యూపీ సీఎం ఆఫీస్ ఎదుట ఓవ్యక్తి ఆత్మహత్యాయత్నం!
లక్నో: తన భూమిని కబ్జా చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును పట్టించుకోకపోవడంతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కార్యాలయం ముందు ఆత్మాహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకుడిని పోలీసులు అడ్డుకుని.. ఆతర్వాత అరెస్ట్ చేశారు.
తన భూమిని కొందరు కబ్జాదారులు అక్రమించారని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకుని అలీఘడ్ కు చెందిన కపిల్ మిట్లల్ ఆత్మాహత్యకు ప్రయత్నించారు.
ముఖ్యమంత్రిని కలిసి తన బాధల్ని చెప్పుకోవాలని చూశాను. అయితే తన ప్రయత్నాలు ఫలించకపోవడంతోనే తాను ఆత్మహత్యకు ప్రయత్నించానని బాధితుడు తెలిపారు. ఈ ఘటనలో కపిల్ పై పోలీసులు కేసు నమోదు చేసి... హజ్రత్ గంజ్ పోలీస్ స్టేషన్ తరలించారు.