ఆత్మాహుతి వ్యాఖ్యలతో లోక్సభలో అప్రమత్తత
న్యూఢిల్లీ : సభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెడితే ఆత్మాహుతి చేసుకుంటానని ఎంపీ సబ్బం హరి వ్యాఖ్యలపై లోక్ సభలో విచారణ జరిగింది. దాంతో స్పీకర్ మీరాకుమార్ ముందు జాగ్రత్త చర్యగా లోక్ సభ సిబ్బందిని అప్రమత్తం చేశారు. తెలంగాణ బిల్లును సభలో ప్రవేశపెడితే.. వెల్ లోకి వెళ్లి ఆత్మాహుతి చేసుకుంటాను అని సబ్బం హరి నిన్న వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు తనతోపాటు మరో ఇద్దరు సభ్యులు కూడా ఆత్మాహుతి చేసుకోవడానికి సిద్దంగా ఉన్నారన్నారు.