కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేడు ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్ కోర్టుకు హాజరయ్యారు. కేంద్రమంత్రి అమిత్‌షాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపిస్తూ బీజేపీ నేత విజయ్ మిశ్రా దాఖలు చేసిన పరువు నష్టం కేసుకు సంబంధించిన విచారణ నేపథ్యంలో ఆయన నేడు కోర్టుకు వచ్చారు.
ఈ సందర్భంగా రాహుల్ తరపు న్యాయవాది కాశీ ప్రసాద్ శుక్లా మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవమని, రాజకీయ దురుద్దేశంతో, తన ప్రతిష్టను దెబ్బతిసేందుకు ఈ కేసు నమోదు చేశారని తెలిపారు. కోర్టు అడిగిన ప్రశ్నలకు రాహుల్ తన స్టేట్‌మెంట్ రికార్డు చేసినట్లు పేర్కొన్నారు. వాదనల అనంతరం కోర్టు తదుపరి విచారణను ఆగస్టు 12కు వాయిదా వేసింది. ఆగస్టు 12న రాహుల్ మరోసారికి కోర్టుకు హాజరై సాక్ష్యాలను సమర్పించనున్నారు.
#WATCH | Sultanpur, Uttar Pradesh: Advocate Kashi Prasad Shukla, Lok Sabha LoP and Congress MP Rahul Gandhi's lawyer says, "...Rahul Gandhi recorded his statement in the court and said that all the allegations are false and the complaint has been filed due to political… pic.twitter.com/ne8YUWvI3O
— ANI (@ANI) July 26, 2024
కాగా 2018 కర్ణాటక ఎన్నికల సమయంలో బెంగళూరులో జరిగిన ర్యాలీలో రాహుల్ పాల్గొని కేంద్రమంత్రి అమిత్‌షాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ.. అప్పటి సుల్తాన్‌పూర్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడిగా ఉన్న విజయ్ మిశ్రా అదే ఏడాది ఆగస్టు 4 జిల్లా కోర్టులో రాహుల్ పై పరువు నష్టం కేసు నమోదు చేశారు. ఓ హత్య కేసులో అమిత్ షా నిందితుడు అని రాహుల్ వ్యాఖ్యానించినట్లు విజయ్ మిశ్రా ఆరోపించారు.
రాహుల్ ఆ ర్యాలీలో..‘బీజేపీ అధ్యక్షుడు ఓ హత్యకేసులో నిందితుడనే విషయాన్ని దేశంలోని ప్రజలు మర్చిపోతున్నారు. అదే నిజం. నిజాయితీ, మర్యాద, గురించి మాట్లాడే పార్టీకి.. హత్య ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి అధ్యక్షుడిగా ఉన్నారు. అమిత్ షాపై హత్యా ఆరోపణలు వచ్చాయి, కాదా? సుప్రీంకోర్టు జడ్జి లోయా కేసును ప్రస్తావించింది. కాబట్టి అమిత్ షాకు పెద్దగా క్రెడిబిలిటీ లేదు. ఆయన హత్య నిందితుడని మర్చిపోవద్దు. ”అని రాహుల్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment