లక్నోలో సింఘాల్, అయోధ్యలో తొగాడియా అరెస్ట్! | Top leaders arrested, VHP inagurates 'Chaurasi Kosi Parikrama Yatra' | Sakshi
Sakshi News home page

లక్నోలో సింఘాల్, అయోధ్యలో తొగాడియా అరెస్ట్!

Published Sun, Aug 25 2013 3:17 PM | Last Updated on Sat, Apr 6 2019 9:31 PM

లక్నోలో సింఘాల్, అయోధ్యలో తొగాడియా అరెస్ట్! - Sakshi

లక్నోలో సింఘాల్, అయోధ్యలో తొగాడియా అరెస్ట్!

విశ్వ హిందు పరిషత్ నాయకులు అశోక్ సింఘాల్, ప్రవీణ్ తొగాడియాలను ఉత్తర ప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయోధ్యలో విశ్వహిందూ పరిషత్ నాయకులు చేపట్టిన 'చౌరాసీ కోసి పరిక్రమ యాత్ర'ను ఉత్తర ప్రదేశ్ పోలీసులు అడ్డుకున్నారు. అశోక్ సింఘాల్ ను లక్నోలో అరెస్ట్ చేయగా, తొగాడియాను అయోధ్యలో అదుపులోకి తీసుకున్నారు. 
 
'చౌరాసీ కోసి పరిక్రమ యాత్ర'ను అడ్డుకుంటున్న ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ తీరుకు నిరసనగా రేపట్నుంచి దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టనున్నట్టు అయోధ్యలోని గోలాఘాట్ లో అరెస్టైన తర్వాత తొగాడియా ప్రకటించారు. 
 
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో ప్రత్యక్షపోరాటానికి దిగిన విశ్వహిందూ పరిషత్.. అయోధ్య యాత్రను ప్రారంభించింది. పరిషత్ జాతీయ నాయకుడు ప్రవీణ్ తొగాడియా సహా దాదాపు 500 మంది వీహెచ్పీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో ఓ మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్యే కూడా ఉన్నారు. రామ జన్మభూమి న్యాస్ కమిటీ చైర్మన్ మహంత్ నృత్య గోపాలదాస్ ఈ యాత్రను అయోధ్యలోని మణిరాం చవానీ (అఖాడా) నుంచి ప్రారంభించారు. కానీ యాత్ర కొద్ది దూరం వెళ్లేలోపే పోలీసులు దాన్ని అడ్డుకున్నారు. తమ యాత్రను రాజకీయం చేయడం తగదని, ఇది కేవలం ఒకటి రెండు రోజులకు సంబంధించినది కాదని, ఏడాది పొడవునా జరుగుతూనే ఉంటుందని గోపాలదాస్ తెలిపారు.
 
యాత్ర చేసి తీరుతామని వీహెచ్పీ ప్రకటించిన నేపథ్యంలో అయోధ్యలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నగరంలో కర్ఫ్యూ లాంటి పరిస్థితి ఏర్పడింది. దుకాణాలు మొత్తం మూసేశారు. నయాఘాట్ ప్రాంతమంతా పోలీసు వయలంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా 500 మంది వీహెచ్పీ మద్దతుదారులను పోలీసులు అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement