self-immolation
-
ప్రాణం తీసిన రెండున్నర రూపాయల సమోస
ఇండోర్: ‘గోటితో పోయి దాన్ని గొడ్డలి వరకు తెచ్చుకున్నారు’.. అనే సామెత వినే ఉంటారు. చిన్న సమస్యను పెద్దదిగా చేసి చివరికి ఊహించని నష్టం జరిగిన సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు. అచ్చం ఈ సామెతలాగానే ఓ వ్యక్తి చిన్న విషయంలో ఏర్పడిన గొడవలో పోలీసులు, షాప్ యాజమాని వేధింపుల కారణంగా తన ప్రాణాలనే బలితీసుకున్నాడు. ఇంతకీ అతనికి వాగ్వాదం ఏర్పడింది ఓ రెండున్నర రూపాయల సమోస ధర విషయంలో.. అవును ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని అనుప్పూర్‌లో చోటుచేసుకుంది. జూలై 24న జరిగిన ఈ ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. అమర్కాంటక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బంధ గ్రామంలో బజ్రు జైవాల్ అనే వ్యక్తి స్నేహితులతో కలిసి జూలై 22వ తేదీన ఓ సమోసా స్టాల్ వద్దకు వెళ్లాడు. అక్కడ రెండు సమోసాలను తిన్నాడు. షాప్ మహిళా యాజమాని అయిన కంచన్ సాహు.. అతడిని రెండు సమోసాలకు 20 రూపాయలు అడిగింది. అయితే ఒక్కో సమోసా ఇంతకుముందు కేవలం రూ.7.50 ఉండేదని, ఇప్పుడు ఎందుకు రూ.20 ఇవ్వాలని ఆమెను జైవాల్ ప్రశ్నించాడు. సరుకుల ధరలు పెరగడంతో సమోస ధర పెంచినట్లు యజమాని బదులిచ్చింది. అయితే ఈ విషయంలో ఆమెకు అతడికి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో ఓనర్ పోలీసులను సంప్రదించింది. పోలీసులు కస్టమర్ జైవాల్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారించారు. అయితే సమోసా స్టాల్ యాజమాని, పోలీసులు తనను వేధిస్తున్నారని ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పటించుకున్నాడు జైవాల్. తీవ్ర గాయాలపాలైన బాధితుడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ జూలై 24వ తేదీన మృతి చెందాడు. కాగా షాప్ యాజమానియే తనపై నిప్పంటించిందని పోలీసులు దాడి చేశారని జైవాల్ చనిపోయేముందు తీసుకున్న వీడియోలో ఆరోపించాడు. జైవాల్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. Madhya Pradesh | Dispute over price of Samosa leads to death of a man in Anuppur Probe ordered into the matter. Eyewitness has claimed that Bajru Jaiswal had allegedly poured petrol on him & set himself afire. He was referred to hospital where he died: Ashish Bharande, SDOP pic.twitter.com/hSJz82hHXx — ANI (@ANI) July 27, 2021 -
మరింత ఉధృతం
సాక్షి, చెన్నై : కావేరి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడానికి డీఎంకే నిర్ణయించింది. ఈ విషయంగా చర్చించేందుకు ప్రతిపక్షాలను ఆహ్వానిస్తూ మళ్లీ అఖిల పక్షం సమావేశానికి స్టాలిన్ నిర్ణయించారు. ఈనెల 16న జరిగే సమావేశం మేరకు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇక, కావేరి కోసం ఆత్మాహుతియత్నం చేసిన ఎండీఎంకే నేత వైగో బంధువు శర్వణ సురేష్ మరణించాడు.కావేరి అభివృద్ధి మండలి, పర్యవేక్షణ కమిటీ సాధన లక్ష్యంగా రాష్ట్రంలో పలు రూపాల్లో ఆందోళనలు సాగినా కేంద్రం నుంచి స్పందన కరువే. రాష్ట్ర ప్రభుత్వం సైతం మమా అనిపించే చర్యలతో ముందుకు సాగుతోంది. దీంతో తమ పోరును మరింత ఉధృతం చేయడానికి ప్రతిపక్షాలు సిద్ధం అవుతున్నాయి. ఇందుకోసం మరోమారు అఖిల పక్షం సమావేశానికి డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ శనివారం పిలుపునిచ్చారు. 16వ తేదీ సాయంత్రం అన్నా అరివాలయం వేదికగా ఈ సమావేశం సాగనుంది. ఈ విషయంగా స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ, అఖిల పక్షం సమావేశంలో పోరు మరింత ఉధృతం లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నామన్నారు. అలాగే, 16వ తేదీ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం వ్యవహారంలో కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ వళ్లువర్‌కోట్టంలో ప్రతిపక్షాల నేతృత్వంలో భారీ నిరసన కార్యక్రమానికి నిర్ణయించామన్నారు. కావేరి వ్యవహారంలో కేంద్రం చర్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, పోరు ఎంత ఉధృతం చేయడానికైనా తాను సిద్ధమేనని హెచ్చరించారు. అన్నింటా కాషాయం రంగును పులిమే రీతిలో కేంద్రం అడుగులు సాగుతున్నాయని ధ్వజమెత్తారు. కాగా, తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ చిత్తిరై ఒకటో తేదీన తమిళ కొత్త సంవత్సరం అని ప్రకటించడం శోచనీయమని విమర్శించారు. తై ఒకటో తేదీ తమిళ కొత్త సంవత్సరంగా అసెంబ్లీలో సైతం కరుణానిధి తీర్మానం తీసుకొచ్చారని గుర్తుచేశారు. ఇక, 16వ తేదీ తమిళ మానిల కాంగ్రెస్ సైతం కావేరి సాధన నినాదంతో భారీ ఆందోళన కార్యక్రమాల్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించేందుకు నిర్ణయించింది. ఇక, కావేరి వ్యవహారంలో తమిళనాడుకు తీవ్ర అన్యాయం జరిగేందుకు డీఎంకే, కాంగ్రెస్‌లే కారణం అని డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం ఆగ్రహం వ్యక్తంచేశారు. అప్పట్లో ఈ రెండు పార్టీలు కలిసి ఆడిన నాటకాల కారణంగా, ఇప్పుడు రైతన్నలు కావేరి కోసం అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. తమ ప్రభుత్వం అన్ని రకాలుగా కేంద్రం మీద ఒత్తిడి తెస్తూనే ఉందని, తీర్పు అనుకూలంగానే ఉంటుందన్న ఆశాభావం వ్యక్తంచేశారు. శర్వణ సురేష్ మృతి కావేరి సాధన నినాదంతో ఎండీఎంకే నేత వైగో బంధువు శర్వణసురేష్(55) శుక్రవారం విరుదునగర్‌లో ఆత్మాహుతి యత్నం చేసిన విషయం తెలిసిందే. తీవ్రంగా గాయపడ్డ సురేష్‌ను తొలుత విరుదునగర్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం మదురైకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం సురేష్ మరణించాడు. ఈ సమాచారంతో వైగో తీవ్ర మనోవేదనకు గురయ్యారు. సురేష్ మృతదేహం వద్ద బోరున విలపించారు. ఇక, మీదట ఎవరూ ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని వేడుకున్నారు. కాగా, డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం పేర్కొంటూ, కావేరి కోసం ఆత్మహత్యలు, ఆత్మాహుతుల జోలికి దయ చేసి వెళ్ల వద్దని వేడుకున్నారు. ఇప్పటివరకు మరణించిన వారి కుటుంబాల్ని ఆదుకునేందుకు ప్రభుత్వం పరిశీలన చేస్తోందని, త్వరలో మంచి ప్రకటన చేస్తామన్నారు. -
బలిదానం!
విఘ్నేష్ ఆత్మాహతితో పరిస్థితి ఉద్రిక్తం శోకసంద్రంలో కుటుంబం నేడు అంత్యక్రియలు తిరువారూర్‌లో భద్రత కట్టుదిట్టం సాక్షి, చెన్నై: కావేరి జలాల వివాదం నేపథ్యంలో విఘ్నేష్ ఆత్మాహుతికి పా ల్పడడం తమిళనాడులో ఉద్రిక్తతకు కారమవుతోంది. ఈ సంఘటన ఈ ప్రాంతంలో తీవ్ర అలజడి రేపింది. తమిళులకు భాషాభిమానం ఎక్కువే. ప్రపంచ దే శాల్లో ఎక్కడైనా తమిళుడికి చిన్న హాని జరిగినా, తమిళనాట నిరసనలు భగ్గుమంటాయి. శ్రీలంకలో యుద్ధం సమయంలో తమిళులపై సాగిన నరమేథం ఇక్కడి హృదయాల్ని పిండేశాయి. నిరసనల హోరు ఓ వైపు అప్పట్లో సాగితే, ముత్తుకుమార్ ఆత్మాహుతి బలిదానం కలకలాన్ని రేపాయి. తదుపరి పదుల సంఖ్యలో ఆ బాటను అనుసరించిన తమిళాభిమానులు ఎక్కువే. ఈ పరిస్థితుల్లో కర్ణాటకలో జల వివాదం రేపిన చిచ్చు తమిళులపై ప్రతాపానికి దారి తీయడం, ఇక్కడి వర్గాల్లో ఆక్రోశాన్ని రగిల్చాయి. కర్ణాటక చర్యల్ని ఎండగడుతూ తమిళాభిమానులు, రాజ కీయ పక్షాలు కదిలాయి. ఈ నిరసనల్లో ఎవరైనా ఆత్మాహుతి, ఆత్మహత్యాయత్నాలు వంటి అఘాయిత్యాలకు పాల్పడుతారేమోనన్న బెంగ సర్వత్రా వెంటాడుతూ వచ్చింది. ఆ ప్రయత్నాల జోళికి ఎవ్వరూ వెళ్లకూడదని ప్రార్థించారు. , అది పునరావృతం అయినట్టుగా గురువారం నామ్ తమిళర్ కట్చి ర్యాలీలో ఘటన చోటు చేసుకుంది. అమరుడు.. నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్, సీని దర్శకులు అమీర్, చేరన్ల నేతృత్వంలో గురువారం సాయంత్రం చెన్నైలో కావేరి జలాల కోసం గళం విప్పుతూ సాగిన భారీ ర్యాలీలో విఘ్నేష్ అనే యువకుడు కావేరి కోసం తనను తాను ఆర్పించుకుని ఆహుతి కావడం కలకలాన్ని రేపింది. తీవ్రగాయాలతో చెన్నై కీల్పాకం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విఘ్నేష్ శుక్రవారం ఉదయం పద కొండున్నర సమయంలో విగత జీవిగా మారడం నామ్ తమిళర్ కట్చి వర్గాల్ని, అతడి కుటుంబీకుల్ని శోక సంద్రంలో ముంచింది. విఘ్నేష్ ఇక లేడన్న సమాచారంతో, ఇలాంటి ప్రయత్నాలు ఎవ్వరూ చేయవద్దంటూ రాజకీయ పక్షాలు తమిళాభిమానులకు విజ్ఞప్తి చేసే పనిలో పడ్డాయి. అలాగే, రెచ్చగొట్టే వ్యాఖ్యల్ని చేయవద్దని నాయకులకు ప్రజా సంఘాలు విన్నవించే పనిలో పడ్డాయి. విఘ్నేష్ తనకు సోదరుడు లాంటి వాడు అని, అతడు బతికి ఉంటే, కుటుంబానికి ఏమి చేసి ఉంటా డో అదే తాను చేస్తానని ఈసందర్భంగా సీమాన్ వ్యాఖ్యానించారు. విఘ్నేష్ భౌతిక కాయం వద్ద సీమాన్ కన్నీళ్ల పర్యంతం అయ్యారు. వీసీకే నేత తిరుమావళవన్ అక్కడికి చేరుకుని నివాళులర్పించారు. ప్రజా సంఘాలు, తమిళాభిమాన సంఘాల నాయకులు తరలి రా వడంతో కీల్పాకం ఆసుపత్రి ఆవరణలో ఉత్కంఠ నెలకొంది. దీంతో పెద్ద ఎత్తున బలగాల్ని అక్కడ మోహరింప చేశారు. నేడు అంత్యక్రియలు.. తిరువారూర్ జిల్లా మన్నార్ కుడి సమీపంలోని గోపాల సముద్రం గ్రామానికి చెందిన పాండియన్, షెన్బగలక్ష్మి దంపతుల కుమారుడు విఘ్నేష్. అతడి జనని సోదరి ఉన్నారు. నామ్ తమిళర్ కట్చి తిరువారూర్ ఉత్తరం జిల్లా విద్యార్ధి విభాగం కార్యదర్శిగా వ్యవహరిస్తూ, చెన్నై అంబత్తూరులోని ఓ సంస్థలో పని చేస్తున్నాడు. సీమాన్ మీద గౌరవం, తమిళాభిమానం నాలుగు రాళ్లు తనకు ఎక్కువే అన్నట్టుగా వ్యవహరించే విఘే్న ష బుధవారం తన ఫెస్‌బుక్‌లో ఈ ఆత్మాహుతి గురించి ముందుగానే ప్రకటించి ఉన్నా డు. గురువారం జరిగే ర్యాలీలో కావేరి కోసం ఆత్మాహుతులతో ముందుకు సాగుదామన్న అతడు పిలుపు ఇచ్చి ఉండటం వెలుగులోకి వచ్చింది. విద్యార్థులకు పిలుపు నిస్తూ ఓ లేఖను సందించి ఉండటంతో , ఇక , మరో బలిదానం అన్నది రాష్ట్రంలో జరగకూడదన్న అప్రమత్తత పెరిగి ఉన్నది. కాగా, విఘ్నేష్ భౌతిక కాయానికి శని వారం గోపాల సముద్రంలో అంత్యక్రియలు జరగనున్నాయి. పోస్టుమార్టం అనంతరం మృత దేహాన్ని చెన్నై నుంచి స్వగ్రామానికి తరలించారు. పెద్ద సంఖ్యలో అంత్యక్రియలకు తమిళాభిమానులు తరలివచ్చే అవకాశంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. తిరువారూర్ జిల్లాలో భద్రతను కట్టుదిట్టం చేశారు. -
యూపీ సీఎం ఆఫీస్ ఎదుట ఓవ్యక్తి ఆత్మహత్యాయత్నం!
లక్నో: తన భూమిని కబ్జా చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును పట్టించుకోకపోవడంతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కార్యాలయం ముందు ఆత్మాహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకుడిని పోలీసులు అడ్డుకుని.. ఆతర్వాత అరెస్ట్ చేశారు. తన భూమిని కొందరు కబ్జాదారులు అక్రమించారని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకుని అలీఘడ్ కు చెందిన కపిల్ మిట్లల్ ఆత్మాహత్యకు ప్రయత్నించారు. ముఖ్యమంత్రిని కలిసి తన బాధల్ని చెప్పుకోవాలని చూశాను. అయితే తన ప్రయత్నాలు ఫలించకపోవడంతోనే తాను ఆత్మహత్యకు ప్రయత్నించానని బాధితుడు తెలిపారు. ఈ ఘటనలో కపిల్ పై పోలీసులు కేసు నమోదు చేసి... హజ్రత్ గంజ్ పోలీస్ స్టేషన్ తరలించారు. -
కాలుతూ కాలుతూ బిఎస్ పీ నేతను వాటేసుకున్నయువకుడు
దూరదర్శన్ ఎంపీ అభ్యర్థుల ముఖాముఖీ కార్యక్రమాన్ని నిర్వహిస్తూండగా హఠాత్తుగా ఒక వ్యక్తి తనకు తాను నిప్పంటించుకుని, బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థిని గట్టిగా వాటేసుకున్నాడు. ఈ సంఘటన సోమవారం రాత్రి ఉత్తరప్రదేశ్ లోని సుల్తాన్ పూర్ లో జరిగింది. దూరదర్శన్ జనమత్ 2014 కార్యక్రమాన్ని నిర్వహిస్తూండగా ఉన్నట్టుండి కిరోసిన్ తో నిండా తడిసిన ఒక వ్యక్తి దూసుకువచ్చాడు. అందరూ చూస్తూండగానే తనకు తాను నిప్పంటించుకున్నాడు. ఆ తరువాత పరుగులు తీస్తూ వచ్చి బిఎస్ పీ అభ్యర్థి కమరుజ్జమా ఫౌజీని వాటేసుకున్నాడు. ఇద్దరినీ విడదీసి ఆస్పత్రికి తరలించారు. అయితే ఆ యువకుడికి 95 శాతం, కమరుజ్జమాకి 75 శాతం కాలిన గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితీ విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. వీరిద్దరిని కాపాడేందుకు ప్రయత్నించిన మరో ఇద్దరు వ్యక్తులకు కూడా కాలిన గాయలు అయ్యాయి. ఆ యువకుడెవరు, ఎందుకిలా చేశాడన్నది ఇంకా తెలియరాలేదు. మొత్తం మీద ఈ సంఘటన సంచలనం సృష్టించింది. -
పార్లమెంట్ ఎదుట ఓ వ్యక్తి ఆత్మాహుతికి యత్నం!
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఎదుట ఓ వ్యక్తి ఆత్మహుతికి ప్రయత్నించిన సంఘటన సంచలనం రేపింది. సరిహద్దు రక్షణ దళాల( బీఎస్ఎఫ్) అధికారుల తీరును నిరసిస్తూ ఓ మాజీ బీఎస్ఎఫ్ జవాన్ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహుతి చేసుకునేందుకు ప్రయత్నించాడు. ఆత్మహుతికి పాల్పడిన వ్యక్తిని అశోక్ కుమార్ గా గుర్తించారు. మతి స్థిమితం లేని కారణంగా 2000 సంవత్సరంలో విధుల నుంచి అశోక్ కుమార్ ను తొలగించినట్టు పోలీసులు తెలిపారు. పోలీసు కథనం ప్రకారం శుక్రవారం ఉదయం ముగ్గురు పిల్లు, భార్యతో కలసి విజయ్ చౌక్ చేరుకుని, కిరోసిన్ ను ఒంటిపై పోసుకొని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించగా రక్షణ దళ అధికారులు అడ్డుకున్నారని పోలీసులు తెలిపారు. అశోక్ కుమార్ ను అదుపులోకి తీసుకుని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లిన తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తనకు సహాయం అందించాలని హోంమంత్రి కార్యాలయ అధికారులను, ఇతర సీనియర్ అధికారులను కలసినా ప్రయోజనం లేకపోండంతో మనస్తాపం చెందిన ఆయన ఆత్మాహుతికి పాల్పడ్డారని పోలీస్ అధికారి తెలిపారు. -
ఆత్మాహుతి వ్యాఖ్యలతో లోక్‌సభలో అప్రమత్తత
న్యూఢిల్లీ : సభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెడితే ఆత్మాహుతి చేసుకుంటానని ఎంపీ సబ్బం హరి వ్యాఖ్యలపై లోక్ సభలో విచారణ జరిగింది. దాంతో స్పీకర్ మీరాకుమార్ ముందు జాగ్రత్త చర్యగా లోక్ సభ సిబ్బందిని అప్రమత్తం చేశారు. తెలంగాణ బిల్లును సభలో ప్రవేశపెడితే.. వెల్ లోకి వెళ్లి ఆత్మాహుతి చేసుకుంటాను అని సబ్బం హరి నిన్న వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు తనతోపాటు మరో ఇద్దరు సభ్యులు కూడా ఆత్మాహుతి చేసుకోవడానికి సిద్దంగా ఉన్నారన్నారు. -
'బిల్లు పెడితే సభలోనే ఆత్మాహుతి చేసుకుంటా'
రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అనకాపల్లి ఎంపీ సబ్బం హరి సంచలన వ్యాఖ్యలు చేశారు. లోకసభలో ప్రభుత్వం తెలంగాణ బిల్లు ప్రవేశపెడితే ఆత్మాహుతి చేసుకుంటానని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెలంగాణ బిల్లును సభలో ప్రవేశపెడితే.. వెల్ లోకి వెళ్లి ఆత్మాహుతి చేసుకుంటాను అని సబ్బం హరి అన్నారు. రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు తనతోపాటు మరో ఇద్దరు సభ్యులు కూడా ఆత్మాహుతి చేసుకోవడానికి సిద్దంగా ఉన్నారు. ఆంధ్ర ప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు 2013 కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపిన నేపథ్యంలో సబ్బం హరి ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బిల్లుపై కాంగ్రెస్ తో సహ అన్ని పార్టీల విబేధాలు నెలకొన్నందున పార్లమెంట్ లో ఎప్పుడూ లేనంతగా గందరగోళం ఏర్పడింది. -
కొల్‌కత్తలో మరో నిర్భయ మృతి
-
అత్యాచారానికి గురై.. బాలిక ఆత్మార్పణ
సామూహిక అత్యాచారం చేయడమే కాక.. ఆ తర్వాత కూడా విపరీతంగా బెదిరించడంతో పశ్చిమబెంగాల్లో ఓ బాలిక (16) బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. డిసెంబర్ 23వ తేదీన ఆమె కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోవడంతో ఆస్పత్రికి తరలించారు. కానీ, తీవ్ర గాయాలతో ఆమె మరణించినట్లు ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. అయితే అటు రాష్ట్ర ప్రభుత్వం గానీ, ఇటు ఆస్పత్రి సిబ్బంది గానీ తమ కుమార్తెను ఏమాత్రం పట్టించుకోలేదని బాధితురాలి తండ్రి ఆరోపిస్తున్నారు. సామూహిక అత్యాచారం చేసిన వారికి మరణశిక్ష విధించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆస్పత్రి సిబ్బంది అసలు తమ కుమార్తెకు సరిగా చికిత్సే అందించలేదని, ప్రభుత్వం తరఫు నుంచి కనీసం ఒక్కరు కూడా వచ్చి పలకరించిన పాపాన పోలేదని ఆయన వాపోయారు. తన కుమార్తె చనిపోయినా.. తాను మాత్రం ఆ దుండగులను ఉరి తీసేవరకు పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు. ఆ అమ్మాయి చనిపోలేదని, ఆస్పత్రి సిబ్బంది, ప్రభుత్వమే ఆమెను చంపేశారని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు శ్యాంలాల్ చక్రవర్తి ఆరోపించారు. తరచు ఆమెను వాళ్లు వేధింపులకు గురిచేస్తున్నా.. ప్రభుత్వం ఇంతవరకు చర్యలు ఎందుకు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. బీహార్‌కు చెందిన ఈ కుటుంబం పొట్టకూటి కోసం పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లాకు వలస వచ్చింది.