నిర్లక్ష్యం: కన్నుతెరవకుండానే కన్నుమూశాడు | New Born Baby Dies with Doctor Negligence in Sultanpur UP | Sakshi
Sakshi News home page

Published Thu, May 31 2018 2:15 PM | Last Updated on Wed, Oct 17 2018 3:53 PM

New Born Baby Dies with Doctor Negligence in Sultanpur UP  - Sakshi

మృత శిశువు.. పక్కన తల్లి.. ఆమె బంధువు

లక్నో: వైద్యుడి నిర్లక్ష్యం ఆ పసికందు పాలిట శాపమైంది. ఆ తల్లికి తీరని శోకాన్ని మిగిల్చింది. ఉత్తర ప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌ దారుణం చోటు చేసుకుంది. 26 సంవత్సరాల రేష్మీకి పురిటినొప్పులు రావటంతో సుల్తాన్‌పూర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. మగబిడ్డను ప్రసవించటంతో ఆ కుటుంబంలో సంతోషం నెలకొంది. అయితే కాన్ఫు చేసిన వైద్యుడు బొడ్డు తాడును కత్తిరించే క్రమంలో నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. ఆ పసిగుడ్డు పీకను కొసేశాడు. కళ్లు తెరకుండానే ఆ పసికందు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అటుపై మృత శిశువు జన్మించిందని కుటుంబ సభ్యులను నమ్మించే యత్నం చేశాడు. అయితే గొంతుపై కత్తి గాటు గమనించిన బంధువులు వైద్యుడిని నిలదీయటంతో  అసలు విషయం చెప్పి క్షమాపణలు కోరాడు. ఆగ్రహించిన కుటుంబ సభ్యులు అతనిపై దాడి చేసి పోలీసులకు అప్పగించారు. వైద్యుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement