షహజన్‌పూర్ : తాను నిర్వహించే కళాశాలలో న్యాయవిద్యను అభ్యసించిన విద్యార్థినిచే లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి స్వామి చిన్మయానంద్‌పై లైంగిక దాడి అభియోగాలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తారని భావిస్తున్నారు. అత్యంత భద్రత నడుమ బాధితురాలు సుప్రీం కోర్టులో స్టేట్‌మెంట్ నమోదు చేయడంతో ఈ దిశగా చిన్మయానంద్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు ముమ్మరం కానుంది. మరోవైపు చిన్మయానంద్ అస్వస్థతకు లోనుకావడంతో షహజన్‌పూర్‌లోని తన ఆశ్రమంలో ఆయనను వైద్యులు పరీక్షించి చికిత్స అందించారు. చిన్మయానంద్ డయేరియాతో బాధపడుతున్నారని, ఆయనకు మధుమేహం ఉండటంతో బలహీనంగా ఉన్నారని పూర్తి విశ్రాంతి తీసుకుంటే పరిస్థితి మెరగువుతుందని వైద్యులు సూచించారు. కాగా చిన్మయానంద్ తనపై ఏడాదిపాటు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆయన నిర్వహించే కళాశాలలో చదివే లా విద్యార్ధిని ఆరోపించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment