
గంజాయిని చట్టబద్ధం చేయాలి: మేనకాగాంధీ
న్యూఢిల్లీ: మత్తు పదార్థంగా భావించే గంజాయి వినియోగాన్ని వైద్య అవసరాల కోసం చట్టబద్ధం చేయాలని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రి మేనకాగాంధీ సూచించారు. మాదక ద్రవ్యాల సమస్యను ఎదుర్కొనేందుకు అమెరికాలో ఇలాంటి పద్ధతులనే అవలంభిస్తున్న సంగతిని ప్రస్తావించారు.
నేషనల్ డ్రగ్ డిమాండ్ రిడక్షన్ విధానంపై కేబినెట్ నోట్‌ను అధ్యయనం చేస్తున్న మంత్రుల బృందం నిర్వహించిన సమావేశంలో ఆమె ఈ సూచన చేశారు. అమెరికాలో మాదిరిగానే భారత్‌లోనూ గంజాయి వినియోగాన్ని చట్టబద్ధం చేసే అవకాశాలను పరిశీలించాలని అన్నారు.