లక్నో : తనకు ఓటు వేస్తేనే సాయం చేస్తానని ముస్లిం ఓటర్లను బెదిరించి వివాదంలో చిక్కుకున్న కేంద్రమంత్రి మేనకా గాంధీ.. మరోసారి నోరు జారారు. ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్ నుంచి పోటీ చేస్తున్న ఆమె ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి మద్దతుగా ఉండే గ్రామాలను ఏబీసీడీ కేటగిరిలుగా విభజించి.. గెలిచిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు చేపడ్తామని ప్రకటించారు. బీజేపీ 80 శాతం ఓటర్లు మద్దతుగా ఉండే గ్రామాలను ఏ కేటగిరిగా.. 60 శాతంలోపు ఉండే గ్రామాలను బీ.. 50 శాతంకు తక్కువగా ఉండే ఊర్లను సీ.. 30 శాతం కన్నా తక్కువగా ఉన్న గ్రామాలను డీ కేటగిరిలుగా విభజించారు. గెలిచిన తర్వాత చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు ఈ కేటగిరిల మాదిరిగానే ప్రాధాన్యత కల్పిస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే పిలిబిత్ నియోజకవర్గంలో ఈ కేటగిరి సిస్టమ్‌ను అమలు చేశామన్నారు. పిలిభిత్ నుంచి ఆరసార్లు గెలుపొందిన మేనకా.. ఈ సారి సుల్తాన్‌పూర్ నుంచి బరిలోకి దిగుతున్నారు. సుల్తాన్‌పూర్ సిట్టింగ్ ఎంపీ అయిన ఆమె కుమారుడు వరుణ్ గాంధీ పిలిబిత్ నుంచి పోటీ చేస్తున్నారు.
మస్లిం ఓటర్లను బెదిరించిన వ్యవహారం సోషల్ మీడియాలో రచ్చకావడంతో ఈసీ వివిరణ కోరుతూ ఆమెకు నోటీసులు జారిచేసింది. ముస్లింల ఓట్లు లేకుండా లభించే గెలుపు తనకు సంతోషానివ్వదంటూనే...తనకు ఓటు వేయాలో లేదో నిర్ణయించుకోవాలని, తనకు ఓటు చేయని ముస్లింలకు తానెలా సాయం చేస్తానంటూ మేనకా బ్లాక్ మెయిలింగ్‌కు దిగారు. ఓటు వేయని ముస్లిం ఓటర్ల వివరాలు తనకు తెలిసి పోతాయనీ ఈ నేపథ్యంలో వారికందాల్సిన సహాయం ఆధారపడి వుంటుందంటూ సభాముఖంగానే హెచ్చరించారు. మీరు ఓటు వేసినా... వేయకపోయినా గెలుస్తాను. కానీ ఇది ఇచ్చు పుచ్చుకోవాల్సిన వ్యవహారమని వివాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment