
మేనకా గాంధీ (ఫైల్ ఫొటో)
న్యూఢిల్లీ : కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ టాన్స్‌జెండర్స్‌కు క్షమాపణలు తెలిపారు. లోక్‌సభలో తప్పుగా సంభోదించినందుకు మన్నించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. మనుషుల అక్రమ రవాణా నిరోధక బిల్లును లోక్‌సభలో ప్రవేశపెడుతూ.. ఆమె ట్రాన్స్‌జెండర్స్‌ను అభ్యతకరమైన పదంతో సంభోదించారు. దీంతో సభలో నవ్వులు పూసాయి. ఆమె వ్యాఖ్యలపై ట్రాన్స్‌జెండర్స్ సంఘాల ఆగ్రహం వ్యక్తం చేయడంతో తన తప్పును గుర్తించారు. తను కావాలని అలా చేయలేదని, క్షమించాలని కోరుతూ ట్వీట్ చేశారు.
‘అక్రమ రవాణా నిరోధక బిల్లును లోక్‌సభలో ప్రవేశపెడుతూ.. నేను ట్రాన్స్‌జెండర్స్‌పై వాడిన పదానికి చింతిస్తున్నాను. నేను కావాలని అలా చేయలేదు. అనాలోచితంగా మాట్లాడినందుకు నాపై నాకే అసహ్యం వేస్తుంది. నిజానికి ట్రాన్స్‌జెండర్స్‌ను అధికారికంగా ఏమని పిలుస్తారో నాకు తెలియదు. భవిష్యత్తులో మళ్లీ మీ మనసులను నొప్పించను. ట్రాన్స్‌జెండర్స్ అనే పిలుస్తాను. క్షమించండి’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. మంత్రితో పాటు ఎంపీలు కూడా క్షమాపణలు తెలియజేయాలని టాన్స్‌జెండర్ సంఘం నేత మీరా సంఘమిత్ర డిమాండ్ చేశారు.
I was not aware of the official terminology for the transgender community. In future, all official communication will use the term TGs. I would like to assure that the #AntiTraffickingBill2018 is gender neutral and provides protection to the aggrieved.
— Maneka Gandhi (@Manekagandhibjp) July 30, 2018
Comments
Please login to add a commentAdd a comment