Gayatri Prajapati
-
యూపీ మాజీ మంత్రికి బెయిల్..
లక్నో: యూపీ మాజీ మంత్రి గాయత్రి ప్రజాపతికి ఊరట లభించింది. ఓ మహిళపై రెండేళ్ల పాటు అత్యాచారం చేసినట్టు ఆరోపణల నేపథ్యంలో ఆయనపై మూడేళ్ల క్రితం కేసు నమోదైంది. ఈ కేసులో ప్రజాపతి 41నెలలు( 3సంవత్సరాల 5నెలలు) పాటు లక్నో జైలులో శిక్ష అనుభవించాడు. ఈ కేసులో అలహాబాద్ హైకోర్ట్ శుక్రవారం ప్రజాపతికి బెయిల్ మంజూరు చేసింది. వివరాల్లోకి వెళ్తె సమాజ్ వాదీ పార్టీ అధికారంలో ఉండగా చిత్రకూట్‌కు చెందిన ఒ మహిళ మంత్రి ప్రజాపతితో పాటు ఆరుగురు తనను సాముహిక అత్యాచారం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో ప్రజాపతి 41నెలలు జైలు శిక్ష అనుభవించారు. ఇటీవల అనారోగ్య సమస్యలతో బెయిల్ కావాలని ప్రజాపతికి చెందిన న్యాయవాదులు కోర్టును ఆశ్రయించారు. అయితే కేసును విచారించిన న్యాయస్థానం 5లక్షల వ్యక్తిగత బాండ్, ఇద్దరు ష్యూరిటీ 2.5 లక్షల(వ్యక్తిగత పూచిగత్తు)తో రెండు నెలల మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. కాగా వేద్ ప్రకాష్ వైష్య నేతృత్వంలోని విచారించిన ధర్మాసనం ప్రజాపతికి బెయిల్ మంజూరు చేసింది. ప్రజాపతి అనేక వ్యాధుల (మూత్రసంబంధ, మధుమేహం)తో ఇబ్బంది పడుతున్నారని డిఫెన్స్ న్యాయవాది వాదించారు. కాగా విచారణకు సహకరించాలని కోర్టు ఆదేశిస్తు నిందితులకు బెయిల్ మంజూరు చేసింది -
మాజీ మంత్రికి బెయిల్; జడ్జి సస్పెన్షన్
-
మాజీ మంత్రికి బెయిల్; జడ్జి సస్పెన్షన్
న్యూఢిల్లీ: గ్యాంగ్ రేప్ కేసులో నిందితుడిగా ఉన్న ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి, సమాజ్‌వాదీ పార్టీ నేత గాయత్రి ప్రజాపతికి బెయిల్ మంజూరు చేసిన ప్రత్యేక కోర్టు జడ్జిని విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఆయనపై శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. ప్రజాపతికి ప్రత్యేక కోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. శుక్రవారం ఈ కేసును విచారించిన అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ ప్రజాపతికి మంజూరైన బెయిల్‌ను రద్దు చేసింది. అలాగే ప్రత్యేక కోర్టు న్యాయమూర్తిని హైకోర్టు అడ్మినిస్ట్రేషన్ సస్పెండ్ చేసింది. ప్రజాపతి మంత్రిగా ఉన్నప్పుడు ఆయనతో పాటు మరో ఆరుగురు తనపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారని ఓ మహిళ గత ఫిబ్రవరిలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత ఆయన పోలీసులకు దొరక్కుండా పరారయ్యారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు మార్చి 15న ప్రజాపతిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
గాయత్రి ప్రజాపతికి మళ్లీ చుక్కెదురు
లక్నో : ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి గాయత్రి ప్రజాపతికి మళ్లీ చుక్కెదురు అయింది. ఆయన బెయిల్‌పై అలహాబాద్ హైకోర్టు స్టే విధించింది. కాగా అత్యాచారం కేసులో అరెస్ట్ గాయత్రి ప్రజాపతికి రెండురోజుల క్రితం బెయిల్ మంజూరు అయింది. గాయత్రి ప్రజాపతితో సహా ఆయన అనుచరులు వికాస్ వర్మ, పింటు సింగ్‌లకు లక్నో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అత్యాచారం కేసులో మాజీమంత్రిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తడంతో ఆయన్ని అరెస్ట్ చేయాలని ఉన్నత న్యాయస్థానం ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. చాలాకాలం పరారీలో ఉన్న గాయత్రి ప్రజాపతిని మార్చి నెలలో పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన బెయిల్‌కు లక్నో కోర్టు బెయిల్ మంజూరు చేయగా, దాన్ని సవాల్ చేస్తూ బాధిత కుటుంబం హైకోర్టును ఆశ్రయించింది. -
యూపీలో మాజీ మంత్రి ప్రజాపతి అరెస్ట్
-
పరారీలోనే మంత్రి, అనుచరుడి లొంగుబాటు
లక్నో: పరారీలో ఉన్న ఉత్తరప్రదేశ్ మంత్రి గాయత్రీ ప్రజాపతి ప్రధాన అనుచరుడు, హెడ్ కానిస్టేబుల్ చంద్రపాల్ సోమవారం లక్నో పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అయితే గ్యాంగ్ రేప్ తో పాటు తల్లీకూతుళ్లపై అత్యాచారయత్నానికి పాల్పడ్డ కేసులో గాయత్రీ ప్రజాపతి ప్రస్తుతం పరారీలో ఉన్న విషయం తెలిసిందే. గత కొద్దిరోజులుగా అజ్ఞాతంలో ఉన్న ప్రజాపతి ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. అక్కడ కూడా ఆయనకు ఊరట లభించలేదు. కాగా అజ్ఞాతంలో ఉన్న మంత్రితోపాటు మరో ఆరుగురిపై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన విషయం విదితమే. ఆయన పాస్‌పోర్టుపై నాలుగు వారాలపాటు నిషేధం విధించి లుక్ ఔట్ నోటీసులు కూడా ఇచ్చింది. కాగా ఒక మహిళపై సామూహిక అత్యాచారం, ఆమె మైనర్ కుమార్తెపై వేధింపులకు పాల్పడిన ఆరోపణలపై ప్రజాపతి, మరో ఆరుగురిపై యూపీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. మంత్రిపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు తొలుత నిరాకరించడంతో బాధిత మహిళ సుప్రీంను ఆశ్రయించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ఈ అంశాన్ని బీజేపీ తనకు అనుకూలంగా ఉపయోగించుకుంటూ సమాజ్‌వాదీ పార్టీపై విమర్శల దాడి గుప్పిస్తోంది. -
ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమంటే రాజకీయాలా: సుప్రీం
న్యూఢిల్లీ: అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్పీ నేత, మంత్రి గాయత్రి ప్రసాద్ విషయంలో పోలీసులు, రాజకీయ పార్టీలు అతి చేశాయని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని తాము ఆదేశిస్తే దానికి రాజకీయ రంగు పులిమారని, ఇది చాలా దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. అదే సమయంలో ఎట్టిపరిస్థితుల్లో గాయత్రి ప్రసాద్ అరెస్టును ఆపబోమంటూ ఆయన తరుపు వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అదే సమయంలో తాము ఎఫ్ఐఆర్ మాత్రమే నమోదు చేయాలని ఆదేశించినట్లు స్పష్టతనిచ్చింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కేబినెట్ హోదాలో ఉన్న గాయత్రి ప్రసాద్‌పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. తొలుత ఆయనపై కేసు నమోదుచేసేందుకు పోలీసులు నిరాకరించడంతో బాధితులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. దీంతో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు కేసు నమోదుచేయగా ప్రస్తుతం ఈ వ్యవహారం ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు అస్త్రంగా మారింది. అటు ప్రతిపక్షాలు, అధికార పక్షం ఒకరిపై ఒకరు దాడికి దిగుతున్నారు. ఈ కారణంగా ప్రస్తుతం గాయత్రి పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీం ఆయన అరెస్టుపై స్టేకు నిరాకరించడంతోపాటు రాజకీయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేబినెట్లో రేపిస్టు మంత్రా?
అఖిలేశ్‌యాదవ్‌ను ప్రశ్నించిన యూపీ గవర్నర్ లక్నో: ‘అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న సమాజ్‌వాదీ పార్టీ నేత గాయత్రి ప్రజాపతి ఇంకా మీ కేబినెట్లో ఎందుకు?’ అని ప్రశ్నిస్తూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌కు ఆ రాష్ట్ర గవర్నర్ రామ్‌నాయక్ ఆదివారం ఘాటు లేఖ రాశారు. ‘ఒక రేప్ కేసులో మంత్రి తప్పించుకు తిరుగుతుండడంతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. ఆయన పాస్‌పోర్టును నాలుగు వారాలపాటు సీజ్ చేయడంతోపాటు లుకౌట్ నోటీసులు కూడా అంటించారు. ఇది తీవ్రమైన విషయం. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనను ఇంకా కేబినెట్లో కొనసాగించడం వల్ల రాజ్యాంగ నైతికత, గౌరవానికి సంబంధించి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీన్ని మీరు సమర్థించుకుంటున్నారా?’ అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై సీఎంను వివరణ కోరారు. ‘లొంగిపోవాలని సీఎం స్వయంగా చెప్పినా, ప్రజాపతి ఆ పని చేయకుండా పరారీలో ఉన్నారు. విదేశాలకు తప్పించుకుని పోయే అవకాశముందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి’ అని గవర్నర్ పేర్కొన్నారు. ఒక మహిళపై సామూహిక అత్యాచారం, ఆమె మైనర్ కుమార్తెపై వేధింపులకు పాల్పడిన ఆరోపణలపై ప్రజాపతి, మరో ఆరుగురిపై యూపీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. అధికారంలోకి రాగానే అరెస్ట్: షా తాము యూపీలో అధికారంలోకి రాగానే మొదట చేసే పనుల్లో ప్రజాపతి అరెస్ట్ ఒకటని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. అంబేడ్కర్‌నగర్‌లో జరిగిన ఎన్నికల సభలో చెప్పారు. అతణ్ని నరకంలో ఉన్నా పట్టితెచ్చి జైలుకు పంపుతామన్నారు. ప్రజాపతి గత నెల 27న పోలింగ్ కేంద్రానికొచ్చి ఓటేశారని, అయినా పోలీసులు ఏమీ చేయలేకపోయారని దుయ్యబట్టారు. -
‘అఖిలేశ్.. నీ కేబినెట్లో రేప్ మంత్రి ఎందుకు?’
లక్నో: అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉత్తరప్రదేశ్ సమాజ్‌వాది పార్టీ నేత గాయత్రి ప్రజాపతి ఇంకా మీ కేబినెట్లో ఎందుకని ప్రశ్నిస్తూ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌కు ఆ రాష్ట్ర గవర్నర్ రామ్ నాయక్ లేఖ రాశారు.ఇప్పటికీ ఆయనను ఎందుకు కేబినెట్లో కొనసాగిస్తున్నారని ప్రశ్నిస్తూ వివరణ కోరారు. దీనికి సంబంధించి వివరణ కోరుతూ ఆయన అఖిలేశ్ కు లేఖ పంపించినట్లు కూడా రాజ్‌భవన్ వర్గాల ద్వారా తెలుస్తోంది. లైంగిక దాడి కేసులో గాయత్రి ప్రజాపతిపై అరెస్టు వారెంట్ జారీ అయిన విషయం తెలిసిందే. ఆయన తప్పించుకు తిరుగుతుండటంతో నాన్‌బెయిలబుల్ వారెంట్ కూడా ఇష్యూ అయింది. ఆయన పాస్‌పోర్టును నాలుగువారాలపాటు సీజ్ చేయడంతోపాటు లుకౌట్ నోటీసులు కూడా అంటించారు. ఈ నేపథ్యంలో ఇంకా కేబినెట్లో కొనసాగించడంపై గవర్నర్ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రధాని మోదీ ఈ విషయంలో పలుమార్లు అఖిలేశ్‌పై దాడి చేసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు కేసు నమోదు చేయించినా ఆ వ్యక్తి కోసం అఖిలేశ్ ప్రచారానికి వెళుతున్నారని ఎద్దేవా చేశారు. మరోపక్క, యూపీ బీజేపీ అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య కూడా గవర్నర్ నోటీసుల నేపథ్యంలో స్పందించారు. తనకు ప్రియమైన గాయత్రిని అరెస్టు చేయలేకపోయినా కనీసం తన కేబినెట్లో నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. -
