విశ్వహిందూ పరిషత్‌లో ప్రవీణ్ తొగాడియా ప్రస్థానం ముగిసినట్టేనా? వీహెచ్‌పీ నుంచి ఆయనను బయటకు సాగనంపుతారా? తొగాడియాకు క్రమశిక్షణ లేదని వీహెచ్‌పీ వ్యాఖ్యానించడం.. అందులో భాగమేనా? అంటే అవుననే సమాధానం వస్తోంది.
తనను ఎన్‌కౌంటర్ చేసేందుకు కుట్రలు చేస్తున్నారన్న ప్రవీణ్ తొగాడియా వ్యాఖ్యలపై తాజాగా విశ్వహిందూ పరిషత్ మండిపడింది. స్వీయ నియంత్రణ, క్రమశిక్షణలేని తొగాడియా వ్యాఖ్యలను ఏ మాత్రం సహించేది లేదని వీహెచ్‌పీ నేత స్వామి చిన్మయానంద్ తెలిపారు. ఆయనకు విశ్వహిందూ పరిషత్ ఎంతో గౌరవాన్ని, సమున్నత స్థానాన్ని కల్పించిందని చెప్పారు. వీహెచ్‌పీ గౌరవానికి మచ్చే తెచ్చే వ్యక్తులను గౌరవంగానే సాగనంపుతామని.. పరోక్షంగా తొగాడియాకు ఆయన సంకేతాలు పంపారు.
స్థానాన్ని కోల్పోయారు:
క్షమార్హం కానీ వ్యాఖ్యలతో ప్రవీణ్ తొగాడియా విశ్వహిందూ పరిషత్‌లో స్థానం కోల్పోయారని చిన్మయానంద్ స్పష్టం చేశారు. మార్గదర్శక్ మండల్‌లో సభ్యుడైన చిన్మయానంద్ వ్యాఖ్యలు.. తొగాడియాను బయటకు పంపుతారన్న సందేహాలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. విశ్వహిందూ పరిషత్ అనేది వ్యక్తుల చుట్టూ తిరిగే సంస్థ కాదని ఆయన స్పష్టం చేశారు.
ఆయనపై గౌరవం ఉంది:
ప్రవీణ్ తొగాడియా అంటే ఇప్పటికీ గౌరవం ఉందని వీహెచ్‌పీ జనరల్ సెక్రెటరీ చంపత్ రాయ్ స్పష్టం చేశారు. అయితే వివాదాస్పద వ్యాఖ్యలపై ఆయన వివరణ ఇస్తే గౌరవం మరింత పెరుగుతుందని అన్నారు. ఏది ఏమైనా మాకు, దేశానికి తొగాడియా ప్రియమైన వారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment