మీ లేఖలు మనసు లోతులను తాకాయి
‘‘మీ లేఖలు మనసు లోతులను తాకాయి... నా మీద మీకున్న ప్రేమ, ఆప్యాయతలకు సదా కృతజ్ఞతలు.’’ అని అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత నటుడు సూపర్‌స్టార్ రజనీకాంత్, కేంద్ర మంత్రి మేనకా గాంధీలకు ఆమె వేర్వేరుగా లేఖలు రాశారు.
సాక్షి, చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కారాగారవాసం వీడిన అన్నాడీఎంకే అధినేత్రి జే జయలలిత బెయిల్ మీద బయటకు వచ్చిన విషయం తెలిసిందే. పోయెస్ గార్డెన్‌లో ఆమె విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం దక్షిణ భారత చలనచిత్ర సూపర్‌స్టార్ రజనీ కాంత్ జయలలితకు లేఖ రాశారు. ఆమెను పరామర్శించడంతోపాటుగా సానుభూతి తెలియజేస్తూ ఆ లేఖలో ప్రస్తావించారు. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా సంజయ్ గాంధీ సైతం ఓ లేఖను రాశారు. తన మద్దతును తెలియజేస్తూ, సానుభూతి వ్యక్తం చేశారు. అన్ని ఒడిదొడుకుల్ని విజయవంతంగా ఎదుర్కొని, మళ్లీ అధికార పగ్గాలు చేపట్టాలని కాంక్షించారు.
తనను పరామర్శిస్తూ లేఖ రాసిన ఆ ఇద్దరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సోమవారం జయలలిత వేర్వేరుగా లేఖలు రాశారు. సమాధానం ఇలా : దక్షిణ భారత చలన చిత్ర సూపర్ స్టార్ రజనీకాంత్‌కు రాసిన లేఖలో... ఁ్ఙమీరు రాసిన లేఖ నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. నా మీద మీకున్న గౌరవం, చూపిన ఆప్యాయతలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీరు ఆయురారోగ్యాలతో, తల బెట్టిన కార్యక్రమాలు విజయవంతం అయ్యే విధంగా, కుటుంబంతో ఆనందంగా గడపాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నాను.రూ.రూ. అంటూ రాశారు. ఇక, మేనకా గాంధీకి రాసిన లేఖలో....్ఙ్ఙపని ఒత్తిడితో బిజీ బిజీగా ఉన్నా, నన్ను గుర్తుంచుకుని లేఖ రాయడం ఆనందంగా ఉంది. మీరు రాసిన ఆ లేఖ నా మనస్సును తాకింది. మీరు ఆయురారోగ్యాలతో ప్రజలకు మరింత సేవలు అందించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను.రూ.రూ. అంటూ వ్యాఖ్యలు చేశారు.