Swami Chinmayananda
-
చిన్మయానంద కేసులో భారీ ట్విస్ట్
లక్నో: కేంద్ర మాజీ మంత్రి స్వామి చిన్మయానంద లైంగిక దాడి కేసు కీలక మలుపు తిరిగింది.. చిన్మయానంద తనపై లైంగిక దాడికి పాల్పడ్డారంటూ గతేడాది ఆరోపించిన లా విద్యార్థిని తాజాగా యూటర్న్ తీసుకుంది. ఆయన తనపై లైంగిక దాడికి పాల్పడలేదని కోర్టు ముందు పేర్కొంది. దాంతోపాటు ఆయనపై పెట్టిన కేసును వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపింది. అయితే ఆమె కేసు వాపస్ తీసుకోవడానికి గల కారణాలు మాత్రం స్పష్టంగా తెలియరాలేదు. షహజాన్‌పూర్‌లో చదువుతున్న లా విద్యార్థిని గతేడాది ఆగస్టులో కనిపించకుండా పోయింది. తరువాత తిరిగి వచ్చిన ఆమె మాజీ మంత్రి చిన్మయానందపై లైంగిక ఆరోపణలు చేసింది. చాలా పోరాటాలు జరిగిన తరువాత గతేడాది సెప్టెంబర్‌లో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. అలహాబాద్ హైకోర్టులో ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ప్రత్యేక బ్రాంచ్ ఈ కేసు విచారణను చేపట్టింది. ఫిబ్రవరిలో చిన్మయానంద బెయిల్‌పై బయటకు వచ్చారు. మంగళవారం ఈ కేసు విచారణకు రాగా, చిన్మయానంద తనపై ఎలాంటి లైంగిక దాడికి పాల్పడలేదని విద్యార్థిని కోర్టుకు తెలిపింది. అయితే మాజీ మంత్రి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ గతంలో ఆరోపించిన విద్యార్థిని తాజాగా మాట మార్చడంతో న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పుడు ఆరోపణలు చేసినందుకు ఆమెపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. న్యాయ విద్యార్థిని మాట మార్చడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చదవండి: బెయిల్‌పై వచ్చి ఘనంగా బర్త్‌డే -
బెయిల్‌పై వచ్చి ఘనంగా బర్త్‌డే
లక్నో: లైంగికదాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నేత, కేంద్రమాజీ మంత్రి స్వామి చిన్మయానంద్ మంగళవారం బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన బుధవారం షాజహాన్‌పూర్‌లోని ముముస్కు ఆశ్రమంలో తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. వందలాది మంది ఆయనను కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రామ మందిరానికి పాటుపడ్డవారిపై ఆయన ప్రశంసలు కురిపించారు. అయోధ్యలో శ్రీరాములవారి గుడి నిర్మాణం కోసం పాటుపడ్డవారందరినీ యోధులుగా అభివర్ణించారు. వారివల్లే నేడు ఆలయ నిర్మాణం కల సాకారమవుతోందన్నారు. మంగళవారం సాయంత్రం రామాయణంలోని సుందరకాండ అధ్యాయాన్ని పారాయణంతో బర్త్‌డే వేడుకలు ప్రారంభించినట్లు ఆశ్రమ అధికారులు తెలిపారు. అనంతరం ఈ కార్యక్రమానికి వచ్చిన సందర్శకులకు ప్రత్యేక ప్రసాదాలు అందజేశామన్నారు. మరోవైపు చిన్మయానందకు బెయిల్ ఇవ్వడంపై వచ్చిన అభ్యంతరాలను బుధవారం సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. (రేప్ కేసులో చిన్మయానంద అరెస్ట్) ఇద్దరి అరెస్టు, బాధితురాలి విడుదల ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్పూర్లో లా కాలేజీలో అడ్మిషన్ రావడానికి సహకరించిన చిన్మయానంద్.. తనను ఏడాది పాటు లైంగికంగా వేధించాడని ఓ విద్యార్థిని ఆరోపించింది. అంతేకాక పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని, తనతో మసాజ్ చేయించుకున్నాడని సంచలన ఆరోపణలు చేసింది. దీనిపై పోలీసులకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేయడంతో సిట్బృందం సెప్టెంబర్ 20న చిన్మయానందను అరెస్టు చేసింది. ఇదిలావుండగా అత్యాచారం కేసులో బాధితురాలైన న్యాయ విద్యార్థిని డబ్బులు గుంజేందుకు బ్లాక్ మెయిల్ చేస్తుందనే ఫిర్యాదు మేరకు సిట్ ఆమెపై కూడా కేసు నమోదు చేసి బాధితురాలిని అరెస్ట్ చేయగా డిసెంబర్ 4న విడుదల చేశారు. (చిన్మయానంద కేసులో కొత్త ట్విస్ట్.. విద్యార్థిని అరెస్ట్) చదవండి: ‘సిట్ ఆయనను రక్షించే ప్రయత్నం చేస్తోంది!’ (స్వామి చిన్మయానంద్‌కు బెయిల్) -
స్వామి చిన్మయానంద్‌కు బెయిల్
సాక్షి, న్యూఢిల్లీ : తన ఆశ్రమంలో యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ కేంద్ర మంత్రి స్వామి చిన్మయానంద్‌కు బెయిల్ లభించింది. గత ఏడాది సెప్టెంబర్‌లో లైంగిక దాడి కేసులో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. షహజన్‌పూర్‌లో లా కాలేజీలోఅడ్మిషన్ విషయమై తనకు సహాయపడిన చిన్మయానంద్..తనను ఏడాది పాటు లైంగికంగా వేధించాడని బాధిత విద్యార్థిని ఆరోపించిన విషయం విదితమే. కాలేజ్‌లోని హాస్టల్లో తాను స్నానం చేస్తున్న దృశ్యాలను రికార్డు చేసిన చిన్మయానంద్.. వాటిని వైరల్ చేస్తానని బెదిరిస్తూ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. చదవండి : సిగ్గుపడుతున్నా.. ఇంకేం చెప్పలేను: చిన్మయానంద్ -
అవును.. లైంగికంగా వేధించాను: చిన్మయానంద్
లక్నో : లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో అరెస్టైన బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి స్వామి చిన్మయానంద్ (73) నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. తాను నిర్వహించే కాలేజీలో న్యాయవాద విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ఒప్పుకున్నారని ప్రత్యేక దర్యాప్తు బృందం చీఫ్ నవీన్ అరోరా మీడియాకు వెల్లడించారు. షహజన్‌పూర్‌లో లా కాలేజీలో అడ్మిషన్ విషయమై తనకు సహాయపడిన చిన్మయానంద్..తనను ఏడాది పాటు లైంగికంగా వేధించాడని బాధిత విద్యార్థిని ఆరోపించిన విషయం విదితమే. కాలేజ్‌లోని హాస్టల్లో తాను స్నానం చేస్తున్న దృశ్యాలను రికార్డు చేసిన చిన్మయానంద్.. పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో శుక్రవారం సిట్ అధికారులు ఆయనను అరెస్టు చేశారు. కోర్టు ముందు చిన్మయానంద్‌ను హాజరుపరచగా 14 రోజుల పాటు జైలుకు తరలించింది. ఈ నేపథ్యంలో సిట్ అధికారి మాట్లాడుతూ...తనపై వచ్చిన ఆరోపణలు అన్నింటినీ చిన్మయానంద్ అంగీకరించానని తెలిపారు. బాధితురాలిని లైంగికంగా వేధించినట్లు, నగ్నంగా ఉన్న తనకు మసాజ్ చేయాల్సిందిగా ఆమెను ఇబ్బంది పెట్టినట్లు ఒప్పుకొన్నారని పేర్కొన్నారు. విచారణలో భాగంగా చిన్మయానంద్ తన నేరాన్ని అంగీకరించారని, తాను చేసిన పనులకు ఇప్పటికే సిగ్గుపడుతున్నానని, ఇక వాటి గురించి ఇంకా ఏం చెప్పలేనంటూ ఆయన పశ్చాత్తాపంతో కుంగిపోయినట్లు వెల్లడించారు. కాగా అడ్మిషన్‌తో పాటు లైబ్రరీలో తనకు ఉద్యోగం ఇప్పించిన చిన్మయానంద్ కోరిక మేరకు ఆశ్రమంలో ఆయనను కలిశానని బాధితురాలు పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాను హాస్టల్లో స్నానం చేస్తున్న వీడియోను చూపి..దాన్ని వైరల్ చేస్తానని బెదిరించి ఆయన తనను లోబరుచుకున్నాడని ఆరోపించారు. అనంతరం లైంగిక దాడి దృశ్యాలనూ రికార్డు చేసిన చిన్మయానంద్ వాటిని చూపి బ్లాక్మెయిల్ చేసేవాడని ఆవేదన వ్యక్తం చేశారు. స్వామి శిష్యులు తనకు తుపాకీ గురిచూపి ఆయన వద్దకు తీసుకువెళ్లేవారని, ఆయనకు తనతో మసాజ్ చేయించేవారని సంచలన ఆరోపణలు చేశారు. Naveen Arora, Special Investigation Team Chief: Swami Chinmayanand has admitted to almost every allegation levelled against him,including sexual conversations&body massage.Circumstantial evidences also being examined.He said he doesn’t want to say more as he's ashamed of his acts https://t.co/d8zfRm0f7K pic.twitter.com/DhdrjN8FOF — ANI UP (@ANINewsUP) September 20, 2019 -
లైంగిక వేధింపుల కేసు : చిన్మయానంద్ అరెస్ట్
షహజన్‌పూర్ : తాను నిర్వహించే కాలేజ్‌లో చదివిన వైద్య విద్యార్ధినిచే లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి స్వామి చిన్మయానంద్ (73)ను శుక్రవారం సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. చిన్మయానంద్‌ను పోలీసులు కోర్టు ఎదుట హాజరు పరచగా న్యాయస్ధానం ఆయనను 14 రోజుల పాటు జైలుకు తరలించింది. అనారోగ్య కారణాలతో చిన్మయానంద్ గురువారం ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. యూపీలో పలు ఆశ్రమాలు, విద్యాసంస్ధలు నడుపుతూ రాజకీయ ప్రాబల్యం కలిగిన చిన్మయానంద్‌పై బాధితురాలు నెలరోజుల కిందటే ఫిర్యాదు చేసినా ఆయనపై చాలా రోజుల వరకూ లైంగిక దాడి కేసు నమోదు చేయలేదు. సుప్రీం కోర్టు జోక్యంతో కేసులో కదలిక రాగా, సోమవారం భారీ భద్రత నడుమ బాధితురాలు చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ర్టేట్ కోర్టులో స్టేట్మెంట్ ఇచ్చిన క్రమంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాలేజీలో అడ్మిషన్ ఇచ్చేందుకు సాయపడిన చిన్మయానంద్ తనను ఏడాది పాటు లైంగికంగా వేధించాడని బాధిత విద్యార్థిని ఆరోపించిన సంగతి తెలిసిందే. కాలేజ్ హాస్టల్లో ఆమె స్నానం చేస్తున్న దృశ్యాలను రికార్డు చేసి చిన్మయానంద్ తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆమె ఆరోపించారు. స్వామి పాడుబుద్ధిని బయటపెట్టేందుకు ఆధారాల కోసం తన కళ్లద్దాల్లో కెమెరా అమర్చి రికార్డు చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. చిన్మయానంద్‌పై పరోక్షంగా ఫేస్బుక్లో పోస్ట్ చేసిన అనంతరం ఆగస్ట్ 24 నుంచి ఆమె అదృశ్యమయ్యారు. వారం తర్వాత యూపీ పోలీసులు ఆమె ఆచూకీని కనుగొన్నారు. మరోవైపు బాధితురాలి ఆరోపణలను పరిశీలించిన సుప్రీం కోర్టు సిట్ విచారణకు ఆదేశించింది. బాధితురాలి హాస్టల్ గదిని పరిశీలించిన సిట్ బృందం గతవారం చిన్మయానంద్‌ను ఏడు గంటల పాటు ప్రశ్నించింది. -
చిక్కుల్లో చిన్మయానంద్
షహజన్‌పూర్ : తాను నిర్వహించే కళాశాలలో న్యాయవిద్యను అభ్యసించిన విద్యార్థినిచే లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి స్వామి చిన్మయానంద్‌పై లైంగిక దాడి అభియోగాలపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారని భావిస్తున్నారు. అత్యంత భద్రత నడుమ బాధితురాలు సుప్రీం కోర్టులో స్టేట్మెంట్ నమోదు చేయడంతో ఈ దిశగా చిన్మయానంద్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు ముమ్మరం కానుంది. మరోవైపు చిన్మయానంద్ అస్వస్థతకు లోనుకావడంతో షహజన్‌పూర్‌లోని తన ఆశ్రమంలో ఆయనను వైద్యులు పరీక్షించి చికిత్స అందించారు. చిన్మయానంద్ డయేరియాతో బాధపడుతున్నారని, ఆయనకు మధుమేహం ఉండటంతో బలహీనంగా ఉన్నారని పూర్తి విశ్రాంతి తీసుకుంటే పరిస్థితి మెరగువుతుందని వైద్యులు సూచించారు. కాగా చిన్మయానంద్ తనపై ఏడాదిపాటు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆయన నిర్వహించే కళాశాలలో చదివే లా విద్యార్ధిని ఆరోపించిన సంగతి తెలిసిందే. -
స్వామిపై లైంగిక దాడి కేసు : సిట్ విచారణ ముమ్మరం
లక్నో : తాను నిర్వహించే కళాశాలలో చదివే లా కాలేజీ విద్యార్ధినిపై లైంగిక దాడికి పాల్పడిన ఆరోపణలపై బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి స్వామి చిన్మయానంద్‌పై సిట్ విచారణ ముమ్మరమైంది. యూపీలోని షహజన్‌పూర్‌లో శుక్రవారం స్వామి చిన్మయానంద్ ఆశ్రమంలో సోదాలు చేపట్టిన సిట్ అధికారులు ఆయన బెడ్రూమ్ను సీజ్ చేశారు. విచారణ పూర్తయ్యేంత వరకూ షహజన్పూర్ను విడిచివెళ్లరాదని అధికారులు ఆయనను ఆదేశించారు. బాధిత యువతి ఆరోపణలపై సిట్ బృందం గురువారం రాత్రి చిన్మయానంద్‌ను ఏడు గంటల పాటు ప్రశ్నించింది. నిందితుడిని ప్రశ్నించిన అనంతరం ఆయన పడక గదిని పరిశీలించింది. ఫోరెన్సిక్ నిపుణుల బృందం సైతం దివ్య ధామ్‌లోని చిన్మయానంద్ గదిని తనిఖీ చేయనున్నారు. సిట్ విచారణ నేపథ్యంలో స్వామి చిన్మయానంద్ ఆశ్రమం వద్ద భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. చదవండి : వీడియో తీసి బెదిరించి..ఆపై లైంగిక దాడి -
స్వామిపై లైంగిక ఆరోపణలు.. సాక్ష్యాలు మిస్!
లక్నో : విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడ్డ ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మాజీమంత్రి, బీజేపీ నేత చిన్మయానంద కేసు మరో మలుపు తిరిగింది. తన కళాశాలలో చదివే విద్యార్థినికి తెలియకుండా నగ్న వీడియోలు తీయడమేగాక, ఆ వీడియోలను ఆ విద్యార్థినికి చూపి బ్లాక్మెయిల్ చేసి అత్యాచారం చేశారని ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే తమ ఆరోపణలకు కీలకంగా ఉన్న సాక్ష్యాలు కనిపించడం లేదని బాధితురాలి తండ్రి మీడియాకు వెల్లడించారు. తన కూతురు కోర్టు సీల్‌తో ఉన్న అన్ని సాక్ష్యాలను జాగ్రత్తగా తన హాస్టల్ గదిలో భద్రపరిచిందన్నారు. అయితే ఈ కేసు విచారణ చేస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(సిట్) ఈ నెల 9వ తేదీన ఆ సీల్‌ను ఓపెన్ చేసినప్పటి నుంచి కీలకమైన సాక్ష్యాలు కనిపించడం లేదని ఆరోపించారు. చిన్మయానంద్‌కు వ్యతిరేకంగా అన్ని సాక్షాలను తన కూతురు భద్రపరిచిందని, కళ్లద్దాలలో అమర్చిన రహస్య కెమెరాలతో చిత్రీకరించిన వీడియోలు కనిపించని వాటిలో ఉన్నాయని తెలిపారు. తన కూతురి స్నేహితురాలు ఇచ్చిన పెన్ డ్రైవ్ కూడా కనిపించని వాటిలో ఉందన్నారు. బాధితురాలి తండ్రి ఆరోపణలపై సిట్ అధికారులు స్పందించడానికి నిరాకరించారు. 73 ఏళ్ల చిన్మయానంద్ బట్టలు లేకుండా తనతో మసాజ్ చేయించుకోవడాన్ని కళ్లద్దాలలో అమర్చిన రహస్య కెమెరాలతో బాధితురాలు చిత్రీకరించడం తెలిసిందే. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కూడా అయ్యాయి. స్వామి నుంచి రాజకీయ నాయకునిగా మారిన చిన్మయానంద్... యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌కు అత్యంత సన్నిహితుడు. దీంతో పోలీసులు ఈ కేసు విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే తనని వేధించడానికే లైంగిక ఆరోపణలు చేస్తున్నారని, ఇది ఒక రాజకీయ కుట్ర అని చిన్మయానంద్ వాఖ్యానించారు. చదవండి : వీడియో తీసి..బెదిరించి..ఆపై లైంగిక దాడి -
వీడియో తీసి..బెదిరించి..ఆపై లైంగిక దాడి
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి స్వామి చిన్మయానంద్ తనపై ఏడాడి పాటు లైంగిక దాడి, వేధింపులకు పాల్పడ్డాడని ఆయన నిర్వహించే కళాశాలకు చెందిన లా స్టూడెంట్ ఆరోపించిన క్రమంలో స్వామి బాగోతాలపై బాధితురాలు మరికొన్ని వివరాలు వెల్లడించారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) ఆమె స్వామిపై ఆరోపణలకు ఆధారాలను అందచేసినట్టు తెలిసింది. యూపీలోని షహజన్‌పూర్‌లో లా కోర్సులో అడ్మిషన్ కోసం తాను గత ఏడాది జూన్‌లో చిన్మయానంద్‌ను తాను తొలిసారి కలిశానని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. చిన్మయానంద్ తన ఫోన్ నెంబర్ తీసుకుని తనకు లా కాలేజ్‌లో అడ్మిషన్ ఇప్పించారని, కాలేజ్ లైబ్రరీలో నెలకు రూ 5000 వేతనానికి ఉద్యోగం కల్పించారని చెప్పుకొచ్చారు. అక్టోబర్‌లో తనను హాస్టల్‌కు మారాలని స్వామి చిన్మయానంద్ కోరారని, ఆ తర్వాత ఆశ్రమానికి పిలిపించారని చెప్పారు. ఆశ్రమంలో స్వామిని కలవగా తాను హాస్టల్లో స్నానం చేస్తున్న వీడియోను చూపి తాను చెప్పినట్టు వినకుంటే దాన్ని వైరల్ చేస్తానని బెదిరించి లోబరుచుకున్నాడని ఆరోపించారు. లైంగిక దాడి దృశ్యాలనూ రికార్డు చేసిన చిన్మయానంద్ వాటిని చూపి బ్లాక్మెయిల్ చేసేవాడని చెప్పారు. స్వామి శిష్యులు తనకు తుపాకీ గురిచూపి ఆయన వద్దకు తీసుకువెళ్లేవారని, ఆయనకు తనతో మసాజ్ చేయించేవారని అన్నారు. ఈ ఏడాది జులై వరకూ ఈ వికృత చర్యలు కొనసాగాయని, చిన్మయానంద్ దుశ్చర్యలపై వీడియోలను రూపొందించాలని నిర్ణయించుకుని ఈ ఏడాది ఆగస్ట్‌లో ఫేస్బుక్లో వీడియోను పోస్ట్ చేసి కాలేజీ నుంచి పారిపోయినట్టు వెల్లడించారు. మరోవైపు చిన్మయానంద్ తన కుమార్తెతో పాటు పలువురు యువతులను లైంగికంగా వేధించాడని బాధితురాలి తండ్రి యూపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిన్మయానంద్‌పై యూపీ పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో ఆమె ఢిల్లీ పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. మరోవైపు యువతి ఆరోపణలను స్వామి చిన్మయానంద్ న్యాయవాది తోసిపుచ్చారు. స్వామి ప్రతిష్టను దిగజార్చేందుకు జరిగిన రాజకీయ కుట్రలో భాగంగా ఈ ఆరోపణలు చేస్తున్నారని ఆక్షేపించారు. -
‘స్వామి లీలలు బట్టబయలైనా అరెస్ట్ చేయలేదు’
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి స్వామి చిన్మయానంద్ (72)పై ఆయన నిర్వహించే లా కాలేజిలో చదివిన విద్యార్ధిని (23) ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. చిన్మయానంద్ తనను లైంగికంగా వేధించారని ఆరోపించిన యువతి యూపీలోని షహజన్‌పూర్‌లోని తన ఇంటి నుంచి అదృశ్యమైన వారం రోజుల తర్వాత రాజస్ధాన్‌లో ప్రత్యక్షమైంది. చిన్మయానంద్‌పై తాను చేసిన ఫిర్యాదును యూపీ పోలీసులు పట్టించుకోకపోవడంతో ఢిల్లీ పోలీసులను ఆశ్రయించానని ఆమె పేర్కొన్నారు. చిన్మయానంద్ తనపై లైంగిక దాడి చేయడంతో పాటు ఏడాది పాటు తనను శారీరకంగా హింసించారని బాధిత యువతి మీడియా ముందు వెల్లడించారు. లోధి రోడ్ పోలీస్ స్టేషన్లో తన ఫిర్యాదును స్వీకరించిన ఢిల్లీ పోలీసులు తన ఫిర్యాదును షహజన్‌పూర్ పోలీసులకు మళ్లించారని ఆమె తెలిపారు. కాగా యువతి ఫిర్యాదును విచారించాలని సుప్రీం కోర్టు సిట్‌ను ఆదేశించిన క్రమంలో ఆదివారం సిట్ తనను 11 గంటలు ప్రశ్నించిందని, స్వామి చిన్మయానంద్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని తాను వారికి వివరించానని, తాను వారికి అన్ని విషయాలు చెప్పినా ఇంతవరకూ నిందితుడిని అరెస్ట్ చేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా సంత్ సమాజ్‌లో పేరున్న నేత పలువురు యువతుల జీవితాలను నాశనం చేశాడని, తనను చంపుతానని బెదిరించాడని తన ఫేస్బుక్ పేజ్‌లో పోస్ట్ చేసిన అనంతరం ఎఫ్బీ పేజీని మూసివేసి అజ్ఞాతంలోకి వెళ్లిన యువతి ఆగస్ట్ 30న రాజస్ధాన్‌లో ప్రత్యక్షమైంది. ఫేస్బుక్ పేజీలో స్వామి చిన్మయానంద్ పేరును ఆమె నేరుగా వెల్లడించకపోయినా ఆమె తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో రాజకీయ పలుకుబడి కలిగిన నేత అంటూ చిన్మయానంద్ పేరును పరోక్షంగా ప్రస్తావించారు. స్వామి చిన్మయానంద్‌పై లైంగిక దాడి ఆరోపణలు కలకలం రేపాయి. తనకు సాయం చేయాలంటూ ఆమె యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్, ప్రధాని నరేంద్ర మోదీలకు విజ్ఞప్తి చేశారు. కాగా చిన్మయానంద్‌పై ఆరోపణలు అవాస్తవమని ఆయన తరపు న్యాయవాది తోసిపుచ్చారు. స్వామి పోలీసుల నుంచి తప్పించుకుని తిరగడం లేదని, ఆథ్యాత్మిక కార్యక్రమాలతో ఆయన బిజీగా ఉన్నారని చెప్పుకొచ్చారు. అవసరమైన సమయంలో స్వామి ఢిల్లీ పోలీసుల ఎదుట హాజరవుతారని పేర్కొన్నారు. రాజకీయ ప్రాబల్యం కలిగిన స్వామి చిన్మయానంద్ షహజన్‌పూర్‌లో ఆశ్రమంతో పాటు పట్టణంలో ఐదు కాలేజీలను నిర్వహిస్తున్నారు. హరిద్వార్, రిషీకేష్‌ల్లోనూ ఆశ్రమాలు నిర్వహిస్తున్న చిన్మయానంద్ ఆథ్యాత్మిక, వ్యాపార సామ్రాజ్యం రూ కోట్లలో ఉంటుందని చెబుతున్నారు. -
తొగాడియా నిష్క్రమణ ఖాయమేనా!?
విశ్వహిందూ పరిషత్‌లో ప్రవీణ్ తొగాడియా ప్రస్థానం ముగిసినట్టేనా? వీహెచ్‌పీ నుంచి ఆయనను బయటకు సాగనంపుతారా? తొగాడియాకు క్రమశిక్షణ లేదని వీహెచ్‌పీ వ్యాఖ్యానించడం.. అందులో భాగమేనా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తనను ఎన్కౌంటర్ చేసేందుకు కుట్రలు చేస్తున్నారన్న ప్రవీణ్ తొగాడియా వ్యాఖ్యలపై తాజాగా విశ్వహిందూ పరిషత్ మండిపడింది. స్వీయ నియంత్రణ, క్రమశిక్షణలేని తొగాడియా వ్యాఖ్యలను ఏ మాత్రం సహించేది లేదని వీహెచ్‌పీ నేత స్వామి చిన్మయానంద్ తెలిపారు. ఆయనకు విశ్వహిందూ పరిషత్ ఎంతో గౌరవాన్ని, సమున్నత స్థానాన్ని కల్పించిందని చెప్పారు. వీహెచ్‌పీ గౌరవానికి మచ్చే తెచ్చే వ్యక్తులను గౌరవంగానే సాగనంపుతామని.. పరోక్షంగా తొగాడియాకు ఆయన సంకేతాలు పంపారు. స్థానాన్ని కోల్పోయారు: క్షమార్హం కానీ వ్యాఖ్యలతో ప్రవీణ్ తొగాడియా విశ్వహిందూ పరిషత్‌లో స్థానం కోల్పోయారని చిన్మయానంద్ స్పష్టం చేశారు. మార్గదర్శక్ మండల్లో సభ్యుడైన చిన్మయానంద్ వ్యాఖ్యలు.. తొగాడియాను బయటకు పంపుతారన్న సందేహాలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. విశ్వహిందూ పరిషత్ అనేది వ్యక్తుల చుట్టూ తిరిగే సంస్థ కాదని ఆయన స్పష్టం చేశారు. ఆయనపై గౌరవం ఉంది: ప్రవీణ్ తొగాడియా అంటే ఇప్పటికీ గౌరవం ఉందని వీహెచ్‌పీ జనరల్ సెక్రెటరీ చంపత్ రాయ్ స్పష్టం చేశారు. అయితే వివాదాస్పద వ్యాఖ్యలపై ఆయన వివరణ ఇస్తే గౌరవం మరింత పెరుగుతుందని అన్నారు. ఏది ఏమైనా మాకు, దేశానికి తొగాడియా ప్రియమైన వారని చెప్పారు. -
ప్రపంచాన్ని చూసే దృష్టిని మార్చుకోవాలి
ఆధ్యాత్మిక సాధనకు ప్రస్తుత జీవితం నుంచి దూరంగా పారిపోనవసరం లేదని, జీవితాన్ని తెలివితో అర్థం చేసుకుని వివేకంతో జీవించాలన్నది స్వామి చిన్మయానంద బోధలు కొన్ని: ► మనస్సును రాగద్వేషాలనుంచి, గతం నుంచి, భవిష్యత్ నుంచి దూరంగా ఉంచగలిగినప్పుడు ఆందోళనలకు, అలజడులకు దూరంగా ఉండగలం. ► జీవితాన్ని భగవంతునికి అంకితం చేసి, ఏ ఫలితాన్ని అయినా భగవత్ ప్రసాదంగా స్వీకరించడమే సాధకుని ప్రథమ కర్తవ్యం. ► శాశ్వతమైన సుఖసంతోషాలు వస్తువుల వల్ల, పరిశోధనవల వల్ల రావు, మనలో ఆధ్యాత్మిక విలువలు పెరగడం వల్లనే లభిస్తాయి. ► బుద్ధి సూక్ష్మంగానూ, చురుకుగానూ, మనస్సు నిర్మలంగానూ, నిశ్చలంగానూ ఉన్నప్పుడే ఆత్మవిచారణ చేయడానికి తగిన అర్హత లభిస్తుంది. కాబట్టి ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్లుగా ఉంచి, దానిని చూసే దృష్టి మార్చుకోవాలి. దీనివల్ల తాను, భగవంతుడు ఒకటేనని అనుభవం కల్గుతుంది. ఎటువంటి అవాంతరాలు ఎదురైనా, స్థిరంగా ప్రశాంతంగా ఉండగలగటం సాధ్యమవుతుంది. -
ఆయన పోలికలున్నాయని నన్ను నటించమన్నారు!
ఇంటర్వ్యూ: కళాదర్శకుడు తోట తరణి ఒత్తుగా పెరిగిన రింగు రింగుల జుట్టు... చుట్టుపక్కల వాతావరణాన్ని నిశితంగా గమనించే లోతైన కళ్ళు... మాటల కన్నా చేతిలోనే కుంచెతోనే ఎక్కువగా భావ వ్యక్తీకరణ చేస్తూ, ఎప్పుడూ దీక్షగా పనిలో మునిగిపోయి కనిపించే కళా దర్శకుడు తోట తరణిని చూస్తే, అచ్చంగా దీక్ష పట్టిన మహర్షిలాగానే ఉంటారు. బహుశా అందుకే కామోసు.. అరవై నాలుగేళ్ళ ఆయనతో ఇప్పుడు ఓ డాక్యుమెంటరీలో స్వామీజీ పాత్ర పోషింపజేస్తున్నారు. చిన్మయ మిషన్ సంస్థాపకులూ, భగవద్గీత, ఉపనిషత్తులపై ఉపన్యాసాలతో ప్రపంచ ప్రసిద్ధులైన ఆధ్యాత్మికవేత్త స్వామి చిన్మయానందగా ‘పద్మశ్రీ’ తోట తరణి ఇప్పుడు తెర మీద కనిపించనున్నారు. చిన్మయానంద జీవితం మీద ఇంగ్లీషులో రూపొందిస్తున్న డాక్యుమెంటరీ ‘ది క్వెస్ట్’ కోసం కెమేరా ముందుకు వచ్చారు. చెన్నైలో రకరకాల పనులతో తీరిక లేకుండా ఉన్న నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఆర్ట్ డెరైక్టర్ తోట తరణి ‘సాక్షి’తో పంచుకున్న భావాలు... ఉన్నట్టుండి మీకు నటన మీద ఆసక్తి కలిగిందేమిటి? (పెద్దగా నవ్వేస్తూ...) అదేమీ లేదు. కొద్ది నెలల క్రితం ఈ ప్రాజెక్టు నా దగ్గరకు వచ్చింది. ప్రసిద్ధ ఆధ్యాత్మికవేత్త స్వామి చిన్మయానంద మీద డాక్యుమెంటరీ తీస్తూ, అందులో స్వామీజీ ముసలివారైన తరువాతి ఘట్టానికి నేనైతే సరిగ్గా సరిపోతానని నన్ను అడిగారు. కెమేరా వెనుక నా పనేదో చేసుకుంటూ హాయిగా ఉన్న నాకు ఏం చేయాలో తెలియలేదు. ముందు తటపటాయించాను. కానీ, చిత్ర రూపకర్తలు నచ్చజెప్పడంతో, చివరకు సరే అన్నాను. అలా కెమేరా ముందుకు వచ్చాను. అదీ కొద్దిసేపు కనిపిస్తాను. ఇంతకీ ఈ డాక్యుమెంటరీ రూపకర్త ఎవరు? తమిళ చిత్రం ‘కల్యాణ సమయల్ సాదమ్’ (తెలుగులో వివాహ భోజనం అని అర్థం) ద్వారా ప్రాచుర్యంలోకి వచ్చిన దర్శకుడు ఆర్.ఎస్. ప్రసన్న ఈ డాక్యుమెంటరీ తీశారు. గతంలోనూ నన్ను కొందరు నటించమని అడిగినా, ప్రత్యేకించి ఇది ఆధ్యాత్మిక కథాంశం కావడంతో, నేను కూడా ఆకర్షితుణ్ణయ్యా. పైగా, చాలా మంది నాకూ, స్వామి చిన్మయానందకూ పోలికలున్నాయంటూ ఉంటారు. దాంతో, ఈ పాత్రలో కనిపించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. ఎలా ఉంది నటనానుభవం? కెమేరా ముందు, అందరూ చూస్తుండగా నటించడం ఓ పెద్ద సవాలే. అయితే, నాదేమీ పూర్తి స్థాయి పాత్ర కాదు. అంతా కేవలం ఓ పాసింగ్ షో. (మళ్ళీ నవ్వేస్తూ...) అయినా, నేనేమన్నా అక్కినేని నాగేశ్వరరావునా, చిరంజీవినా... అద్భుతమైన నటన చూపడానికి! గడ్డం లేకపోయినా, చూడడానికి చిన్మయానంద గారి పోలికలున్నాయని వాళ్ళు అడగడంతో, ‘మీరు అలా అనుకొంటే, ఓ.కె’ అన్నాను. అంతే. ఈ డాక్యుమెంటరీ ప్రధానంగా స్వామి మధ్యవయస్కుడిగా కనిపించే ఘట్టాలతో నడుస్తుంది. ముసలితనం మీద పడ్డాక క్లైమాక్స్ దగ్గర నేను కనిపిస్తాను. అది రేపు తెర మీద ఎన్ని నిమిషాలు ఉంటుందో నాకే తెలీదు. మరి, డాక్యుమెంటరీ తీసినవాళ్ళు ఏమన్నారు? నా మటుకు నాకు తెలియడం లేదు కానీ, స్వామీజీ వాళ్ళు మాత్రం చాలా బాగా వచ్చిందని అంటున్నారు. బయటికొచ్చాక తెర మీద చూడాలి. అయినా... నేను పని చేస్తున్న సినిమాల గురించి కానీ, నా ఆర్ట్ డెరైక్షన్ గురించి కానీ ‘అద్భుతం... చాలా బాగుంది’ అని నేను ఎప్పుడూ చెప్పలేదు. ఇప్పుడూ చెప్పను. తెర మీద చూశాక, ఆ మాట జనం చెప్పాల్సిందే (నవ్వులు...). గతంలో కూడా మీరు శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన ‘శివాజీ’లో కెమేరా ముందుకొచ్చారు కదూ! అవును. ఆ సినిమాలోని ‘బల్లేలక్కా...’ పాటలో అందరితో పాటు కలిసి, జల్సాగా నిలుచున్నా. తెర మీద అలా తళుక్కున మెరిశాను. కాకపోతే, అదేదో సరదాగా చేసిన వ్యవహారం. కానీ, ఈ డాక్యుమెంటరీ అలా కాదు.. గంభీరమైన ఓ స్వామీజీ పాత్రలో కనిపించడం. ఇది తమాషాగా తీసుకోదగ్గ ఆషామాషీ పని కాదు. అందుకే, ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేశా. మీ నాన్న గారు తోట వెంకటేశ్వరరావుకి కూడా నటనానుభవం ఉన్నట్లుంది? అవును. చిత్రసీమలో కళాదర్శకుడిగా స్థిరపడక ముందు ఆయన టీనేజ్‌లో నాటకాలు ఆడేవారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలో రంగస్థల ప్రసిద్ధులు డి.వి. సుబ్బారావు గారితో కలసి, వారి నాటక బృందంలో మా నాన్నగారు వేషాలు వేసేవారు. అవన్నీ 1940ల నాటి సంగతులు. అప్పట్లో నటనలో ఆయన ఎంతో పేరు తెచ్చుకున్నారు కూడా! (నవ్వేస్తూ...) నాకూ, ఆయనకూ పోలికే లేదు. నక్కకూ, నాకలోకానికీ ఉన్నంత తేడా ఉంది. ఏమైనా, రేపు డాక్యుమెంటరీ బయటకు వచ్చాక, మీ లాంటి వారందరూ చూసి ఎలా ఉందో చెప్పాలి. - రెంటాల జయదేవ