లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలున్న ఉత్తరప్రదేశ్ చాలా కీలకమైన రాష్ట్రం. ఇక్కడ మొత్తం 80 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ క్రమంలో 2024 లోక్‌సభ ఎన్నికలకు ఈ రాష్ట్రానికి చెందిన 51 స్థానాలకు బీజేపీ మొదటి విడతలో అభ్యర్థులను ప్రకటించింది.
బీజేపీ ప్రకటించిన మొదటి విడత అభ్యర్థుల జాబితాలో పిలిభిత్, సుల్తాన్‌పూర్, కైసర్‌గంజ్, రాయ్‌బరేలి, మైన్‌పురి, మరికొన్ని ముఖ్యమైన స్థానాలు లేవు. వీటిలో పిలిభిట్ లోక్‌సభ స్థానం నుంచి ప్రస్తుతం వరుణ్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఆయన తల్లి, కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీ సుల్తాన్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు.
ఇక్కడి రాష్ట్ర బీజేపీ వర్గాల సమాచారం ప్రకారం.. రైతులకు సంబంధించిన సమస్యలపై పార్టీ నాయకత్వంతోపాటు స్థానిక బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేక గళం వినిపించిన వరుణ్ గాంధీకి ఈసారి టిక్కెట్ ఉండకపోవచ్చు అంటున్నారు. ఒకప్పుడు తన తండ్రి సంజయ్ గాంధీ ప్రాతినిధ్యం వహించిన అమేథీ నుంచి ప్రతిపక్ష భారత కూటమి మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా వరుణ్ గాంధీ పోటీ చేయవచ్చన్న ఊహాగానాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment