Pravin Togadia
-
కేంద్రం తీరుపై తొగాడియా విమర్శలు
ముంబై: కేంద్ర సర్కారుపై విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) మాజీ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో అల్లర్లు సృష్టిస్తున్న వారిపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఈశాన్య ఢిల్లీలో అమాయక హిందువులపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తొగాడియా డిమాండ్ చేశారు. షహీన్‌బాగ్‌లో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో 40 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. చట్ట వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలను అదుపు చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. మన దేశానికి వచ్చిన ముస్లిమేతర శరణార్థులందరికీ పౌరసత్వ సవరణ చట్టం కింద భారతీయ పౌరసత్వం ఇచ్చి తీరుతామని.. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా స్పష్టం చేసిన విషయం తెలిసిందే. -
సల్మాన్‌ను కొట్టిన వారికి నగదు బహుమతి!
సాక్షి, ముంబై: సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ సంస్థలో నవరాత్రి ఉత్సవ నేపథ్యంలో రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ‘లవరాత్రి’ సినిమా హిందువుల మనోభావాలను కించపరుస్తున్నట్లుగా ఉందని, టైటిల్ కూడా హిందువులు పవిత్రంగా భావించే ‘నవరాత్రి’ని హేళన చేస్తున్నట్లుగా ఉందని హిందూ హై ఆజ్ సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. గురువారం విశ్వహిందూ పరిషత్ మాజీ అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా ఏర్పాటు చేసిన ‘హిందూ హై ఆజ్’ సంస్థ ఆగ్రా నగర విభాగం అధ్యక్షుడు గోవింద్ పరాషర్ ఓ సంచలన ప్రకటన చేశారు. బహిరంగంగా సల్మాన్ ఖాన్‌ను కొట్టిన వారికి రూ. 2లక్షల బహుమతి ఇస్తానని ప్రకటించారు. గురువారం ఆగ్రాలోని భగవాన్ థియేటర్లో లవరాత్రి సినిమాకు చెందిన సల్మాన్ ఖాన్ పోస్టర్లను హిందూ హై ఆజ్ కార్యకర్తలు దహనం చేశారు. హిందువుల పర్వదినం నవరాత్రి నేపథ్యంలో మూవీ తీయడంతో పాటు ఆ పేరు అర్థాన్ని కూడా నాశనం చేసేలా ఉందని, కాబట్టి ఈ సినిమాను ప్రదర్శించకుండా అడ్డుకుంటామని తెలిపారు. ఈ సినిమా అక్టోబరులో విడుదల కానున్న నేపథ్యంలో సల్మాన్ ఖాన్ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గుజరాత్లో నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో పండుగ తొమ్మిది రోజుల్లో ఓ యువ జంట మధ్య చిగురించే ప్రేమను చూపించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ద్వారా సల్మాన్ ఖాన్ బావ ఆయుష్ శర్మ హీరోగా పరిచయం కాబోతున్నారు. గతంలో సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో, దీపికా పదుకొనే నటించిన ‘పద్మావత్’ సినిమా విడుదలకు ఎన్ని అవాంతరాలు ఎదురయ్యాయో అందరికీ తెలిసిన విషయమే. ఈ చిత్రం రాజ్‌పుత్‌ల మనోభావాలను దెబ్బతీసేలా ఉందనే ఆరోపణలతో కొన్ని వారాల పాటు వాయిదాపడ్డా.. చివరికి సుప్రీంకోర్టు జోక్యంతో ఊరట లభించి, విడుదలైంది. -
గుజరాత్: తొగాడియాపై హత్యాయత్నం.. ట్రక్కు ఢీ ?
