యజమానిపై తుపాకీతో కాల్పులు జరుపుతున్న నిందితుడు
లక్నో : ఉత్తరప్రదేశ్, సుల్తాన్‌పూర్‌లోని ఓ రెస్టారెంట్‌లో చోటుచేసుకున్న కాల్పుల ఘటన థ్రిల్లర్ సినిమాను తలిపించింది. ఫుడ్ పార్సిల్ నేపథ్యంలో వెయిటర్‌తో చోటుచేసుకున్న గొడవ యజమాని హత్యాయత్నానికి దారి తీసింది. రోజులానే అవంతికా రెస్టారెంట్ ఆదివారం జనాలతో సందడిగా ఉంది. హోటల్ క్యాష్ కౌంటర్ వైపు సాదా సీదాగా నడుచుకుంటు వచ్చిన ఓ వ్యక్తి తుపాకీతో యజమాని అలోక్ ఆర్యాపై కాల్పులు జరిపాడు. డ్రామాను తలపించిన ఈ ఘటనతో అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారు. ఈ తతంగం అంతా అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
ఈ వీడియోలో తెల్లని షర్ట్, బ్లూ ప్యాంట్ వేసుకున్న ఓ వ్యక్తి కౌంటర్ వైపు నడుచుకుంటూ వస్తున్నాడు. ఆ కౌంటర్ ముందు టేబుల్ మీద ఓ ఫ్యామిలీ డిన్నర్ చేస్తోంది. అయితే ఆ వ్యక్తి చడి చప్పుడు లేకుండా మూడు రౌండ్ల కాల్పులు జరిపి మెళ్లిగా జారకున్నాడు. వెంటనే తేరుకున్న హోటల్ సిబ్బంది అలోక్ ఆర్యాను సమీప ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారమిచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. అతనో ప్రయివేట్ కాంట్రాక్టర్ అని, పార్సిల్ విషయంలో వెయిటర్‌తో అతను గొడవపెట్టుకోగా .. యజమాని ఆర్యా జోక్యం చేసుకుని అతన్ని శాంతింపచేసే ప్రయత్నం చేశాడని తెలిపారు. అయితే నిందితుడు మళ్లి తన ఇద్దరి స్నేహితులతో రెస్టారెంట్‌కు వెళ్లి కాల్పులకు తెగబడ్డాడని పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment