సాగు కన్నీటి వాగేనా! | Agricultural problems | Sakshi
Sakshi News home page

సాగు కన్నీటి వాగేనా!

Published Tue, Jan 6 2015 12:34 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

వరుణ్ గాంధీ - Sakshi

వరుణ్ గాంధీ

 విశ్లేషణ
 ఆ రంగానికి చాలినంత విద్యుత్ కూడా అందడం లేదు. దేశంలో ఉపరితల నీటి పారుదల నిర్వహణ సమర్థంగా జరగడం లేదు. వ్యవసాయానికి అనువైన భూమిలో కేవలం 40 శాతమే అందుకు నోచుకుంటోంది. నిజానికి మరికొంత భూమిలో సేద్యం చేయగలిగిన సామర్థ్యం ఉన్నప్పటికీ, వినియోగించుకోవడం లేదు. భూగర్భ జలాల పంపిణీ కూడా సమంగా సాగడంలేదు. ఆర్థికంగా శక్తి ఉండి, మంచి పరికరాలను, పంపులను ఉపయోగించుకుంటున్నవారు మాత్రమే భూగర్భ జలాలలో ఎక్కువ భాగాన్ని వినియోగించుకుంటున్నారు.

 ఏ కర్షకుడైనా తను పండించగలిగేది పండించవచ్చు. కాని తన శ్రమ ఫలితాన్ని మార్కెట్‌లో అమ్ముకోవడం దగ్గర మాత్రం అతడు దారుణమైన క్షోభకు గురౌతున్నాడు. 1980 - 2011 మధ్య భారతదేశంలో సేద్యమే వృత్తిగా ఉన్నవారి సంఖ్య దాదాపు యాభై శాతం ఉంది. ఎన్‌ఎస్ ఎస్‌ఓ (నేషనల్‌శాంపుల్ సర్వే ఆఫీస్) గణాంకాల ప్రకారం దేశంలోని 57.8 కోట్ల కుటుంబాలలో, గ్రామీణ ప్రాంతా లలోని 15.61 కోట్ల కుటుంబాలు వ్యవసాయం మీద ఆధారపడినవే. సేద్యమే ఆధారంగా ఉన్న కుటుంబాలు సగటున నెలకు రూ. 6,426 ఆర్జిస్తున్నాయి. మొత్తం వ్యవ సాయ కుటుంబాలలో మళ్లీ 33 శాతం కుటుంబాలకు 0.4 హెక్టార్ల కంటె తక్కువ భూమే ఉంది. కేవలం ఒక్క హెక్టార్ భూమి కలిగి ఉండి, రోజు గడవడం కూడా కష్టంగా ఉన్న కుటుంబాలు 65 శాతం ఉన్నాయి. మొత్తం వ్యవసాయ కుటుంబాలలో సగం, అంటే 50 శాతం, రుణబాధతో గడు పుతున్నవే. ఆ కుటుంబాలన్నీ సగటున రూ.47,000 అప్పుతో సతమతమౌతున్నాయి. ఈ పరిస్థితులు రైతులం దరినీవడ్డీవ్యాపారుల బారినపడేటట్టు చేస్తున్నాయి. గ్రామీ ణ రుణభారంలో దాదాపు 26 శాతం ఇలాంటి రుణమే. వీరంతా 20 శాతం వడ్డీల కింద చెల్లిస్తూ దారిద్య్రం నుంచి ఎప్పటికీ బయటపడలేని దుస్థితిలో చిక్కుకుని ఉన్నారు.
 దిగుబడి మొత్తంలో 30 శాతం ఖర్చుల రూపంలో పోతోంది. ఎరువులు, కూలీరేట్లు విపరీతంగా పెరగడం వల్ల ఈ ఖర్చు మరింత పెరిగింది. గ్రామీణప్రాంతాలలో చెల్లించే కనీస వేతనం 2007 నుంచి బాగా పెరగడంతో ద్రవ్యోల్బ ణానికి దారి తీసింది. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంఎన్‌ఆర్‌ఇజీఎస్) వల్ల గ్రామీణ ప్రాంత కూలీలకు ఎక్కువ వేతనాలను కోరే శక్తి పెరిగింది. వ్యవ సాయ రంగంలో  ఖర్చులకు తగినట్టు, ఉత్పత్తి మీద రాబడి రావడం లేదు. దీనితో ద్రవ్యోల్బణం మరింత పెరు గుతోంది.

 రైతుకు మేలు చేయని వ్యవసాయోత్పత్తుల ధరలు
 ఈ మొత్తం వ్యవస్థ దొడ్డిదారి వ్యవహారాల వల్ల, దళారుల గుత్తాధిపత్య ధోరణులవల్ల చతికిలపడింది. దీనితో రైతు లకు ప్రయోజనం కూర్చని రీతిలో వ్యవసాయోత్పత్తుల ధరలు పెరుగుతున్నాయి. వ్యవసాయ రంగంలో మౌలిక వసతుల కల్పన సంపూర్ణంగా అభివృద్ధి చెందని కారణం గా (ఉదా: శీతల గిడ్డంగులు, రవాణా సదుపాయాలు లేక పోవడం) 25 శాతం దుబారా చోటుచేసుకుంటున్నది. అస మర్థ ప్రజాపంపిణీ వ్యవస్థ కారణంగా 40 శాతం వ్యవసాయోత్పత్తి వ్యర్థమవుతోంది. అలాగే సంప్రదాయ వ్యవసాయ పద్ధతులు నిలకడ లేని ఆర్థిక వ్యవస్థకు కారణ మవుతున్నాయి.

 చాలని సాగు నీటి పారుదల సౌకర్యం
 సాగునీటి పారుదల వ్యవస్థ ద్వారా వ్యవసాయానికి లభిం చే నీరు అవసరాలకు చాలినంతగా లేదు. అలాగే నీటి పారుదల వ్యవస్థ వాతావరణ మార్పుల వల్ల సులభంగా ప్రభావితమయ్యే స్థితిలోనే ఉంది. ఆ రంగానికి చాలినంత విద్యుత్ కూడా అందడం లేదు. దేశంలో ఉపరితల నీటి పారుదల నిర్వహణ సమర్థంగా జరగడం లేదు. వ్యవ సాయానికి అనువైన భూమిలో కేవలం 40 శాతమే అం దుకు నోచుకుంటోంది. నిజానికి మరికొంత భూమిలో సేద్యం చేయగలిగిన సామర్థ్యం ఉన్నప్పటికీ, వినియోగిం చుకోవడం లేదు. భూగర్భ జలాల పంపిణీ కూడా సమం గా సాగడంలేదు. ఆర్థికంగా శక్తి ఉండి, మంచి పరికరా లను, పంపులను ఉపయోగించుకుంటున్నవారు మాత్రమే భూగర్భ జలాలలో ఎక్కువ భాగాన్ని వినియోగించుకుం టున్నారు. నిజానికి వ్యవసాయాన్ని ఆధునిక పద్ధతులతో చేయడానికి అవసరమయ్యే పెట్టుబడులలో రాయితీలు అందుబాటులో ఉన్నప్పటికీ రైతాంగం వాటిని అందుకునే స్థితిలో లేకపోవడంవల్ల కొత్త సాంకేతిక విధానాలను ప్రవేశపెట్టలేకపోతున్నారు.

 విద్యుత్‌ను ఆదా చేయాలి
 రైతాంగం పాత పంపుసెట్లను పక్కన పెట్టి, విద్యు త్‌ను 20 శాతం ఆదా చేయగలిగే కొత్త పరికరాలను తెచ్చు కోవాలి. వ్యవసాయ రంగానికి పరిమితంగా విద్యుత్ అందుతున్న ఈ నేపథ్యంలో ఇలాంటి పంపులను వినియోగించడం ద్వారానే పూర్తి అవసరాలు తీర్చుకోగలుగుతారు. అలాగే భూగర్భ జలాలు మరీ పాతాళంలోకి వెళ్లిపోతుంటే, పరి ష్కారం ఏమిటి? బిందుసేద్యమే ఇందుకు సమాధానం. ఉపరితల నీటిపారుదల వ్యవస్థను విస్తరించడం ద్వారా, బిందుసేద్యాన్ని ఆచరించేవారికి ఆర్థిక ప్రోత్సాహకాలను కల్పించడం ద్వారా నీటి అందుబాటు సౌకర్యాన్ని మరింత మెరుగుపరచవచ్చు. వర్షం నీటిని కాపాడుకోవడం, భూ గర్భ జలాలను పునరుద్ధరించుకోవడం ద్వారా విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకుని కూడా వ్యవసాయోత్పత్తిని పెంపొందించవచ్చు.

 సమన్వయం లేని క్రమబద్ధీకరణ పుణ్యమా అని వ్యవసాయ రంగం గందరగోళ పరిస్థితులను ఎదుర్కొం టున్నది. ఉదాహరణకి వ్యవసాయ ఉత్పత్తుల గిడ్డంగుల వ్యవహారమే తీసుకుందాం. ఆ రంగం ప్రయోజనం మేరకు ఉత్పత్తులను ప్రైవేటు వ్యక్తులు సయితం నిల్వ చేయడానికి అత్యవసర వస్తువుల చట్టం అనుమతిస్తున్నది. వ్యవసాయదారుల ప్రయోజనాల కోసం రహస్య బిడ్‌ల ద్వారా హోల్‌సేల్ మార్కెట్‌ను కూడా ప్రభుత్వం నిర్వహిం చవచ్చు. నిజానికి సిద్ధాంత పరంగా చూస్తే భారత వ్యవ సాయ విధానం మంచిదే. కాని దాని నుంచి ఫలితాలను రాబట్టుకోవడంలో వైఫల్యం ఎదురైంది. నాఫెడ్ ఏర్పాటు ఉద్దేశం అలాంటిదే. వ్యవసాయంలో పోటీ మార్కెట్లను పెంపొందించడం, రైతులకు మార్కెటింగ్‌లో, ప్రోసెసిం గ్‌లో సహకరించడం నాఫెడ్ లక్ష్యం. కానీ నిర్వహణా లోపంతో ఇటీవల కాలంలో వ్యవసాయ రంగంలో తలె త్తిన సంక్షోభాలను ఇది నివారించలేకపోయింది. ఉల్లి ధర అదుపులేకుండా పెరగడం ఇందుకు ఒక ఉదాహరణ.

 అటు సంప్రదాయం, ఇటు ఆధునిక విధానం
 సేద్యంలో ఎదురయ్యే ప్రమాదాల (రిస్క్) నుంచి రైతు లను కాపాడడంలో ప్రభుత్వం సాయపడవచ్చు. దేశంలో పంటల బీమా చాలా తక్కువ. ఇలాంటి రిస్క్‌ల నుంచి కాపాడుకోవడానికి, ఎరువులు, మందులు, కూలీల మీద వెచ్చించే ఖర్చులు తగ్గించడానికి రైతులు సంఘాలుగా ఏర్పడవచ్చు. దీర్ఘకాల గ్రామీణ రుణ విధానాన్ని ప్రవేశ పెట్టడం కూడా అవసరం. ఇందువల్ల బ్యాంకులకు కూడా ప్రోత్సాహం లభిస్తుంది. మార్కెట్ ఒడిదుడుకులను కూడా ఈ విధానం కట్టడి చేస్తుంది. పంటల మార్పిడి, భూమిని చదునుచేయడం, కప్పడం వంటి సంప్రదాయ వ్యవసాయ పద్ధతులు ఇప్పటికీ అవసరమైనవే. నిజానికి వీటి ప్రయో జనం ఏ మేరకో రైతులకు సంపూర్ణంగా తెలియకపోయినా ఈ పద్ధతుల వల్ల కొంత మేలు ఉంది. నిజానికి ఇలాంటి తక్కువ ఖర్చు పద్ధతుల వల్ల వ్యవసాయ పెట్టుబడులు తగ్గుతాయి. భూమి కోతను నివారించి, భూసారాన్ని పెం చుతాయి. అలాగే శ్రీవరి పద్ధతి (తక్కువ నీటి సౌకర్యంతో అవసరాల మేరకు పండించడం), ఫెర్టిగేషన్ (సూక్ష్మ సేద్య పరికరాలతో ఎరువులను సమంగా పంపిణీ చేయడం) విధానాలను ప్రోత్సహించాలి. పరిమితంగా ఉన్న వనరు లను, వాటి వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని, నీటిని సమర్థంగా ఉపయోగించుకుని పండించిన వ్యవసాయో త్పత్తులకు, అందులోని రకాలకు మేలైన మద్దతు ధరలను ప్రకటించడం ద్వారా అలాంటి వాటిని ప్రోత్సహించాలి. ఈ ప్రోత్సాహకాల ద్వారా అలాంటి విధానాలను రైతులు అవలంబించేటట్టు చేయాలి.

 70 శాతం చేలకు దుర్భిక్ష ప్రమాదం
 వాతావరణంలో మార్పులు మన వ్యవసాయ రంగాన్ని దారుణంగా ప్రభావితం చేస్తున్నాయి. దేశంలో ఉన్న సాగు భూమిలో 70 శాతం దుర్భిక్షం పాలు కావడానికి అవకాశం ఉన్నదే. 12 శాతం భూమి వరదల వల్ల, 8 శాతం తుపాన్ల జోన్‌లలో ఉండడం వల్ల ఆ సాగు భూమి కరువుకాటకా లతో ప్రభావితమవుతోంది. ఉష్ణోగ్రతలలో కొద్దిపాటి పెరుగుదల కనిపించినా అది వ్యవసాయోత్పత్తులను తగ్గిస్తుంది. అయితే దేశంలో విడుదల అవుతున్న ఉద్గా రాలలో 20 శాతం వ్యవసాయ రంగానికి చెందినవే. అం దువల్ల ఒక విపత్తును ఒకటి పెంచుతూ ఇదంతా విషవల యంలా మారింది. అయితే వ్యవసాయరంగంలో నిలకడ సాధించే లక్ష్యంతో భారత్ ఇప్పటికే (ఎన్‌ఎంఎస్‌ఏ -నేష నల్ మిషన్ ఫర్ సస్టెయినబుల్ అగ్రికల్చర్ ద్వారా) ప్రత్యేక కృషిని ప్రారంభించింది. వ్యవసాయ రంగం ఎదు ర్కొంటున్న సవాళ్లను గుర్తించినా, వైఫల్యాలను కనుగొ నడం దగ్గర, కొత్త విధానాలను పరిచయం చేయడం దగ్గర, సేద్యంలో ఇప్పటికీ కొనసాగుతున్న అసమర్థ విధా నాలను తొలగించే పనిలోను ఎన్‌ఎంఎస్‌ఏ కృషి నిరాశా జనకంగానే ఉంది.

 సాంకేతిక పురోగతి కావాలి
 భారత వ్యవసాయ రంగంలో సరికొత్త సాంకేతిక పరిజ్ఞా నాన్ని ప్రవేశపెట్టాలి. వారికి కొత్త విధానాలను అందుబా టులోకి తెచ్చి, ఆర్థిక ప్రోత్సాహకాలను కల్పించి మరింత ఆదాయాన్ని తెచ్చే పంటల వైపు దృష్టి మళ్లించే విధంగా చేయాలి. అంటే పండ్లతోటల పెంపకం వంటి వాటి మీద శ్రద్ధ పెట్టేలా చేయాలి. ఇలాంటి సంస్కరణలు భవిష్య త్తులో అయినా తక్కువ పెట్టుబడులకు ఆస్కారం కల్పిస్తా యి. తనను పట్టించుకునే స్వేచ్ఛా విఫణి వైపు రైతు నడవ డానికి ప్రోత్సహిస్తాయి. ధరవరలను నిర్ణయించుకునే వెసులుబాటు రైతుకు కలగడంతో పాటు, ఆహారభద్రతకు కూడా భరోసా ఏర్పడుతుంది.
 (వ్యాసకర్త బీజేపీ ఎంపీ / కేంద్ర మంత్రి మేనకా గాంధీ కుమారుడు)
 ఇకపై వరుణ్ గాంధీ ‘సాక్షి’ పాఠకుల కోసం వ్యాసాలు అందించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement