
కర్ణాటక, యశవంతపుర : మంగళూరు జిల్లా పుత్తూరులో కాలేజీ విద్యార్థినిపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులకు హైకోర్టు గురువారం బెయిల్‌ను మంజూరు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన విద్యార్థిని హత్యాచారం కేసులో నిందితులు గురునందన్, ప్రజ్వల్, కిషన్, సునీల్, ప్రఖ్యాత్‌లకు బెయిల్ ఇచ్చింది. మార్చిలో వీరు తమ సహ విద్యార్థిని ఇంటికి తీసుకెళ్తామంటూ నమ్మించి కారులో తీసుకెళ్లి మార్గం మధ్యలో విద్యార్థినిపై అత్యాచారం చేసి హత్య చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావటంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. పుత్తూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులను అరెస్ట్ చేశారు. కింది కోర్టు నిందితులకు బెయిల్‌ను నిరాకరించింది. హైకోర్టుకు వెళ్లటంతో ఐదుగురు నిందితులకు బెయిల్ మంజూరు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment