కేంద్ర మంత్రి మేనకా గాంధీ (ఫైల్‌ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : పని ప్రదేశాల్లోమహిళలు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులను మీటూ పేరుతో బాహాటంగా వెల్లడిస్తున్న క్రమంలో కేంద్రం స్పందించింది. ఈ తరహా లైంగిక దాడులు, వేధింపుల కేసులన్నింటిపైనా బహిరంగ విచారణకు పదవీవిరమణ చేసిన నలుగురు న్యాయమూర్తులతో కూడిన కమిటీని ప్రభుత్వం నియమిస్తుందని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రి మేనకా గాంధీ పేర్కొన్నారు. మీటూ క్యాంపెయిన్ ద్వారా మహిళలు తమపై జరిగిన నేరాలపై ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారని ఇటీవల కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు.
పది, పదిహేనేళ్ల తర్వాత సైతం లైంగిక వేధింపుల ఫిర్యాదులను అనుమతించాలన్నారు. లైంగిక వేధింపులకు ఎవరు పాల్పడ్డారనేది బాధితులకు తెలుస్తుందని అందుకే తాము ఫిర్యాదులకు ఎలాంటి కాలపరిమితి ఉండరాదని న్యాయ మంత్రిత్వ శాఖకు లేఖ రాశామని మంత్రి తెలిపారు. బాలీవుడ్ నటుడు నానా పటేకర్ పదేళ్ల కిందట ఓ సినిమా సెట్‌లో తన పట్ల అసభ్యంగా వ్యవహరించారని నటి తనుశ్రీ దత్తా చేసిన ఆరోపణల నేపథ్యంలో దేశవ్యాప్తంగా మీటూ ఉద్యమం ఊపందుకుంది.
Comments
Please login to add a commentAdd a comment