
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పరీక్షలు భారీగా చేస్తున్నారు. గత 24 గంటల్లో 1,16,367 మందికి కరోనా పరీక్షలు చేయగా వాటిలో 22,204 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజాగా 85 మంది కరోనాతో బాధపడుతూ మృతి చెందారు. ప్రభుత్వాస్పత్రుల్లో 18,037 రెమిడెసివిర్ అందుబాటులో ఉన్నాయని ఆరోగ్య శాఖ కార్యదర్శి అశోక్ సింఘాల్ బుధవారం ప్రకటించారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో 11,556 రెమిడెసివిర్‌లను అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు.
ఇప్పటివరకు 387 టన్నుల ఆక్సిజన్‌ను సరఫరా చేశామని ఏకే సింఘాల్ తెలిపారు. 3,220 మంది వైద్యులు 104 కాల్ సెంటర్ ద్వారా టెలీ కన్సల్టెంట్స్ ఇస్తున్నారని చెప్పారు. కేంద్రం ఏపీకి 4,800 రెమిడెసివిర్ వయల్స్ కేటాయించిందని వెల్లడించారు. మే నెల కోటా కింద 9 లక్షల కోవిడ్ టీకాలు రానున్నాయని పేర్కొన్నారు. 13 లక్షల డోసులు కేంద్రం నుంచి కొనుగోలు చేస్తున్నట్లు ఏకే సింఘాల్ హెల్త్ బులెటిన్‌లో తెలిపారు.
చదవండి: ‘కేసీఆర్ బయటకు రా.. ప్రజల కష్టాలు చూడు’
చదవండి: కరోనాపై యుద్ధం ప్రకటించిన మమత
Comments
Please login to add a commentAdd a comment