'పాక్ జెండాలు ఎగరేసిన వారిని షూట్ చేయాలి' | Shoot those who hoist Pakistani flags in Kashmir: Togadia | Sakshi
Sakshi News home page

'పాక్ జెండాలు ఎగరేసిన వారిని షూట్ చేయాలి'

Published Sun, Jun 14 2015 8:19 PM | Last Updated on Sat, Mar 23 2019 8:37 PM

'పాక్ జెండాలు ఎగరేసిన వారిని షూట్ చేయాలి' - Sakshi

'పాక్ జెండాలు ఎగరేసిన వారిని షూట్ చేయాలి'

రాజకోట్: పాకిస్థాన్ అనుకూల కశ్మీర్ వేర్పాటు వాదులపై కేంద్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని విశ్వహిందూ పరిషత్(వీహెచ్ పీ) అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా విమర్శించారు. కశ్మీర్ లో పాకిస్థాన్ జెండాలు ఎగురవేసిన వారిని కాల్చి పారేయాలని అన్నారు.

'కశ్మీర్ లో పాక్ ఎండాలు ఎగురవేయడం ఆందోళన కలిగించే పరిణామం. రొమ్ము విరుచుకుని పాకిస్థాన్ కు అనుకూలంగా నినాదాలు చేస్తూ ఆ దేశపు  పతాకాలు ఎగురవేసే వారిని షూట్ చేయాల్సిన అవసరముంది' అని తొగాడియా పేర్కొన్నారు.

కచ్ జిల్లాలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వేర్పాటువాదులపై బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని తొగాడియా అసంతృప్తి వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement