నన్ను కొట్టినవాడా ... నీకు నమస్కారం | Kejri forgives his attacker | Sakshi
Sakshi News home page

నన్ను కొట్టినవాడా ... నీకు నమస్కారం

Published Wed, Apr 9 2014 12:40 PM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM

నన్ను కొట్టినవాడా ... నీకు నమస్కారం - Sakshi

నన్ను కొట్టినవాడా ... నీకు నమస్కారం

పట్టుదలకు అరవింద్ కేజరీవాల్ మారుపేరు. నెత్తిన పెట్టుకున్న ఢిల్లీ ఓటరు చెంప వాచేలా కొడుతున్నా అరవింద్ కేజరీవాల్ పట్టుదల మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు.


మంగళవారం ఆయన్ని ఢిల్లీలోని సుల్తాన్ పురిలో ప్రచారం చేస్తూండగా ఒక ఆటోరిక్షా డ్రైవర్ చాచిపెట్టి చెంపమీద కొట్టాడు. కేజరీవాల్ తీరుకు వ్యతిరేకంగా లాలీ అనే ఈ ఆటోరిక్షా డ్రైవర్ ఈ చర్యకు తెగబడ్డాడు. ఆటో రిక్షా డ్రైవర్లకు కేజరీవాల్ అన్యాయం చేశారని ఆయన ఆరోపించాడు.


ఈ దెబ్బకి కేజరీవాల్ కన్ను వాచిపోయింది. ఆయన్ని వెంటనే ఆస్పత్రికి తరలించవలసి వస్తుంది. ఇంత జరిగినా అరవింద్ కేజరీవాల్ పట్టుదల మాత్రం తగ్గలేదు. ఆయన 'నన్ను కొట్టిన వారిని నేను క్షమిస్తున్నాను. నన్ను కొట్టిన వారికి నమస్కారం. మీకు కావలసినంతగా నన్ను కొట్టుకొండి. నా కార్యకర్తలకు మాత్రం నేను చెప్పేది ఒక్కటే. నన్ను కొట్టిన వారిని తిరిగి కొట్టకండి.' అన్నారు కేజరీవాల్. అంతే కాదు... బుధవారం లాలీని కలుసుకునేందుకు ఆయన ప్రయత్నాలు కూడా చేస్తున్నారు.


అరవింద్ కేజరీవాల్ కి పూలే కాదు. ముళ్లు కూడా దక్కుతున్నాయి. ఇప్పటికే గత కొన్ని వారాల్లో ఆయనపై పలు సార్లు దాడులు జరిగాయి. ఆయనపై గుడ్లు, ఇంకు, మోబిల్ ఆయిల్ వంటివి కూడ పోయడం జరిగింది. అయితే ఇవేవీ కేజరీవాల్ పట్టుదలను పెంచాయే తప్ప తగ్గించలేకపోయాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement