పన్ను వేధింపులపై ప్రజా ఉద్యమం
Published Fri, Mar 10 2017 11:34 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
మధురపూడి (రాజానగరం) :
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై పన్ను ల భారం మోపి వేధిస్తున్నదని పీసీసీ అధ్యక్షుడు ఎ¯ŒS.రఘువీరారెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన ప్రజావేదన సదస్సు నిమిత్తం జిల్లా పర్యటనకు వచ్చారు. రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టులో విలేకర్లతో మాట్లాడారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విడచి, పన్నుల భారం మోపుతున్నదని విమర్శించారు. కరువు, ఆర్థిక భారంతో ప్ర జలు ఇబ్బంది పడుతున్నారని, రై తులు, కూలీలు, అర్ధాకలితో అలమటిస్తున్నారని తెలిపారు. ప్రజల కష్టాలను తీర్చకుండా తీవ్రంగా బాధిస్తోందన్నారు. ప్రజల సమస్యలు, వేదనలను తెలుసుకోవడానికి రాష్ట్రం లోని అన్ని నియోజకవర్గాల్లో ఈ సదస్సులను నిర్వహిస్తున్నామన్నారు.దానిలో భాగం గా ఏజెన్సీ ప్రాంతంలోని రంపచోడవరం, మారేడుమిల్లి, చింతూరు ప్రాం తాల్లో సదస్సులను నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. దీనికి స్థానిక నాయకులు, కార్యకర్తలను సన్నద్దం చేయనున్నట్టు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆయన నిప్పులు చెరిగారు. ఓవైపు ఆర్థిక పరమైన సమస్యలతో, మరో వైపు అధిక ధరలతో ఇబ్బంది పడుతున్న ప్రజలపై భారంమోపడాన్ని ఆయన దుయ్యబట్టారు. మాజీమంత్రి ఎంఎం పళ్లం రాజు, మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు, నాయకులు పం తం నానాజీ, అంకం గోపి. ఐఎ¯ŒSటీయూసీ అ«ధ్యక్షుడు శ్రీని వాసరావు రఘువీరారెడ్డికి స్వాగతం పలికారు.
Advertisement
Advertisement