సాక్షి, సూరత్ : విశ్వహిందూ పరిషత్ చీఫ్ ప్రవీణ్ తొగాడియా పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఓ ట్రక్కు ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టింది. అనంతరం వెళ్లి డివైడర్‌ను తాకింది. ఈ క్రమంలో ఆ ట్రక్కు వాహనం డ్రైవర్ ఎలాంటి బ్రేకులు వేయలేదంట. అయితే, అదృష్టవశాత్తు తొగాడియా, ఆయన అనుచరులకు ఎలాంటి హానీ జరగలేదు. ఈ ఘటనపై స్పందించిన తొగాడియా గుజరాత్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. తనపై ప్రభుత్వం హత్యాయత్నానికి ప్రయత్నించిందని అన్నారు. తన వాహనాన్ని ఢీకొట్టిన తర్వాత కూడా ఎందుకు బ్రేకులు వేయలేదని ప్రశ్నించారు. తాను ఆసమయంలో బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో లేకుంటే తన సిబ్బందితో సహా ఎవరూ ప్రాణాలతో ఉండేవాళ్లం కాదని ఆందోళన వ్యక్తం చేశారు. తనకు ఉద్దేశ పూర్వకంగానే భద్రత తగ్గిస్తూ వచ్చారని, జెడ్‌ప్లస్ కేటగిరినీ బలహీనపరుస్తూ వచ్చారని, కనీసం ఒక ఎస్కార్ట్ వాహనాన్ని కూడా పంపించడం లేదని, ఇదంతా తనను హత్య చేసే కుట్రలో భాగమేనని అన్నారు. అయితే, పోలీసులు మాత్రం ఈ ఘటనను ఒక ప్రమాదంగానే చెబుతున్నారు. వాహనాన్ని, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నామని, ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. -
తొగాడియా నిష్క్రమణ ఖాయమేనా!?
విశ్వహిందూ పరిషత్‌లో ప్రవీణ్ తొగాడియా ప్రస్థానం ముగిసినట్టేనా? వీహెచ్‌పీ నుంచి ఆయనను బయటకు సాగనంపుతారా? తొగాడియాకు క్రమశిక్షణ లేదని వీహెచ్‌పీ వ్యాఖ్యానించడం.. అందులో భాగమేనా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తనను ఎన్కౌంటర్ చేసేందుకు కుట్రలు చేస్తున్నారన్న ప్రవీణ్ తొగాడియా వ్యాఖ్యలపై తాజాగా విశ్వహిందూ పరిషత్ మండిపడింది. స్వీయ నియంత్రణ, క్రమశిక్షణలేని తొగాడియా వ్యాఖ్యలను ఏ మాత్రం సహించేది లేదని వీహెచ్‌పీ నేత స్వామి చిన్మయానంద్ తెలిపారు. ఆయనకు విశ్వహిందూ పరిషత్ ఎంతో గౌరవాన్ని, సమున్నత స్థానాన్ని కల్పించిందని చెప్పారు. వీహెచ్‌పీ గౌరవానికి మచ్చే తెచ్చే వ్యక్తులను గౌరవంగానే సాగనంపుతామని.. పరోక్షంగా తొగాడియాకు ఆయన సంకేతాలు పంపారు. స్థానాన్ని కోల్పోయారు: క్షమార్హం కానీ వ్యాఖ్యలతో ప్రవీణ్ తొగాడియా విశ్వహిందూ పరిషత్‌లో స్థానం కోల్పోయారని చిన్మయానంద్ స్పష్టం చేశారు. మార్గదర్శక్ మండల్లో సభ్యుడైన చిన్మయానంద్ వ్యాఖ్యలు.. తొగాడియాను బయటకు పంపుతారన్న సందేహాలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. విశ్వహిందూ పరిషత్ అనేది వ్యక్తుల చుట్టూ తిరిగే సంస్థ కాదని ఆయన స్పష్టం చేశారు. ఆయనపై గౌరవం ఉంది: ప్రవీణ్ తొగాడియా అంటే ఇప్పటికీ గౌరవం ఉందని వీహెచ్‌పీ జనరల్ సెక్రెటరీ చంపత్ రాయ్ స్పష్టం చేశారు. అయితే వివాదాస్పద వ్యాఖ్యలపై ఆయన వివరణ ఇస్తే గౌరవం మరింత పెరుగుతుందని అన్నారు. ఏది ఏమైనా మాకు, దేశానికి తొగాడియా ప్రియమైన వారని చెప్పారు. -
