అత్యాచారాల్లాంటి తీవ్రమైన నేరాల్లో నిందితులుగా ఉన్న బాలలను వయోజన నేరస్తులతో సమానంగా పరిగణించి శిక్షించాలని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకాగాంధీ అన్నారు.
అత్యాచారాల్లాంటి తీవ్రమైన నేరాల్లో నిందితులుగా ఉన్న బాలలను వయోజన నేరస్తులతో సమానంగా పరిగణించి శిక్షించాలని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకాగాంధీ అన్నారు. చెన్నైలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ లైంగికపరమైన నేరాలకు పాల్పడుతున్న 16 ఏళ్లవారిలో సగం మందికి పైగా జువెనైల్ చట్టం గురించి బాగా తెలుసని పోలీసులు చెబుతున్న అంశాన్ని ఆమె ప్రస్తావించారు.
ఇలా చట్టాల గురించి తెలుసుకుని, వాటినుంచి తప్పించుకుంటూ దారుణమైన నేరాలకు పాల్పడుతున్నవారిని వయోజనులతో సమానంగానే పరిగణించి శిక్షించాలని, అలాగైతేనే ఇతరులు కూడా ఇలాంటి నేరాలకు పాల్పడకుండా భయపడతారని ఆమె చెప్పారు.