కేరళ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టిన మేనకా
న్యూఢిల్లీ: వీధి కుక్కలను నిర్మూలించడానికి కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పర్యావరణ ఉద్యమకారిణి, కేంద్రమంత్రి మేనకాగాంధీ తీవ్రంగా తప్పుబట్టారు. కుక్కలను చంపాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చట్ట వ్యతిరేకమైనదిగా, అశాస్త్రీయమైనదిగా పేర్కొన్నారు. కుక్కల స్టెరిలైజేషన్ కోసం కేంద్రం ఇస్తున్న నిధులు ఎక్కడికి పోతున్నాయని కేరళ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
కుక్కులను నిర్మూలించడానికి వాటిని చంపడమే పరిష్కారం కాదని తేల్చి చెప్పారు. ఢిల్లీ నగరంలో 5,00,000 ల కుక్కులుండేవని స్టెరిలైజేషన్ తర్వాత వాటి సంఖ్య 70 వేలకు తగ్గిందన్నారు.