నన్ను చంపేందుకు కుట్ర
అహ్మదాబాద్: ఎన్కౌంటర్లో తనను చంపేందుకు కుట్ర జరుగుతోందని వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్భాయ్ తొగాడియా(62) సంచలన ఆరోపణలు చేశారు. రాజస్థాన్, గుజరాత్ పోలీసులు తనను ఎన్కౌంటర్ చేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. హిందూ జాతి, రామజన్మభూమి, గోవధ, రైతుల గురించి మాట్లాడకుండా చేసేందుకు, తన గొంతునొక్కేందుకు పదేళ్ల నాటి కేసులో అరెస్ట్ వారెంట్ జారీ చేయించారని ఆరోపించారు. తరచూ ముస్లిం వ్యతిరేక, హిందూ అనుకూల ప్రకటనలతో వార్తల్లో నిలిచే తొగాడియాకు బీజేపీ, ఆర్ఎస్ఎస్తో దగ్గరి సంబంధాలున్నాయి. అలాంటి తొగాడియా బీజేపీ పాలిత రాష్ట్రాలపై ఇలాంటి ఆరోపణలు చేయటం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. మంగళవారం అహ్మదాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘సోమవారం ఉదయం గుజరాత్, రాజస్థాన్ పోలీసులు కలిసి పెద్ద సంఖ్యలో నా ఇంటికి వస్తున్నారని, ఎన్కౌంటర్లో చంపేందుకు కుట్ర పన్నారని సమాచారం అందింది. రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరరాజే, హోంమంత్రి గులాబ్‌చంద్ కటారియాలను ఫోన్లో సంప్రదించగా అరెస్ట్ వారెంట్ విషయం తమకు తెలియదన్నారు. కోర్టు ఉత్తర్వులు అయినందున తాము ఆపలేమంటూ రాజస్థాన్‌లోని నా లాయర్లు కూడా చెప్పారు. దీంతో పోలీసులు చంపేస్తారనే భయంతో సెల్ఫోన్లు స్విచాఫ్ చేసుకున్నా. విమానంలో జైపూర్ వెళ్లి అక్కడి నుంచి గంగాపూర్ కోర్టులో హాజరుకావాలనుకుని మరో వ్యక్తితో కలిసి ఆటోలో బయలుదేరా. తట్లేజ్ ప్రాంతంలోకి వెళ్లేసరికి బ్లడ్ షుగర్స్ లెవల్స్ పడిపోవటంతో అపస్మారక స్థితికి వెళ్లిపోయాను. తిరిగి చేసేసరికి ఆస్పత్రిలో ఉన్నాను. ఈ నెల మొదటి వారంలో అహ్మదాబాద్‌లో కూడా తనపై అరెస్ట్ వారెంట్లు జారీ కాగా, గుజరాత్ సీఎం విజయ్ రూపానీ, హోంమంత్రి ప్రదీప్ సిన్హ్ జడేజాను అడగ్గా తమకు ఆ విషయం తెలియదన్నారు. ఎవరి ఆదేశాల మేరకు పోలీసులు నడుచుకుంటున్నారో నాకు తెలుసు. నా హత్యకు కుట్ర పన్నిన వారి పేర్లను సరైన సమయంలో సాక్ష్యాలతో సహా వెల్లడిస్తా ’అని తెలిపారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వీహెచ్‌పీ వర్గాలు తెలిపాయి. గుజరాత్ పటీదార్ ఉద్యమ నేత హార్ధిక్‌పటేల్, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత అర్జున్ మొధ్వాడియా తొగాడియాను ఆస్పత్రిలో పరామర్శించారు. -
కలకలం రేపిన వీహెచ్‌పీ చీఫ్ అదృశ్యం
-
ఫేక్ ఎన్కౌంటర్ చేస్తారనే... :తొగాడియా
అహ్మదాబాద్ : అస్వస్థతతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వీహెచ్‌పీ చీఫ్ ప్రవీణ్ తొగాడియా హఠాత్తుగా మీడియా ముందుకు వచ్చారు. ఈ క్రమంలో ఆయన గుజరాత్, రాజస్థాన్ పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై తప్పుడు కేసులు బనాయించి ఫేక్ ఎన్కౌంటర్లో చంపాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. ‘‘ పదేళ్ల క్రితం కేసును ఇప్పుడు తిరగదోడుతున్నారు. రెండు రాష్ట్రాల పోలీసులు నన్ను వేధిస్తున్నారు. ఎన్కౌంటర్లో నన్ను చంపాలని చూస్తున్నారు. ఆ ప్రమాదం నుంచి తప్పించుకునేందుకే నా ప్రయత్నం. చట్టాన్ని గౌరవిస్తా.. త్వరలోనే పోలీసుల ముందు లొంగిపోతాను’ అని తొగాడియా ప్రకటించారు. తనకేం జరిగినా ప్రభుత్వాలదే బాధ్యతని ఆయన పేర్కొన్నారు. అయోధ్య రామ మందిరం, గో వధ నిషేధ చట్టం తదితర అంశాలపై మాట్లాడుతున్నందుకే కొందరు తనపై కక్ష గట్టారని ఆయన చెప్పారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా హిందు సమాజ శ్రేయస్సు కోసం తాను చేసే కృషిని ఎవరూ అడ్డుకోలేరని తొగాడియా వ్యాఖ్యానించారు. సోమవారం మధ్యాహ్నాం నుంచి ఆయన కనిపించకుండా పోయే సరికి.. రాజస్థాన్ పోలీసులే ఆయన్ని అరెస్ట్ చేసి ఉంటారని కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. అయితే అనూహ్యంగా ఆయన అహ్మదాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రత్యక్షం కావటం విశేషం. షుగర్ లెవల్స్ పడిపోవటంతో షాహిబాగ్‌లోని ఓ పార్క్‌లో స్పృహ కోల్పోయి పడిపోగా.. స్థానికులు ఆయన్ని ఆస్పత్రిలో చేర్పించినట్లు వైద్యులు వెల్లడించారు. -
కలకలం రేపిన వీహెచ్‌పీ చీఫ్ అదృశ్యం
అహ్మదాబాద్ : విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా (65) అదృశ్యం అయ్యారన్న వార్త ఒక్కసారిగా కలకలం రేపింది. సోమవారం ఉదయం నుంచి ఆయన కనిపించకుండా పోయే సరికి కార్యర్తలు ఆందోళన చేపట్టారు. ఆయన ఎక్కడున్నారో చెప్పాలంటూ అహ్మదాబాద్‌లోని సోల పోలీస్ స్టేషన్ ఎదుట వీహెచ్‌పీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తొగాడియాపై ఉన్న ఓ పాత కేసు విషయంలో రాజస్థాన్ పోలీసులు తమను సంప్రదించారని, అయితే ఆయన నివాసంలో కనిపించకపోవడంతో వారు వెనుదిరిగారని సోల పోలీసులు వివరించారు. దీంతో తొగాడియా ఎక్కడున్నారో తెలియక కార్యకర్తలు ఆందోళన చెందారు. ఆయనను పోలీసులే అదుపులోకి తీసుకుని ఉంటారని భావించిన కార్యకర్తలు ఆయన ఆచూకీ చెప్పాలంటూ పోలీస్ స్టేషన్‌ను చుట్టుముట్టారు. ఈ క్రమంలో సర్కెజ్-గాంధీనగర్ హైవేను దిగ్బంధం చేశారు. కానీ, పోలీసులు మాత్రం ఆ ఆరోపణలను తోసిపుచ్చారు. అయితే చివరికి తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన అహ్మదాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో ప్రత్యక్షమవడంతో వీహెచ్‌పీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. ఓ పార్క్‌లో గ్లూకోజ్ లెవల్స్ పడిపోయి స్పృహ కోల్పోయిన ఆయనను చంద్రామణి ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. -
'దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తే క్షమించం'
కరీంనగర్ : హిందువుల రక్షణ కోసం వీహెచ్‌పీ కట్టుబడి ఉందని విశ్వ హిందూ పరిషత్ నాయకుడు ప్రవీణ్ తొగాడియా వ్యాఖ్యానించారు. భారతదేశం హిందురాజ్యమని, ఈ దేశంలో ఉంటూ దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేసేవారిని క్షమించేది లేదని ఆయన మంగళవారమిక్కడ అన్నారు. దేశంలో ఎక్కడైనా మెజార్టీ ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే పునరావృతం అవుతాయని ప్రవీణ్ తొగాడియా పేర్కొన్నారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణంపై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆయన తెలిపారు. -
రామమందిరంపై వీహెచ్‌పీ కొత్త ప్రకటన
పాట్నా: వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో విశ్వహిందూపరిషత్ (వీహెచ్‌పీ)నేత ప్రవీణ్ తొగాడియా భారీ ప్రభావం పడే ప్రకటన చేశారు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి సంబంధించి వీహెచ్‌పీ ఎలాంటి ఆందోళన కార్యక్రమం ప్రస్తుతం చేయాలని అనుకోవడం లేదని అన్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు వరకు తాము అలాంటి ప్రతిపాదనతో ఏ కార్యక్రమం చేయాలని అనుకోవడం లేదని చెప్పారు. అయితే, రామ మందిరం నిర్మాణం విషయంలో వీహెచ్‌పీ కట్టుబడి ఉందని అన్నారు. 'అయోధ్యలో రామమందిరం నిర్మాణం జరుగుతుంది. ఇది రూఢి అయిన వాస్తవం' అని ఆయన మంగళవారం పాట్నాలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ చెప్పారు. అదే సమయంలో బిహార్‌లో మద్యం నిషేధాన్ని అమలు జరుపుతుండటంపై ప్రశంసలు కురిపించారు. ప్రభుత్వ నిర్ణయానికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు. కాగా, రామమందిరం అంశాన్ని ఇప్పుడు తెరమీదకు తీసుకొస్తే ముస్లిం ఓటర్లు దూరమయ్యే ప్రమాదం ఉందని బీజేపీ భావిస్తున్న నేపథ్యంలోనే తొగాడియా ఇప్పటికిప్పుడు ఈ ప్రకటన చేసినట్లుందని పలువురు రాజకీయ మేథావులు అంటున్నారు. -
‘హిందువులను మోదీ అవమానించారు’
న్యూఢిల్లీ: గో రక్షకులను సంఘ విద్రోహ శక్తులుగా పేర్కొని ప్రధాని మోదీ వారిని అవమానించారని విశ్వ హిందూ పరిషత్ విమర్శించింది. వీహెచ్‌పీ అగ్రనేత ప్రవీణ్ తొగాడియా మాట్లాడుతూ ‘గో రక్షకుల వివరాలు సేకరించాల్సిందిగా మోదీ రాష్ట్రాలను ఆదేశించారు. హిందువులు గోవును రక్షించడానికి ప్రాణాలను సైతం అర్పిస్తారు. కాబట్టి ఆయన జాతి పరంగా జాబితా సిద్ధం చేయమన్నట్లే’ అని తప్పుపట్టారు. దేశానికి ప్రధానమంత్రిగా ఉన్న మోదీ.. గో హంతకులకు క్లీన్చిట్ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. అదే సమయంలో గోరక్షకులను బాధితులుగా మారుస్తున్నారని మండిపడ్డారు. గోమాతనే కాకుండా, హిందువులను కూడా మోదీ అవమానించారని తొగాడియా విమర్శించారు. -
కాంగ్రెస్ నేత సోదరుడిని కత్తులతో పొడిచి..
సూరత్: గుజరాత్లో దారుణం జరిగింది. సూరత్‌లో ముగ్గురు వ్యక్తులను గుర్తు తెలియని దుండగులు అతి దారుణంగా కత్తులతో పొడిచి చంపేశారు. ఈ ఘటన చుట్టుపక్కలవారిని భయబ్రాంతులను చేసింది. హత్యకు గురైన వారిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత తమ్ముడు కూడా ఉన్నాడు. శనివారం రాత్రి అశ్వినికుమార్ రోడ్డు ప్రాంతంలో సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిపక్ష నేతగా సాగుతున్న ప్రఫుల్ తొగాడియా సోదరుడు భరత్ తొగాడియా.. బాలు హిరానీ, అశోక్ పటేల్ అనే మరో ఇద్దరు వ్యక్తులపై గుర్తు తెలియని దుండగులు మారణాయుధాలతో వారిపై ఒకేసారి దాడి చేశారు. ఈ ఘటనలో ఈ ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దినేష్ అనే మరో వ్యక్తి తీవ్రంగా గాయపడటంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. నేరస్తుల పట్టుకునేందుకు పోలీసులు అణువణువూ జల్లెడ పడుతున్నారు. భరత్ తొగాడియా విశ్వహిందూ పరిషత్ నేత ప్రవీణ్ తొగాడియాకు చాలా దగ్గరి బంధువు కూడా. -
'పాక్ జెండాలు ఎగరేసిన వారిని షూట్ చేయాలి'
రాజకోట్: పాకిస్థాన్ అనుకూల కశ్మీర్ వేర్పాటు వాదులపై కేంద్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని విశ్వహిందూ పరిషత్(వీహెచ్ పీ) అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా విమర్శించారు. కశ్మీర్ లో పాకిస్థాన్ జెండాలు ఎగురవేసిన వారిని కాల్చి పారేయాలని అన్నారు. 'కశ్మీర్ లో పాక్ ఎండాలు ఎగురవేయడం ఆందోళన కలిగించే పరిణామం. రొమ్ము విరుచుకుని పాకిస్థాన్ కు అనుకూలంగా నినాదాలు చేస్తూ ఆ దేశపు పతాకాలు ఎగురవేసే వారిని షూట్ చేయాల్సిన అవసరముంది' అని తొగాడియా పేర్కొన్నారు. కచ్ జిల్లాలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వేర్పాటువాదులపై బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని తొగాడియా అసంతృప్తి వ్యక్తం చేశారు. -
ముస్లీంరిజర్వేషన్లపై మండిపడ్డ VHP నేత
-
దేశానికి రెండు రాజ్యాంగాలు అనవసరం: తొగాడియా
అలహాబాద్: భారతదేశానికి రెండు రాజ్యాంగాలు అవసరం లేదని, రాజ్యాంగంలోని 370 అధికరణాన్ని తొలగించాల్సిందేనని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా అన్నారు. 370 అధికరణను సమీక్షించాలని, కాశ్మీర్‌కు అవసరమైతే కొనసాగించాల్సిందేని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ సూచనతో వీహెచ్‌పీ నేత విభేదించారు. దేశానికి రెండు రాజ్యాంగాలు అవసరంలేదని పేర్కొన్నారు. ప్రత్యేక రాజ్యాంగం వల్ల భారత్‌లో మరో దేశంగా కాశ్మీర్ చలామణీ అవుతున్నదని తొగాడియా చెప్పారు. గుజరాత్‌లోఉన్న ఆయన సోమవారం ఫోన్లో విలేకరులతో మాట్లాడారు. కాశ్మీర్‌కు ప్రత్యేకప్రతిపత్తిని ఎట్టిపరిస్థితిలో ఆమోదించేది లేదన్నారు. అంతేకాక దేశంలో ఉమ్మడిపౌరస్మృతి ఉండాల్సిందేనన్నారు. బీజేపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం ఆ విషయాన్ని విస్మరిస్తోందని ఆయన ఆరోపించారు.దేశంలో అనేక మతాల వారికి ఒకటే పౌరస్మృతి అమలవుతుండగా, ముస్లింలకు మాత్రం అమలు కావడం లేదని ఆయన అన్నారు. అందరికీ ఒకటే పౌరస్మృతి ఉండాలన్నారు. -
లక్నోలో సింఘాల్, అయోధ్యలో తొగాడియా అరెస్ట్!
విశ్వ హిందు పరిషత్ నాయకులు అశోక్ సింఘాల్, ప్రవీణ్ తొగాడియాలను ఉత్తర ప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయోధ్యలో విశ్వహిందూ పరిషత్ నాయకులు చేపట్టిన 'చౌరాసీ కోసి పరిక్రమ యాత్ర'ను ఉత్తర ప్రదేశ్ పోలీసులు అడ్డుకున్నారు. అశోక్ సింఘాల్ ను లక్నోలో అరెస్ట్ చేయగా, తొగాడియాను అయోధ్యలో అదుపులోకి తీసుకున్నారు. 'చౌరాసీ కోసి పరిక్రమ యాత్ర'ను అడ్డుకుంటున్న ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ తీరుకు నిరసనగా రేపట్నుంచి దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టనున్నట్టు అయోధ్యలోని గోలాఘాట్ లో అరెస్టైన తర్వాత తొగాడియా ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో ప్రత్యక్షపోరాటానికి దిగిన విశ్వహిందూ పరిషత్.. అయోధ్య యాత్రను ప్రారంభించింది. పరిషత్ జాతీయ నాయకుడు ప్రవీణ్ తొగాడియా సహా దాదాపు 500 మంది వీహెచ్‌పీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో ఓ మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్యే కూడా ఉన్నారు. రామ జన్మభూమి న్యాస్ కమిటీ చైర్మన్ మహంత్ నృత్య గోపాలదాస్ ఈ యాత్రను అయోధ్యలోని మణిరాం చవానీ (అఖాడా) నుంచి ప్రారంభించారు. కానీ యాత్ర కొద్ది దూరం వెళ్లేలోపే పోలీసులు దాన్ని అడ్డుకున్నారు. తమ యాత్రను రాజకీయం చేయడం తగదని, ఇది కేవలం ఒకటి రెండు రోజులకు సంబంధించినది కాదని, ఏడాది పొడవునా జరుగుతూనే ఉంటుందని గోపాలదాస్ తెలిపారు. యాత్ర చేసి తీరుతామని వీహెచ్‌పీ ప్రకటించిన నేపథ్యంలో అయోధ్యలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నగరంలో కర్ఫ్యూ లాంటి పరిస్థితి ఏర్పడింది. దుకాణాలు మొత్తం మూసేశారు. నయాఘాట్ ప్రాంతమంతా పోలీసు వయలంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా 500 మంది వీహెచ్‌పీ మద్దతుదారులను పోలీసులు అరెస్టు చేశారు. -
వీహెచ్‌పీ యాత్ర ఆరంభం: ప్రవీణ్ తొగాడియా సహా 500 మంది అరెస్టు
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో ప్రత్యక్షపోరాటానికి దిగిన విశ్వహిందూ పరిషత్.. అయోధ్య యాత్రను ప్రారంభించింది. పరిషత్ జాతీయ నాయకుడు ప్రవీణ్ తొగాడియా సహా దాదాపు 500 మంది వీహెచ్‌పీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో ఓ మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్యే కూడా ఉన్నారు. రామ జన్మభూమి న్యాస్ కమిటీ చైర్మన్ మహంత్ నృత్య గోపాలదాస్ ఈ యాత్రను అయోధ్యలోని మణిరాం చవానీ (అఖాడా) నుంచి ప్రారంభించారు. కానీ యాత్ర కొద్ది దూరం వెళ్లేలోపే పోలీసులు దాన్ని అడ్డుకున్నారు. తమ యాత్రను రాజకీయం చేయడం తగదని, ఇది కేవలం ఒకటి రెండు రోజులకు సంబంధించినది కాదని, ఏడాది పొడవునా జరుగుతూనే ఉంటుందని గోపాలదాస్ తెలిపారు. యాత్ర చేసి తీరుతామని వీహెచ్‌పీ ప్రకటించిన నేపథ్యంలో అయోధ్యలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నగరంలో కర్ఫ్యూ లాంటి పరిస్థితి ఏర్పడింది. దుకాణాలు మొత్తం మూసేశారు. నయాఘాట్ ప్రాంతమంతా పోలీసు వయలంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా 500 మంది వీహెచ్‌పీ మద్దతుదారులను పోలీసులు అరెస్టు చేశారు. యాత్రను ప్రభుత్వం నిషేధించిందని, అందువల్ల దీనికి బయల్దేరేవాళ్లు ఎవరైనా వారిని అరెస్టు చేస్తామని శాంతి భద్రతల అదనపు డీజీ అరుణ్ కుమార్ తెలిపారు. వీహెచ్‌పీ నాయకుడు అశోక్ సింఘాల్‌ను కూడా అరెస్టు చేస్తారా అని అడగ్గా, ఆయన అయోధ్యకు వెళ్లే ప్రయత్నం చేస్తే ఆయన్నూ అదుపులోకి తీసుకోక తప్పదని వెల్లడించారు. లేనిపక్షంలో పమాత్రం ఆయన ఎక్కడికైనా వెళ్లచ్చన్నారు.