బీపీఎల్ కార్డుహోల్డర్‌గా, మంత్రిగా.. నేడు రేపిస్టుగా
లక్నో: అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం పరారీలో ఉన్న ఉత్తరప్రదేశ్ సమాజ్‌వాది పార్టీ నేత, మంత్రి గాయత్రి ప్రజాపతి గురించి పలు విస్మయకరమైన విషయాలు వెలుగుచూశాయి. అసలు ఎవరు ఈ గాయత్రి, గతంలో ఏం చేసేవాడు? మంత్రి స్థాయికి ఎలా ఎదిగాడు? మంత్రిగా ఉండి కూడా అత్యాచారం చేసే దుస్సాహసం ఎలా చేయగలిగాడనే తదితర అంశాలపై పలు ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. ఓ మహిళపై రెండేళ్లపాటు లైంగిక దాడికి పాల్పడటంతోపాటు ఆమె కూతురుని కూడా చెరిచే ప్రయత్నం చేసిన గాయత్రి, ఆయన సహచరులు ప్రస్తుతం కేసును ఎదుర్కొంటున్నాడు. పోలీసులకు దొరకకుండా పరారీలో ఉన్నాడు. ఇతడి కేసు రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే అతడిపై నాన్‌బెయిలబుల్ వారెంట్ ఇష్యూ కావడంతో దానిపై స్టే తీసుకునేందుకు అతడి తరుపు న్యాయవాదులు ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి గాయత్రి ప్రసాద్ గురించి కొన్ని విషయాలు పరిశీలిస్తే.. 2012 వరకు బీపీఎల్ కార్డు హోల్డర్‌గా.. గత ఐదేళ్లలో గాయత్రి ప్రజాపతి రాజకీయాల్లోకి అడుగుపెట్టి దాదాపు తన చుట్టూ సునామీలాంటి వాతావరణం సృష్టించాడు. 2012 వరకు కూడా అతడు బీపీఎల్ కార్డు హోల్డర్. దాదాపు నాలుగుసార్లు విఫలమయ్యి 2012లో తొలిసారి విజయం సాధించాడు. కాంగ్రెస్ పార్టీకి చెందిన అమితా సింగ్‌ను ఓడించాక అతడికి మరింత పేరొచ్చింది. దాంతో నేరుగా అతడికి సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం, శివపాల్ యాదవ్‌తో మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. తొలుత అఖిలేశ్ మంత్రి వర్గంలోకి స్వతంత్ర శాఖ నిర్వహిస్తూ అనతి కాలంలోనే మైనింగ్ మంత్రిగా మారాడు. ఆ వెంటనే కేబినెట్ ర్యాంకు కూడా అతడి వచ్చింది. దాంతో మైనింగ్ శాఖ ఇంఛార్జ్ మంత్రిగా కొనసాగాడు. నేరాలు ఒక్కొక్కటిగా బయటకు.. గాయత్రి నేరాలకు పాల్పడుతున్నాడని, తన శాఖలో అక్రమాలకు దిగాడని ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు నూతన్ ఠాకుర్ 2015 జనవరిలో లోకాయుక్తను ఆశ్రయించారు. ఆ తర్వాత అతడికి వ్యతిరేకంగా డాక్యుమెంటరీ ప్రూప్స్ కూడా అతడు అక్రమంగా కోట్లు వెనుకేశాడని బయటపడ్డాయి. అమితాబ్ ఠాకూర్ అనే ఐపీఎస్ అధికారి కూడా గాయత్రి ప్రజాపతిపై ఫిర్యాదుల పరంపర సాగించారు. ఈ విషయంలో ములాయం జోక్యం చేసుకొని ఆ ఐపీఎస్‌ను నిలదీసి వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఓ పక్క లోకాయుక్త అతడికి అక్రమాస్తుల కేసులో క్లీన్ చిట్ ఇవ్వగా అలహాబాద్ హైకోర్టు మాత్రం మైనింగ్ అక్రమాలపై విచారణ చేయాలని సీబీఐని ఆదేశించింది. దీంతో అఖిలేశ్ ఆయనను మంత్రి వర్గం నుంచి తొలగించాడు. ఇప్పటికీ అతడిపై సీబీఐ విచారణ సాగుతునే ఉంది. ఇప్పుడు గ్యాంగ్ రేప్ కేసు.. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో బిజిబిజీగా ఉండగా గాయత్రి ప్రజాపతిపై ఓ అత్యాచారం ఘటనకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదైంది. అంతకుముందు బాధితులు పోలీస్ మెట్లెక్కినా స్పందించకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించగా కోర్టు జోక్యం చేసుకొని అతడిపై మరో ఆరుగురిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ఆదేశించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు 2014 అక్టోబర్ నెలలో తొలిసారి లైంగికదాడి చేయడం ప్రారంభించిన ప్రజాపతి జూలై 2016వరకు పలుమార్లు బెదిరిస్తూ అదే దుశ్చర్య చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత ఆమె కూతురుపై కూడా అలాంటి దుర్మార్గం చేసే ప్రయత్నం చేశాడు. దీనిపైనే గత నెల(ఫిబ్రవరి) 18న కేసు నమోదు కాగా ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నాడు. -
‘రేపిస్టు’ మంత్రిపై నాన్‌బెయిలబుల్ వారెంట్
లక్నో: అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉత్తరప్రదేశ్ వివాదాస్పద మంత్రి గాయత్రి ప్రజాపతి, మరో ఆరుగురిపై నాన్ బెయిలబుల్ వారెంట్ కోర్టు జారీచేసింది. ఆయన పాస్ పోర్టును నాలుగు వారాలపాటు ఆయన పాస్‌పోర్టుపై నాలుగువారాలపాటు నిషేధం విధించింది. మరోపక్క, అజ్ఞాతంలో వెళ్లిన ఆయనకోసం లుక్ ఔట్ నోటీసులు వేయాలని కూడా సర్క్యులర్ విడుదల చేశారు. తనపై, తన మైనర్ కూతురుపై ప్రజాపతి ఆయన సమూహం లైంగిక దాడికి పాల్పడ్డారని ఓ మహిళ కేసులు పెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె కూతురు ఆస్పత్రిలో కోలుకుంటోంది. తొలుత ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసులు పెట్టేందుకు నిరాకరించడంతో ఆమె సుప్రీంకోర్టుకు వెళ్లగా ఈ కేసులో కదలిక ఏర్పడింది. సుప్రీం చెప్పిన అనంతరం కేసు నమోదు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అమేథిలోని మంత్రి ఇంట్లో సోదాలు చేశారు. ఆయన అంతకుముందే లక్నో వెళ్లినట్టు తెలుసుకున్న పోలీసులు లక్నోలోని మంత్రి బంగ్లాకు వెళ్లగా అక్కడ కూడా ఆయన లేరు. మంత్రి అజ్ఞాతంలోకి వెళ్లినట్టు లక్నో ఎస్పీ చెప్పారు. ఆయనను త్వరలోనే అరెస్ట్ చేస్తామని తెలిపారు. ఇప్పటికీ ఆయన జాడ తెలియకపోవడంతో నాన్‌బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయింది. యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఇటీవల ప్రజాపతిని మంత్రివర్గం నుంచి తొలగించారు. ములాయం విధేయుడైన ప్రజాపతిని ఆయన సూచన మేరకు అఖిలేష్ మళ్లీ కేబినెట్లో చేర్చుకున్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాపతి ఎస్పీ తరఫున అమేథి నుంచి పోటీ చేస్తున్నారు. అఖిలేష్ ఇటీవల అమేథికి ప్రచారానికి వెళ్లినపుడు ప్రజాపతిని వేదికపైకి అనుమతించలేదు. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజాపతిని అఖిలేష్ మంత్రివర్గంలో కొనసాగించడంపై ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తున్నారు. -
‘గాయత్రిని జైలులో వేస్తే చూడాలని ఉంది’
న్యూఢిల్లీ: తనపై లైంగిక వేధింపులకు, తన తల్లిపై వరుసగా అత్యాచారానికి పాల్పడిన ప్రజా ప్రతినిధి సమాజ్‌వాది పార్టీ నేత, ఉత్తరప్రదేశ్ మంత్రి గాయత్రి ప్రజాపతి, అతడి సహచరులు జైలుకి వెళితే చూడాలని ఉందని బాధితురాలైన మైనర్ చెప్పింది. వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎయిమ్స్ ఆస్పత్రి వద్దకు బాధితురాలి వాంగ్మూలం తీసుకునేందుకు బయలుదేరిన నేపథ్యంలో ఆమె తన కోరికను మీడియాకు చెప్పింది. ‘ఈ కేసులో మైనర్ తప్ప ఇతర బాధితులు, వారికి సంబంధించిన వారందరి వాంగ్మూలం నమోదు చేసుకున్నాం. ప్రస్తుతం మైనర్ బాలిక ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న నేపథ్యంలో అక్కడికి మా పోలీసు బృందం వెళ్లింది. వైద్యులు అనుమతించడంతో మా బృందం అక్కడికి వెళ్లింది’ అని అడిషనల్ డీజీపీ దల్జీత్ చౌదరి చెప్పారు. పదో తరగతి చదువుతున్న ఆ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో దాదాపు కోమా స్టేజీలోకి వెళ్లి తిరిగొచ్చింది. అయినప్పటికీ భయంభయంగా ఉంటూ ఆస్పత్రిలో అర్థరాత్రి కేకలు పెట్టుకుంటూ పారిపోయేందుకు ప్రయత్నిస్తోంది. ఇదంతా కూడా గత చెడు అనుభవం ప్రభావంతో వస్తోందని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికీ, ప్రజాపతి, అతడి గ్యాంగ్‌ను ఆమెను ఏదో చేసేందుకు వస్తున్నారనే భయంతోనే ఉందని, వారిని జైలులో పెడితే చూడాలని కోరుకుంటుందని సమాచారం. ‘నన్ను రేప్ చేయాలని ప్రయత్నించిన ప్రజాపతి అతడి ముఠాను జైలులో పెట్టాలి. అతడు మా జీవితం మొత్తాన్ని ధ్వంసం చేశాడు. మేం ఇళ్లు విడిచిపెట్టేశాం’ అని మైనర్ బాధితురాలు చెప్పింది. సమాజ్ వాది పార్టీలో మంచి పొజిషన్ ఇస్తానని నమ్మబలికించి తీసుకెళ్లి తొలుత ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడిన ప్రజాపతి, అతడి సహచరులు, అనంతరం వీడియోలు తీసి బెదిరించి వరుసగా రెండేళ్లపాటు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత 2016లో ఓసారి ఆమె కూతురు అయిన మైనర్‌పై కూడా లైంగికదాడికి పాల్పడేందుకు ప్రయత్నించడంతో ఆ మైనర్ భయంతో ఆస్పత్రి పాలైంది. ఇప్పటికే గాయత్రి ప్రజాపతికి సుప్రీంకోర్టులో చుక్కెదురైన విషయం తెలిసిందే. సామూహిక అత్యాచారం, లైంగిక వేధింపుల కేసులో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఎనిమిది వారాల్లోగా స్థాయి నివేదిక సమర్పించాలని ఉత్తరప్రదేశ్ పోలీసులను అజ్ఞాపించింది. -
రేప్ కేసు: మంత్రి అదృశ్యం!
సుప్రీంకోర్టు సూచనల మేరకు ఉత్తర ప్రదేశ్ మంత్రి గాయత్రీ ప్రజాపతి మీద పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేయడంతో.. ఆయన ఉన్నట్టుండి అదృశ్యం అయిపోయారు. ఆయనను ప్రశ్నించేందుకు వెళ్లిన పోలీసులకు మంత్రి ఆచూకీ ఎక్కడా దొరకలేదు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో అమేథి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సమాజ్‌వాదీ పార్టీ తరఫున పోటీ చేస్తున్న గాయత్రీ ప్రజాపతి కోసం అక్కడ గాలించినా కనిపించలేదు. లక్నోలోని తన అధికారిక బంగ్లాలో కూడా ఆయన లేరు. ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు తాము ఒక పోలీసు బృందాన్ని అమేథీకి పంపగా.. ఆయన లక్నో వెళ్లిపోయినట్లు చెప్పారని, కానీ లక్నోకు కూడా రాలేదని లక్నో సీనియర్ ఎస్పీ మంజిల్ సైనీ చెప్పారు. ప్రస్తుతానికి తాము కేవలం ఆయన వాంగ్మూలమే నమోదు చేయాలనుకుంటున్నామని, కానీ ఆయన ఇలాగే తప్పించుకుని తిరిగితే తాము ఇతర చర్యలు కూడా చేపట్టాల్సి ఉంటుందని ఆమె చెప్పారు. మంత్రిని అరెస్టు చేయడానికి తగిన వారంటు కోసం కోర్టును ఆశ్రయించే అవకాశం కూడా లేకపోలేదన్నారు. ప్రజాపతి ఎక్కడున్నారో గమనించేందుకు ఆయన సెల్‌ఫోన్ కాల్ డీటైల్ రికార్డు (సీడీఆర్) కూడా సేకరించినట్లు తెలుస్తోంది. మంత్రి గాయత్రీ ప్రజాపతి, ఆయన అనుచరులు కలిసి తనపై అత్యాచారం చేశారని ఓ బాలిక ఫిర్యాదు చేయడం, ఆమె కోర్టు ముందు తన వాంగ్మూలం కూడా చెప్పడంతో.. ఈ కేసు ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం ఆ బాలికకు ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స అందిస్తున్నారు. -
మంత్రి పరార్.. పోలీసుల గాలింపు
లక్నో: అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉత్తరప్రదేశ్ వివాదాస్పద మంత్రి గాయత్రి ప్రజాపతి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆయనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు గాలిస్తున్నారు. తనపై, తన మైనర్ కూతురుపై ప్రజాపతి ఆయన అనుచరులు లైంగిక దాడికి పాల్పడ్డారని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మంగళవారం అమేథిలోని మంత్రి ఇంట్లో సోదాలు చేశారు. ఆయన అంతకుముందే లక్నో వెళ్లినట్టు తెలుసుకున్న పోలీసులు లక్నోలోని మంత్రి బంగ్లాకు వెళ్లగా అక్కడ కూడా ఆయన లేరు. మంత్రి అజ్ఞాతంలోకి వెళ్లినట్టు లక్నో ఎస్పీ చెప్పారు. ఆయనను త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పారు. యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఇటీవల ప్రజాపతిని మంత్రివర్గం నుంచి తొలగించారు. ములాయం విధేయుడైన ప్రజాపతిని ఆయన సూచన మేరకు అఖిలేష్ మళ్లీ కేబినెట్లో చేర్చుకున్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాపతి ఎస్పీ తరఫున అమేథి నుంచి పోటీ చేస్తున్నారు. అఖిలేష్ ఇటీవల అమేథికి ప్రచారానికి వెళ్లినపుడు ప్రజాపతిని వేదికపైకి అనుమతించలేదు. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజాపతిని అఖిలేష్ మంత్రివర్గంలో కొనసాగించడంపై ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తున్నారు. -
మంత్రి ఇంట్లో పోలీసుల సోదాలు
లక్నో: ఉత్తరప్రదేశ్ మంత్రి గాయత్రి ప్రజాపతి ఇంట్లో పోలీసులు మంగళవారం సోదాలు నిర్వహించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో పోలీసులు సోదాలు జరిపారు. దర్యాప్తులో భాగంగా సోదాలు నిర్వహించామని, త్వరలోనే ఆయనను అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలతో అంతకుముందు ప్రజాపతి, ఆయన ఆరుగురు అనుచరులపై యూపీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తనపై, తన మైనర్ కూతురుపై ప్రజాపతి ఆయన అనుచరులు లైంగిక దాడికి పాల్పడ్డారని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేసేందుకు నిరాకరించడంతో బాధితురాలు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశించిన తర్వాతే పోలీసులు కేసు నమోదు చేశారు. ఎనిమిది వారాల్లోగా నివేదిక ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. -
మోదీ దెబ్బకు రేప్ ఆరోపణల మంత్రి మాయం
