తోంది. అవ్యవ స్థంగా ఉన్న భూ కమతాలకు, ఎగుడుదిగుడులుగా ఉండే వ్యవసాయ భూములకు బిందుసేద్యం చక్కటి సాధనం. బిందుసేద్యం ద్వారా నీటి విని యోగాన్ని 70 శాతం వరకు గరిష్టంగా ఉపయోగిం చుకోవచ్చు. దీంతో 230 శాతం వరకు అధిగ దిగు బడులను సాధించవచ్చు. ఎరువుల సమర్థ విని యోగాన్ని 30 శాతం మేరకు పెంచుకోవచ్చు. ప్రారంభ వ్యవసాయ పెట్టుబడి ఇప్పటికీ అత్యధికంగానే ఉండటం ప్రధాన అడ్డంకిగా మారింది. చిన్న కమతాలు ఎక్కు వగా ఉన్న దేశంలో ల్యాండ్ పూలింగ్ (భూములను ఒక్కటిగా చేయడం) ద్వారా రెతులు మరింత సమర్థవంతంగా వ్యవసాయం చేయడానికి, అధిక ప్రయోజనాలు పొందడానికి వీలు కలుగుతుంది. వీటికి తోడుగా ఎస్‌జీఎస్‌వై వంటి సబ్సిడీ పథకాలు ల్యాండ్ పూలింగ్ వంటి వ్యవ హారాలకు ఇతోధికంగా తోడ్పడతాయి. ఒకవేళ సబ్సిడీల మంజూరులో జాప్యం జరిగినట్లయితే వాటి మంజూరు, విడుదల కోసం పట్టుపట్టకుండా రైతులకు అవసరమైన రుణాలను వెంటనే అందించేలా ప్రభుత్వం బ్యాం కులను ప్రోత్సహించాలి. కుప్పకూలిన రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే తమను తాము చంపుకుంటున్నట్లు వారిని వర్గీకరించడం సబబు కాదు. పైగా అలాంటి పదజాలం ఒక అపప్రయోగం కూడా. వాస్తవానికి జీవించి ఉండ టానికి జరిపే సుదీర్ఘ పోరాటంలో వారు కేవలం ఓడిపోయారంతే. రైతులను కించపర్చే అభిప్రాయాలను, భావనలను మార్చడానికి ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో మరింత శ్రద్ధవహించి సన్నకారు వ్యవసాయానికి అవసరమైన నిర్దిష్ట అంశాలను పరిగణనలోకి తీసుకుని వాటిని వెంటనే అమలులో పెట్ట గలగాలి. అత్యంత నిరాశాజనకంగా మారిన రైతు ఆర్థిక వ్యవస్థను మార్చ డానికి, పునర్జీవింపజేయడానికి బలమైన సామాజిక, సంస్థాగత యంత్రాం గాలను నెలకొల్పడం ఎంతైనా అవశ్యం.
వ్యాసకర్త బీజేపీ ఎంపీ వరణ్ గాంధీ
fvg001@gmail.com