సాక్షి, లక్నో: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ నేతలు తమ అసలు స్వరూపాన్ని బయట పెట్టుకుంటున్నారు. ముఖ‍్యంగా బీజేపీ నేత సాక్షి మహారాజ్ తాను 'సన్యాసి' గనుక తనకు ఓటు వేయని వారిని శపిస్తానని బెదింరించారు. తాజాగా కేంద్రమంత్రి మేనకా గాంధీ ఇలాంటి బెదిరింపులకు దిగారు. ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్ నుంచి పోటీ చేస్తున్న మేనక ఎన్నికల ప్రచారంలో ముస్లింలనుద్దేశించిన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
ముస్లింల ఓట్లు లేకుండా లభించే గెలుపు తనకు సంతోషానివ్వదంటూనే...తనకు ఓటు వేయాలో లేదో నిర్ణయించుకోవాలన్నారు. అలాగే తనకు ఓటు చేయని ముస్లింలకు తానెలా సాయం చేస్తానంటూ బ్లాక్ మెయిలింగ్‌కు దిగారు. ఓటు వేయని ముస్లిం ఓటర్ల వివరాలు తనకు తెలిసి పోతాయనీ ఈ నేపథ్యంలో వారికందాల్సిన సహాయం ఆధారపడి వుంటుందంటూ సభాముఖంగానే హెచ్చరించారు. మీరు ఓటు వేసినా... వేయకపోయినా గెలుస్తాను. కానీ ఇది ఇచ్చు పుచ్చుకోవాల్సిన వ్యవహారమని ఆమె వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్ అవుతోంది.
పిలిభిత్ నుంచి గతంలో తాను ఆరుసార్లు గెలుపొందానని, అక్కడి ప్రజలకు తానేంటో తెలుసనని ఆమె వ్యాఖ్యానించారు. ప్రజల మద్దతుతో ఈ సారి ఎన్నికల్లో కూడా తాను ఎలాగూ గెలవబోతున్నానని ధీమా వ్యక్తం చేసిన మేనకా ..ముస్లింలు కూడా తనకు ఓటు వేయాలని డిమాండ్ చేశారు. ముస్లింలు ఓటు వేయకపోతే తన మనసుకు కష్టంగా ఉంటుందనీ, అలాంటి వారికి తానెందుకు పనిచేయాలనే ఆలోచన మనసులో వస్తుంది జాగ్రత్త అంటూ హెచ్చరించారు. అంతేకాదు ప్రతీసారి సాయం చేస్తూ పోవడానికి మనమేమైనా మహాత్మాగాంధీ వారసులమా అంటూ కేంద్రమంత్రి ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రజలే నిర్ణయం తీసుకోవాలన్నారు.
కాగా, ఈ ఎన్నికల్లో మేనకా గాంధీ సుల్తాన్‌పూర్ నుంచి పోటీ చేస్తుండగా, ఫిలిబిత్ నుంచి ఆమె కుమారుడు వరుణ్ గాంధీ పోటీ చేస్తున్నారు.
Maneka Gandhi threatening voters that she will watch booth wise votes to decide whom to be helped once she wins.
— Ravi Nair (@t_d_h_nair) April 12, 2019
Sakshi Maharaj says as a ‘Sanyasi’ he’ll curse people if they won’t vote for him!
BJP is a Party with a Difference 😁
pic.twitter.com/sG1X65WJ5s
Comments
Please login to add a commentAdd a comment