
లైంగిక దాడి కేసులో స్వామి చిన్మయానంద్‌కు బెయిల్
సాక్షి, న్యూఢిల్లీ : తన ఆశ్రమంలో యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ కేంద్ర మంత్రి స్వామి చిన్మయానంద్‌కు బెయిల్ లభించింది. గత ఏడాది సెప్టెంబర్‌లో లైంగిక దాడి కేసులో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. షహజన్‌పూర్‌లో లా కాలేజీలోఅడ్మిషన్ విషయమై తనకు సహాయపడిన చిన్మయానంద్..తనను ఏడాది పాటు లైంగికంగా వేధించాడని బాధిత విద్యార్థిని ఆరోపించిన విషయం విదితమే. కాలేజ్‌లోని హాస్టల్‌లో తాను స్నానం చేస్తున్న దృశ్యాలను రికార్డు చేసిన చిన్మయానంద్.. వాటిని వైరల్ చేస్తానని బెదిరిస్తూ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆమె సంచలన ఆరోపణలు చేశారు.