అమేథి: ప్రధాని నరేంద్రమోదీ చేసిన విమర్శలు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌పై వెంటనే ప్రభావం చూపించాయి. సోమవారం అమేథిలో ప్రచారానికి వెళ్లిన అఖిలేశ్ లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉత్తరప్రదేశ్ మంత్రి గాయత్రి ప్రజాపతి ఉన్న వేదికను పంచుకోలేదు. అంతేకాదు, ప్రచారంలో ఆయన పేరును కూడా ఉపయోగించకుండానే ప్రజలను ఓట్లు అడిగారు. తొలుత సభావేదికపైనే గాయత్రి ప్రజాపతి ఉన్నప్పటికీ అఖిలేశ్ వచ్చే సమయంలో మాత్రం అక్కడి నుంచి మాయమయ్యారు. ప్రజల్లోకి వ్యతిరేక సంకేతాలు వెళతాయనే కారణంతోనే అఖిలేశ్ ఆయనను దూరంగా పెట్టినట్లు తెలుస్తోంది. తనపై, తన మైనర్ కూతురుపై ప్రజాపతి ఆయన సమూహం లైంగిక దాడికి పాల్పడ్డారని ఓ మహిళ కేసులు పెట్టింది. ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసులు పెట్టేందుకు నిరాకరించడంతో ఆమె సుప్రీంకోర్టుకు కూడా వెళ్లింది. అనంతరం కోర్టు ఆదేశించిన తర్వాతే కేసు నమోదు చేశారు. ఎనిమిది వారాల్లోగా నివేదిక ఇవ్వాలని కూడా కోర్టు ఆదేశించింది. అంతకుముందు అక్రమ మైనింగ్‌లకు పాల్పడ్డాడని కూడా ప్రజాపతిపై ఆరోపణలు ఉన్నాయి. రేపిస్టులను స్వేచ్ఛగా వదిలేశారు. న్యాయంకోసం మహిళలు సుప్రీంకోర్టు తలుపులు తడుతున్నారు. మీరు ఏం పనిచేస్తున్నారు అఖిలేశ్ జీ?మీ మంత్రి(ప్రజాపతి) లైంగిక దాడి కేసులో ఉన్నాడు. మీరు వెళ్లి ఆయన తరుపున ప్రచారం చేస్తున్నారు. ఇది చేయాల్సిన పని కాదు’ అని ప్రధాని మోదీ ఘాటుగా విమర్శించారు. ఈ నేపథ్యంలో సోమవారంనాటి ప్రచారంలో అఖిలేశ్ తన మంత్రిని పక్కకు పెట్టినట్లు తెలుస్తోంది. -
ఉత్తరప్రదేశ్ మంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదు
లక్నో: సుప్రీంకోర్టు ఆదేశాలతో యూపీ మంత్రి గాయత్రీ ప్రజాపతి, అతని ఆరుగురు అనుచరులపై యూపీ పోలీసులు శనివారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఓ మహిళను గ్యాంగ్రేప్చేసి, ఆమె కూతురినీ చెరబట్టాలని చూశారనే ఆరోపణలపై వివిధ సెక్షన్లు, పోక్సో (లైంగిక నేరాల నుంచి చిన్నారులకు రక్షణ) చట్టం కింద నిందితులపై కేసులు నమోదయ్యాయి. బాధితురాలి కథనం ప్రకారం 2014 అక్టోబరు నుంచి 2016 జూలై వరకు పలుమార్లు మంత్రి, అనుచరులు కలిసి ఆమెను రేప్ చేశారు. తర్వాత ఆమె కూతరుపైనా దుర్మార్గులు కన్నేయడంతో బాధితురాలు 2016 అక్టోబరులో రాష్ట్ర డీజీపీని కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. అయినా నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు కాకపోవడంతో ఆమె న్యాయం కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. -
యూపీ మంత్రికి చుక్కెదురు
గాయత్రి ప్రజాపతి ఎఫ్ఐఆర్ నమోదుకు సుప్రీంకోర్టు ఆదేశం న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ మంత్రి గాయత్రి ప్రజాపతికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. సామూహిక అత్యాచారం, లైంగిక వేధింపుల కేసులో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఎనిమిది వారాల్లోగా స్థాయి నివేదిక సమర్పించాలని ఉత్తరప్రదేశ్ పోలీసులను అజ్ఞాపించింది. మూడేళ్ల క్రితం ప్రజాపతిని కలిసినప్పుడు తనపై ఆయన అత్యాచారానికి పాల్పడ్డారని 35 ఏళ్ల మహిళ ఫిర్యాదు చేసింది. ఈ ఘాతుకాన్ని ఫొటోలు తీశారని వెల్లడించింది. ఈ ఫొటోలను బయటపెడతామని భయపెట్టి గత రెండేళ్లుగా తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. కాగా, సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవిస్తానని మంత్రి ప్రజాపతి తెలిపారు. బీజేపీ కుట్రపూరితంగా తనకు వ్యతిరేకంగా కేసు పెట్టించిందని ఆయన రోపించారు. వాస్తవాలు త్వరలోనే వెల్లడవుతాయని అన్నారు.