నిర్భయ గ్యాంగ్‌రేప్ కేసులో అరెస్టయి.. వచ్చే నెల విడుదల కాబోతున్న బాల ఖైదీపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని సూచించనున్నట్లు సోమవారం కేంద్ర మంత్రి మేనకా గాంధీ పేర్కొన్నారు. అతని శిక్షా కాలాన్ని మరింత పెంచే అవకాశం లేదని, మైనర్ కావడంతో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
2012లో జరిగిన ఢిల్లీ గ్యాంగ్‌రేప్ ఘటనలో అరెస్టయిన పదిహేడున్నర ఏళ్ల మైనర్.. ఫ్రొహిబిషన్ సెంటర్‌లో మూడేళ్ల శిక్షా కాలాన్ని పూర్తి చేసుకున్నాడు. ప్రసుత్తం అతనికి 21 సంవత్సరాలు రావడంతో కోర్టు ఆదేశాల మేరకు విడుదల చేయనున్నారు.