'బిల్లు పెడితే సభలోనే ఆత్మాహుతి చేసుకుంటా'
రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అనకాపల్లి ఎంపీ సబ్బం హరి సంచలన వ్యాఖ్యలు చేశారు. లోకసభలో ప్రభుత్వం తెలంగాణ బిల్లు ప్రవేశపెడితే ఆత్మాహుతి చేసుకుంటానని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెలంగాణ బిల్లును సభలో ప్రవేశపెడితే.. వెల్ లోకి వెళ్లి ఆత్మాహుతి చేసుకుంటాను అని సబ్బం హరి అన్నారు. రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు తనతోపాటు మరో ఇద్దరు సభ్యులు కూడా ఆత్మాహుతి చేసుకోవడానికి సిద్దంగా ఉన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు 2013 కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపిన నేపథ్యంలో సబ్బం హరి ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బిల్లుపై కాంగ్రెస్ తో సహ అన్ని పార్టీల విబేధాలు నెలకొన్నందున పార్లమెంట్ లో ఎప్పుడూ లేనంతగా గందరగోళం ఏర్పడింది.