ఆ వ్యక్తిని అరెస్ట్‌ చేయండి: మేనకా గాంధీ | Maneka Gandhi Request To Dog Breeder Arrest Who Crushes Dog With Car | Sakshi
Sakshi News home page

ఆ వ్యక్తిని అరెస్ట్‌ చేయండి: మేనకా గాంధీ

Published Tue, Aug 18 2020 6:44 PM | Last Updated on Tue, Aug 18 2020 6:58 PM

Maneka Gandhi Request To Dog Breeder Arrest Who Crushes Dog With Car - Sakshi

న్యూఢిల్లీ : పంజాబ్‌ రాష్ట్రంలో ఓ వ్యక్తి పెంపుడు శునకాన్ని కారుతో తొక్కించి చంపిన ఘటనపై బీజేపీ సీనియర్‌ నాయకురాలు మేనకా గాంధీ స్పందించారు. సదరు వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం ట్విటర్‌ వేదికగా ఆమె స్పందిస్తూ.. ‘‘శునకాన్ని కారుతో తొక్కించి చంపిన వ్యక్తి పేరు గురిందర్‌ సింగ్‌. పంజాబ్‌లోని కాపుర్‌తలా, దండూపుర్‌కు చెందిన వాడు. అతడు డాగ్స్‌ బ్రీడింగ్‌ చేయటంతో పాటు వాటిని పోట్లాటల కోసం అమ్ముతుంటాడు. కుక్కలతో అవసరం తీరిపోతే అతడు ఇలా హింసించి చంపుతుంటాడు. ఆ కుక్క అత్యంత బాధను అనుభవించి 30 నిమిషాల తర్వాత చనిపోయింది’’ అని తెలిపారు.
 

‘‘ఆ రోజు రాత్రి అతడి దగ్గర ఉన్న కుక్కలను ఇంటి వెనకాల ఉన్న ఓ చెరువులో పడేశాడు. ఓ కుక్క చనిపోయింది. మిగిలిన కుక్కలను స్థానికులు కాపాడారు. ఈ వ్యక్తిని అరెస్ట్‌ చేయాలని ముఖ్యమంత్రి, పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement