లక్నో: యూపీ మాజీ మంత్రి గాయత్రి ప్రజాపతికి ఊరట లభించింది. ఓ మహిళపై రెండేళ్ల పాటు అత్యాచారం చేసినట్టు ఆరోపణల నేపథ్యంలో ఆయనపై మూడేళ్ల క్రితం కేసు నమోదైంది. ఈ కేసులో ప్రజాపతి 41నెలలు( 3సంవత్సరాల 5నెలలు) పాటు లక్నో జైలులో శిక్ష అనుభవించాడు. ఈ కేసులో అలహాబాద్ హైకోర్ట్ శుక్రవారం ప్రజాపతికి బెయిల్ మంజూరు చేసింది. వివరాల్లోకి వెళ్తె సమాజ్ వాదీ పార్టీ అధికారంలో ఉండగా చిత్రకూట్‌కు చెందిన ఒ మహిళ మంత్రి ప్రజాపతితో పాటు ఆరుగురు తనను సాముహిక అత్యాచారం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో ప్రజాపతి 41నెలలు జైలు శిక్ష అనుభవించారు. ఇటీవల అనారోగ్య సమస్యలతో బెయిల్ కావాలని ప్రజాపతికి చెందిన న్యాయవాదులు కోర్టును ఆశ్రయించారు.
అయితే కేసును విచారించిన న్యాయస్థానం 5లక్షల వ్యక్తిగత బాండ్, ఇద్దరు ష్యూరిటీ 2.5 లక్షల(వ్యక్తిగత పూచిగత్తు)తో రెండు నెలల మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. కాగా వేద్ ప్రకాష్ వైష్య నేతృత్వంలోని విచారించిన ధర్మాసనం ప్రజాపతికి బెయిల్ మంజూరు చేసింది. ప్రజాపతి అనేక వ్యాధుల (మూత్రసంబంధ, మధుమేహం)తో ఇబ్బంది పడుతున్నారని డిఫెన్స్ న్యాయవాది వాదించారు. కాగా విచారణకు సహకరించాలని కోర్టు ఆదేశిస్తు నిందితులకు బెయిల్ మంజూరు చేసింది
Comments
Please login to add a commentAdd a comment