ఢిల్లీ: పాస్‌పోర్టులో తండ్రి పేరుకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. బిడ్డ జన్మించకముందే భార్యను, బిడ్డను వదిలివెళ్లిపోయిన తండ్రి పేరును పాస్‌పోర్టులో చేర్చాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. అలాగే, ప్రత్యేక పరిస్థిత్లుల్లో తండ్రి పేరును తొలగించడంతో పాటుగా ఇంటి పేరును కూడా మార్చుకోవచ్చు అని కోర్టు పేర్కొంది.
వివరాల ప్రకారం.. ఓ తల్లి, ఆమె కొడుకు.. తండ్రి నుంచి విడిపోయి జీవిస్తున్నారు. అయితే, భర్త తోడు లేకుండా ఒంటరిగా బిడ్డను పెంచిన ఓ మహిళ తన మైనర్ కుమారుడి పాస్‌పోర్టు విషయంలో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో తన బిడ్డ కడుపులో ఉండగానే తన భర్త ఆమెను వదిలివెళ్లిపోయాడని.. ఆ తర్వాత శిశువు బాధ్యతలు పూర్తిగా తానే చూసుకున్నానని పిటిషన్‌లో పేర్కొన్నారు.
కాగా, తన కుమారుడి మంచి చెడ్డలు తానే చూసుకుంటున్నట్టు, పాస్‌పోర్టులో తండ్రి పేరును తొలగించాలని ఆమె పిటిషన్‌లో తెలిపారు. ఈ నేపథ్యంలో తండ్రి పేరు లేకుండా కొత్త పాస్‌పోర్టు జారీ చేయాలని ధర్మసనాన్ని కోరారు. దీంతో, ఆమె పిటిషన్‌పై విచారణ జరిపిన అనంతరం.. న్యాయమూర్తి జస్టిస్ ప్రతిభా ఎం సింగ్ కీలక తీర్పు వెలువరించారు. ‘తండ్రి బిడ్డను పూర్తిగా వదిలిపెట్టిన కేసు ఇది. మైనర్ కుమారుడి పాస్‌పోర్టు నుంచి తండ్రి పేరు తొలగించి కొత్తది జారీ చేయాలని అధికారులను ఆదేశిస్తున్నాం. ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో తండ్రి పేరును తొలగించడంతో పాటు ఇంటిపేరును కూడా మార్చుకోవచ్చు’ అని కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో వారిద్దరూ సంతోషం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: ఢిల్లీలో వ్యాపారం..హైదరాబాద్‌లో ఆస్తులు
Comments
Please login to add a commentAdd a comment