లక్నో : ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి గాయత్రి ప్రజాపతికి మళ్లీ చుక్కెదురు అయింది. ఆయన బెయిల్‌పై అలహాబాద్ హైకోర్టు స్టే విధించింది. కాగా అత్యాచారం కేసులో అరెస్ట్ గాయత్రి ప్రజాపతికి రెండురోజుల క్రితం బెయిల్ మంజూరు అయింది. గాయత్రి ప్రజాపతితో సహా ఆయన అనుచరులు వికాస్ వర్మ, పింటు సింగ్‌లకు లక్నో కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
అత్యాచారం కేసులో మాజీమంత్రిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తడంతో ఆయన్ని అరెస్ట్ చేయాలని ఉన్నత న్యాయస్థానం ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. చాలాకాలం పరారీలో ఉన్న గాయత్రి ప్రజాపతిని మార్చి నెలలో పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన బెయిల్‌కు లక్నో కోర్టు బెయిల్ మంజూరు చేయగా, దాన్ని సవాల్ చేస్తూ బాధిత కుటుంబం హైకోర్టును ఆశ్రయించింది.