fathers name
-
పాసుపోర్టులో తండ్రి పేరుపై హైకోర్టు కీలక తీర్పు
ఢిల్లీ: పాస్‌పోర్టులో తండ్రి పేరుకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. బిడ్డ జన్మించకముందే భార్యను, బిడ్డను వదిలివెళ్లిపోయిన తండ్రి పేరును పాస్‌పోర్టులో చేర్చాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. అలాగే, ప్రత్యేక పరిస్థిత్లుల్లో తండ్రి పేరును తొలగించడంతో పాటుగా ఇంటి పేరును కూడా మార్చుకోవచ్చు అని కోర్టు పేర్కొంది. వివరాల ప్రకారం.. ఓ తల్లి, ఆమె కొడుకు.. తండ్రి నుంచి విడిపోయి జీవిస్తున్నారు. అయితే, భర్త తోడు లేకుండా ఒంటరిగా బిడ్డను పెంచిన ఓ మహిళ తన మైనర్ కుమారుడి పాస్‌పోర్టు విషయంలో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో తన బిడ్డ కడుపులో ఉండగానే తన భర్త ఆమెను వదిలివెళ్లిపోయాడని.. ఆ తర్వాత శిశువు బాధ్యతలు పూర్తిగా తానే చూసుకున్నానని పిటిషన్లో పేర్కొన్నారు. కాగా, తన కుమారుడి మంచి చెడ్డలు తానే చూసుకుంటున్నట్టు, పాస్‌పోర్టులో తండ్రి పేరును తొలగించాలని ఆమె పిటిషన్లో తెలిపారు. ఈ నేపథ్యంలో తండ్రి పేరు లేకుండా కొత్త పాస్‌పోర్టు జారీ చేయాలని ధర్మసనాన్ని కోరారు. దీంతో, ఆమె పిటిషన్‌పై విచారణ జరిపిన అనంతరం.. న్యాయమూర్తి జస్టిస్ ప్రతిభా ఎం సింగ్ కీలక తీర్పు వెలువరించారు. ‘తండ్రి బిడ్డను పూర్తిగా వదిలిపెట్టిన కేసు ఇది. మైనర్ కుమారుడి పాస్‌పోర్టు నుంచి తండ్రి పేరు తొలగించి కొత్తది జారీ చేయాలని అధికారులను ఆదేశిస్తున్నాం. ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో తండ్రి పేరును తొలగించడంతో పాటు ఇంటిపేరును కూడా మార్చుకోవచ్చు’ అని కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో వారిద్దరూ సంతోషం వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: ఢిల్లీలో వ్యాపారం..హైదరాబాద్‌లో ఆస్తులు -
పాస్‌పోర్ట్‌లో తండ్రిపేరు అవసరం లేదు
పాస్‌పోర్ట్ దరఖాస్తులో తండ్రిపేరును కచ్చితంగా నమోదుచేయాల్సిన అవసరం లేదని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. చట్టరీత్యా తండ్రిపేరు ట్రావెల్ డాక్యుమెంట్లో తప్పనిసరేమీ కాదని పేర్కొంది. ఈ ఏడాది మేలో కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్‌ను రిఫర్ చేసుకొని జస్టిస్ సంజీవ్ సచ్‌దేవా ఈమేరకు తీర్పునిచ్చారు. బయోలాజికల్ ఫాదర్ పేరును నమోదుచేయకపోవడంతో, ఓ యువకుడి పాస్‌పోర్ట్‌ను రెన్యువల్ చేయకుండా ఢిల్లీ స్థానిక పాస్‌పోర్టు ఆఫీసు కార్యాలయం తిరస్కరించింది. దీంతో 2017 జూన్ వరకు వాలిడ్‌లో ఉన్న ఆ యువకుడి పాస్‌పోర్టును అథారిటీలు రద్దు చేశాయి. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో కోర్సును చేయడానికి 2007లో ఆ యువకుడికి అథారిటీలు పాస్‌పోర్టు జారీచేశాయి. కోర్సు పూర్తయ్యే ముందు వరకు అతను పాస్‌పోర్ట్‌ను రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ అతని పాస్‌పోర్ట్‌ను రెన్యువల్ చేయకుండానే అధికారులు రద్దు చేశారు. 2003లో నిర్లక్ష్యంగా వ్యవహరించే తన తండ్రి నుంచి తల్లి విడాకులు పొందిందని, ఈ నేపథ్యంలో రెన్యువల్ ఫామ్‌లో తండ్రి పేరును నమోదుచేయలేదని ఆ యువకుడు పేర్కొన్నాడు. తండ్రి పేరు లేని అప్లికేషన్‌ను సాప్ట్ వేర్ ఆమోదించదని, తప్పనిసరిగా తండ్రిపేరు నమోదుచేయాలని పాస్‌పోర్టు అథారిటీలు వాదించాయి. అయితే తండ్రిపేరు లేనప్పటికీ అతనికి ముందు పాస్‌పోర్టు జారీచేసిన సంగతిని కోర్టు ప్రశ్నించింది. సాప్ట్‌వేర్‌ను సవరించి అతనికి పాస్‌పోర్టు జారీచేయాలని అథారిటీలను కోర్టు ఆదేశించింది. భర్త నుండి విడాకులు తీసుకున్న ఒక మహిళ తన బిడ్డ ఖర్చు తానే భరిస్తున్నానని, కావున పాస్ పోర్ట్ లో అతని పేరును తొలగించాలని వేసిన పిటీషన్ కు కూడా ఢిల్లీ కోర్టు ఈ విధంగానే స్పందించిన సంగతి తెలిసిందే. పాస్ పోర్ట్ లో తండ్రి పేరు కచ్చితంగా ఉండాలన్న నిబంధనను సడలించాలని అప్పుడే హైకోర్టు సూచించింది. -
పాస్‌పోర్ట్‌లో తండ్రి పేరు అవసరమా!
న్యూఢిల్లీ: 'నా పేరు ప్రియాంక గుప్తా. చిత్రహింసలు పెట్టే భర్త నుంచి దూరంగా ఉంటోన్న నేను.. ఒక్కగానొక్క బిడ్డ (గరీమా)ను ఉన్నత చదువులు చదివించా. ఇప్పుడు ఆమెకు మంచి ఉద్యోగావకాశాలు వచ్చాయి. ఈ క్రమంలోనే గరీమా పాస్ పోర్ట్ కు దరఖాస్తు చేసుకుంది. అప్లికేషన్ లో తండ్రి పేరు రాయాల్సిన చోట ఖాళీ వదిలేసింది. అధికారులు మాత్రం తండ్రి పేరు తప్పనిసరిగా పేర్కొనాల్సిందేనని అంటున్నారు. విడిపోయినా, చనిపోయినా తండ్రి పేరు రాయాల్సిందేనంటున్నారు. మేడం.. నన్ను, నా కూతురిని దారుణంగా హింసించిన ఆ వ్యక్తి పేరును వాడుకోవడం కాదుకదా కనీసం పలకడం కూడా మాకు ఇష్టం లేదు. గౌరవ న్యాయస్థానాలు ఎన్నెన్నో మంచి తీర్పులు చెప్పాయి. మా సమస్యపైనా అలాంటి పరిష్కారాన్నే కోరుతున్నాం. మా అభ్యర్థనను మన్నించి పాస్ పోర్టులో తండ్రి పేరు తప్పనిసరనే నిబంధనను సవరించగలరు'.. ఇది ఢిల్లీకి చెందిన ప్రియాంక అనే మహిళ కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మనేకా గాంధీకి రాసిన లేఖలోని సారాంశం. దాదాపు 45 వేల మంది ఈ లేఖను సమర్థించడంతో మంత్రి మనేకా గాంధీ రంగంలోకి దిగారు. పౌరుల పాస్ పోర్టుకు సంబంధించి ప్రస్తుతం అమలులో ఉన్న తండ్రి పేరు నిబంధనను మార్చాల్సిందిగా మనేకా శుక్రవారం విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ కు ఒక లేఖ రాశారు. దేశంలో సింగిల్ పేరెంట్స్ సంఖ్య పెరుగుతోన్న దృష్ట్యా నిబంధనలు సవరించాల్సిన అవసరం ఉందని మనేకా అభిప్రాయపడ్డారు. ఆమె అభ్యర్థనపై విదేశాంగ శాఖ ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. రెండు నెలల కిందట ఢిల్లీ హైకోర్టు ఓ తీర్పు చెబుతూ.. దరఖాస్తు దారులను ఇష్టం లేకపోతే పాస్ పోర్టులో తండ్రి పేరు పేర్కొనాల్సిన అవసరంలేదని స్పష్టం చేసింది. దీనిపై త్వరలోనే ఓ శాశ్వత పరిష్కారం లభిస్తుందని మనేకా ఆశాభావం వ్యక్తం చేశారు.