దూరదర్శన్ ఎంపీ అభ్యర్థుల ముఖాముఖీ కార్యక్రమాన్ని నిర్వహిస్తూండగా హఠాత్తుగా ఒక వ్యక్తి తనకు తాను నిప్పంటించుకుని, బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థిని గట్టిగా వాటేసుకున్నాడు.
నిప్పుల కౌగిలిలో బిఎస్ పీ అభ్యర్థి, పరిస్థితి విషమం
Published Tue, Apr 29 2014 11:35 AM | Last Updated on Tue, Aug 14 2018 4:24 PM
దూరదర్శన్ ఎంపీ అభ్యర్థుల ముఖాముఖీ కార్యక్రమాన్ని నిర్వహిస్తూండగా హఠాత్తుగా ఒక వ్యక్తి తనకు తాను నిప్పంటించుకుని, బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థిని గట్టిగా వాటేసుకున్నాడు. ఈ సంఘటన సోమవారం రాత్రి ఉత్తరప్రదేశ్ లోని సుల్తాన్ పూర్ లో జరిగింది.
దూరదర్శన్ జనమత్ 2014 కార్యక్రమాన్ని నిర్వహిస్తూండగా ఉన్నట్టుండి కిరోసిన్ తో నిండా తడిసిన ఒక వ్యక్తి దూసుకువచ్చాడు. అందరూ చూస్తూండగానే తనకు తాను నిప్పంటించుకున్నాడు. ఆ తరువాత పరుగులు తీస్తూ వచ్చి బిఎస్ పీ అభ్యర్థి కమరుజ్జమా ఫౌజీని వాటేసుకున్నాడు. ఇద్దరినీ విడదీసి ఆస్పత్రికి తరలించారు. అయితే ఆ యువకుడికి 95 శాతం, కమరుజ్జమాకి 75 శాతం కాలిన గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితీ విషమంగా ఉందని వైద్యులు చెప్పారు.
వీరిద్దరిని కాపాడేందుకు ప్రయత్నించిన మరో ఇద్దరు వ్యక్తులకు కూడా కాలిన గాయలు అయ్యాయి. ఆ యువకుడెవరు, ఎందుకిలా చేశాడన్నది ఇంకా తెలియరాలేదు. మొత్తం మీద ఈ సంఘటన సంచలనం సృష్టించింది.
Advertisement
Advertisement