Kill Dogs
-
వీధి కుక్క పిల్లలపై అమానుషం.. మంటల్లో కాల్చి చంపిన వ్యక్తి అరెస్టు
సాక్షి, హైదరాబాద్: వీధి కుక్కలను మంటల్లో కాల్చి చంపిన వ్యక్తిపై కూకట్పల్లి పోలీల్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల వివరాల ప్రకారం.. కూకట్‌పల్లిలో నివాసం ఉంటున్న రవీంద్ర అనే వ్యక్తి రోజు మాదిరిగానే సోమవారం రాత్రి వీధి కుక్కలకు అన్నం పెట్టేందుకు తన ఇంటి నుంచి కారులో బయల్దేరి ఆ ప్రాంతానికి చేరుకున్నాడు. అన్నం పెట్టేందుకు వీధి కుక్కలను పిలవగా ఎంతకీ కనిపించలేదు. చుట్టుపక్కల ప్రాంతాల్లో కుక్కల గురించి ఆరా తీయగా అదే ప్రాంతంలోని మ్యాన్‌హోల్ నుంచి పొగలు రావడంతో దగ్గరికి వెళ్లి చూడగా మూడు కుక్క పిల్లలు మంటల్లో కాలిపోయి ఉండటాన్ని గమనించాడు. కుక్క పిల్లల చావుకు ఎవరు కారణమై ఉంటారని ఆరా తీయగా బాలాజీనగర్‌కు చెందిన సునీల్‌గా గుర్తించారు. సునీల్‌పై చర్యలు తీసుకోవాలని రవీంద్ర పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. చదవండి: చతికిల‘బడి’.. కూలిపోయే పైకప్పులు.. వేలాడే విద్యుత్ తీగలు! -
కేరళ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టిన మేనకా
న్యూఢిల్లీ: వీధి కుక్కలను నిర్మూలించడానికి కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పర్యావరణ ఉద్యమకారిణి, కేంద్రమంత్రి మేనకాగాంధీ తీవ్రంగా తప్పుబట్టారు. కుక్కలను చంపాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చట్ట వ్యతిరేకమైనదిగా, అశాస్త్రీయమైనదిగా పేర్కొన్నారు. కుక్కల స్టెరిలైజేషన్ కోసం కేంద్రం ఇస్తున్న నిధులు ఎక్కడికి పోతున్నాయని కేరళ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కుక్కులను నిర్మూలించడానికి వాటిని చంపడమే పరిష్కారం కాదని తేల్చి చెప్పారు. ఢిల్లీ నగరంలో 5,00,000 ల కుక్కులుండేవని స్టెరిలైజేషన్ తర్వాత వాటి సంఖ్య 70 వేలకు తగ్గిందన్నారు.