కొవిడ్-19 వాక్సినేషన్, గుండెపై ప్రభావానికి అనేక వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజా పరిశోధన సంచలన విషయాలను వెల్లడించింది. వివిధ దేశాల్లో ఈ టీకా తీసుకున్న వారిలో(భారత్ మినహా) గుండె సమస్యలు, మెదడు, రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వంటి దుష్ప్రభావాలు కనిపిస్తున్నాయని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. గులియన్ బారే సిండ్రోమ్, మయోకార్డిటిస్, పెర్కిర్డిటిస్ , సెరిబ్రల్ వీనస్ సైనస్ థ్రాంబోసిస్ (CVST) లాంటి కేసులు కనీసం 1.5 రెట్లు పెరిగాయని ఈ స్టడీ వెల్లడించింది.
బ్లూమ్‌బెర్గ్ న్యూస్ నివేదిక ప్రకారం, ఆక్లాండ్ విశ్వవిద్యాలయంలో COVID-19 టీకాతో తీవ్ర ప్రమాదం ఉందో లేదో నిర్ధారించేందుకు ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద వ్యాక్సిన్ అధ్యయనం అని తెలుస్తోంది. భారత్ మినహా, వివిధ దేశాల్లో 9.9 కోట్లమంది వాక్సిన్ తీసుకున్న వారిని విశ్లేషించారు. 13 రకాల ప్రభావాలను పరీశీలించారు. వివిధ దేశాల్లో 9.9 కోట్లమందిలో ద గ్లోబల్ కొవిడ్ సేఫ్టీ ప్రాజెక్ట్ పేరుతో ఈ పరిశోధన నిర్వహించింది.
Rakul-Jackky Wedding : జాకీ స్పెషల్ సర్‌ప్రైజ్, ఫోటోలు వైరల్
ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ తాజా పరిశోధన కీలక డాటా సేకరించింది. మోడర్నా(mRNA),కోవిషీల్డ్ (ChadOX1) వ్యాక్సిన్‌ల తర్వాత ఊహించిన దానికంటే ఎక్కువ దుష్ప్రభావాలున్నాయని కనుగొంది. ముఖ్యంగా ఆస్ట్రాజెనెకా కోవిడ్-19 టీకా తీసుకున్నవారిలో చాలా అరుదైన రక్తం గడ్డకట్టే ప్రమాదం ఎక్కువగా ఉందని అధ్యయనం పేర్కొంది. రోగనిరోధక వ్యవస్థ నరాలపై దాడి చేసే Guillain-Barre సిండ్రోమ్‌ను గుర్తించారు ఇది కండరాలకు తీవ్ర హాని కలిగించవచ్చు, సుదీర్ఘ చికిత్స తీసుకోవాలి. ఒక్కోసారి ప్రాణాంతకం కావచ్చు. ఈ టీకా డోస్ తీసుకున్న వారిలో 6.9 రెట్లు ఎక్కువ ప్రమాదం ఉందని అధ్యయనం కనుగొంది.
వెడ్డింగ్ సీజన్: ఇన్‌స్టెంట్ గ్లో, ఫ్రెష్ లుక్ కావాలంటే..!
కోవిషీల్డ్ వ్యాక్సిన్‌తో గుండెపై తీవ్ర దుష్ప్రభావాలు, గుండెపోటు,పక్షవాతం,రక్తంలో గడ్డకట్టడం వంటి సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో గుండె సమస్యలు, మెదడు రక్తనాళాల్లో గడ్డకట్టడం వంటివి 1.5 రెట్లు పెరిగాయట. ఈ తరహా టీకాలే భారత్‌లోనూ పెద్ద సంఖ్యలో తీసుకున్నారని, దీని ప్రభావం ఏంటన్నది మాత్రం శాస్త్రీయంగా బయటకు రాలేదనినిపుణులు చెబుతున్నారు.
గ్లోబల్ కోవిడ్ వ్యాక్సిన్ సేఫ్టీ ప్రాజెక్ట్ కింద అర్జెంటీనా, న్యూ సౌత్ వేల్స్ , ఆస్ట్రేలియాలోని విక్టోరియా, బ్రిటిష్ కొలంబియా , కెనడా, డెన్మార్క్‌లోని అంటారియోతో సహా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, న్యూజిలాండ్ , స్కాట్లాండ్ పలు ప్రదేశాల్లో డి COVID-19 వ్యాక్సిన్‌లకు సంబంధించిన ప్రతికూల సంఘటనలపై ఎలక్ట్రానిక్ హెల్త్‌కేర్ డేటాను సేకరించింది. కాగా కరోనా మహమ్మారి ప్రారంభం తరువాత ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా 13.5 బిలియన్ల కంటే ఎక్కువ టీకాలు తీసుకున్నట్టు సమాచారం. అయితే ఈ పరిశోధనపై వాక్సిన్ తయారీదారులు ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment