పాస్పోర్ట్లో తండ్రి పేరు అవసరమా! | amend passport rules that make listing the father's name a mandatory: Maneka Gandhi | Sakshi
Sakshi News home page

పాస్పోర్ట్లో తండ్రి పేరు అవసరమా!

Published Sat, Jul 16 2016 3:55 PM | Last Updated on Mon, Sep 4 2017 5:01 AM

పాస్పోర్ట్లో తండ్రి పేరు అవసరమా!

పాస్పోర్ట్లో తండ్రి పేరు అవసరమా!

న్యూఢిల్లీ: 'నా పేరు ప్రియాంక గుప్తా. చిత్రహింసలు పెట్టే భర్త నుంచి దూరంగా ఉంటోన్న నేను.. ఒక్కగానొక్క బిడ్డ (గరీమా)ను ఉన్నత చదువులు చదివించా. ఇప్పుడు ఆమెకు  మంచి ఉద్యోగావకాశాలు వచ్చాయి. ఈ క్రమంలోనే గరీమా పాస్ పోర్ట్ కు దరఖాస్తు చేసుకుంది. అప్లికేషన్ లో తండ్రి పేరు రాయాల్సిన చోట ఖాళీ వదిలేసింది. అధికారులు మాత్రం తండ్రి పేరు తప్పనిసరిగా పేర్కొనాల్సిందేనని అంటున్నారు. విడిపోయినా, చనిపోయినా తండ్రి పేరు రాయాల్సిందేనంటున్నారు. మేడం.. నన్ను, నా కూతురిని దారుణంగా హింసించిన ఆ వ్యక్తి పేరును వాడుకోవడం కాదుకదా కనీసం పలకడం కూడా మాకు ఇష్టం లేదు. గౌరవ న్యాయస్థానాలు ఎన్నెన్నో మంచి తీర్పులు చెప్పాయి. మా సమస్యపైనా అలాంటి పరిష్కారాన్నే కోరుతున్నాం. మా అభ్యర్థనను మన్నించి పాస్ పోర్టులో తండ్రి పేరు తప్పనిసరనే నిబంధనను సవరించగలరు'..

 

ఇది ఢిల్లీకి చెందిన ప్రియాంక అనే మహిళ కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మనేకా గాంధీకి రాసిన లేఖలోని సారాంశం. దాదాపు 45 వేల మంది ఈ లేఖను సమర్థించడంతో మంత్రి మనేకా గాంధీ రంగంలోకి దిగారు. పౌరుల పాస్ పోర్టుకు సంబంధించి ప్రస్తుతం అమలులో ఉన్న తండ్రి పేరు నిబంధనను మార్చాల్సిందిగా మనేకా శుక్రవారం విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ కు ఒక లేఖ రాశారు. దేశంలో సింగిల్ పేరెంట్స్ సంఖ్య పెరుగుతోన్న దృష్ట్యా నిబంధనలు సవరించాల్సిన అవసరం ఉందని మనేకా అభిప్రాయపడ్డారు. ఆమె అభ్యర్థనపై విదేశాంగ శాఖ ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. రెండు నెలల కిందట ఢిల్లీ హైకోర్టు ఓ తీర్పు చెబుతూ.. దరఖాస్తు దారులను ఇష్టం లేకపోతే పాస్ పోర్టులో తండ్రి పేరు పేర్కొనాల్సిన అవసరంలేదని స్పష్టం చేసింది. దీనిపై త్వరలోనే ఓ శాశ్వత పరిష్కారం లభిస్తుందని మనేకా ఆశాభావం వ్యక్తం చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement