లక్నో : తాను నిర్వహించే కళాశాలలో చదివే లా కాలేజీ విద్యార్ధినిపై లైంగిక దాడికి పాల్పడిన ఆరోపణలపై బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి స్వామి చిన్మయానంద్‌పై సిట్ విచారణ ముమ్మరమైంది. యూపీలోని షహజన్‌పూర్‌లో శుక్రవారం స్వామి చిన్మయానంద్ ఆశ్రమంలో సోదాలు చేపట్టిన సిట్ అధికారులు ఆయన బెడ్‌రూమ్‌ను సీజ్ చేశారు. విచారణ పూర్తయ్యేంత వరకూ షహజన్‌పూర్‌ను విడిచివెళ్లరాదని అధికారులు ఆయనను ఆదేశించారు.
బాధిత యువతి ఆరోపణలపై సిట్ బృందం గురువారం రాత్రి చిన్మయానంద్‌ను ఏడు గంటల పాటు ప్రశ్నించింది. నిందితుడిని ప్రశ్నించిన అనంతరం ఆయన పడక గదిని పరిశీలించింది. ఫోరెన్సిక్ నిపుణుల బృందం సైతం దివ్య ధామ్‌లోని చిన్మయానంద్ గదిని తనిఖీ చేయనున్నారు. సిట్ విచారణ నేపథ్యంలో స్వామి చిన్మయానంద్ ఆశ్రమం వద్ద భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment