Throat Slits
-
పెళ్లయిన మూడో రోజే గొంతు కోసుకొని నవ వరుడి ఆత్మహత్య
వైరా రూరల్: కోటి ఆశలతో పెళ్లి చేసుకున్నాడు.. వైవాహిక జీవితాన్ని ప్రారంభించేందుకు సిద్ధమయ్యాడు. ఇంతలోనే ఏమైందో కానీ బాత్రూంలో బ్లేడుతో గొంతు, చెయ్యి కోసుకుని నవ వరుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో పెళ్లి ఇంట విషాదం అలుముకుంది. ఖమ్మం జిల్లా వైరా మండలం పుణ్యపురం గ్రామంలో ఈ ఘటన జరిగింది. పుణ్యపురానికి చెందిన కంభంపాటి ఇస్రాయిల్, నాగమ్మ దంపతులకు ఓ కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇస్రాయిల్ 25 ఏళ్ల క్రితం మృతి చెందారు. అప్పటి నుంచి నాగమ్మ ఆశవర్కర్‌గా పనిచేస్తూ పిల్లలను చదివించింది. చిన్నకుమారుడైన నరేశ్ (29) 2014లో బీటెక్ పూర్తిచేశాడు. ప్రస్తుతం గ్రూప్ –1, ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకు సిద్ధమవుతూనే ఖాళీ సమయాల్లో ఉపాధి హామీ పనులకు వెళ్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. ఏపీలోని కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం ఆర్లపాడు గ్రామానికి చెందిన సమీప బంధువుతో ఈ నెల 4వ తేదీన నరేశ్ వివాహం జరిగింది. 5వ తేదీ ఆదివారం స్వగ్రామమైన పుణ్యపురంలో జరిగిన రిసెప్షన్లో మిత్రులు, బంధువులతో కలసి రాత్రి 11 గంటల వరకు నరేశ్ సరదాగా గడిపాడు. సోమవారం ఉదయం విజయవాడ గుణదలలోని మేరీమాత చర్చికి వెళ్లాలని నిర్ణయించుకుని అద్దె కారు కూడా మాట్లాడాడు. తెల్లవారు జామునే కుటుంబీకులను నిద్ర లేపిన నరేశ్ కాలకృత్యాలు తీర్చుకునేందుకు బాత్రూంలోకి వెళ్లాడు. అయితే ఎంత సేపటికీ నరేశ్ రాకపోకడంతో తలుపు కొట్టినా పలకలేదు. దీంతో అనుమానం వచ్చి కుటుంబ సభ్యులు కుర్చీ వేసుకుని పైనుంచి చూడగా నరేశ్ బ్లేడ్‌తో గొంతు, ఎడమ చేయి మణికట్టు వద్ద కోసుకుని రక్తపు మడుగులో పడి ఉండడాన్ని గమనించారు. తలుపులు పగులగొట్టి చూడగా అతను అప్పటికే మృతి చెందడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా రోదిం చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వీరప్రసాద్ తెలిపారు. చదవండి: Hyderabad: బాలికపై ఐదుగురి లైంగిక దాడి.. వీడియోలు తీసి, బెదిరించి -
భార్య, కుమారుడి గొంతు కోసిన భర్త.. వరంగల్‌లో ఘటన
సాక్షి, వరంగల్: వరంగల్‌లోని పెద్దమ్మగడ్డ కాకతీయ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్య, కుమారుడి గొంతు కోసి తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు ముగ్గురిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. వివారాల్లోకి వెళ్తే.. పెద్దమ్మగడ్డ కాకతీయ కాలనీ చెందిన ప్రైవేట్ ఉద్యోగి జయవర్ధన్ చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక చివరకు తన కుటుంబాన్ని అంతమొందించుకోవాలకున్నాడు. భార్యను, కొడుకు గొంతు కోసి ఆపై తాను గొంతు కోసుకున్నాడు. ఇంతలో అతడి ఏడేళ్ల కుమార్తె భయంతో పరుగులు తీసి పక్కింటివారికి చెప్పడంతో పోలీసులు రంగంలోకి దిగి వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. జయవర్ధన్ లాక్డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎక్కువై చేసిన అప్పులు తీర్చలేక భార్య, కుమారుడి గొంతు కోసి తాను గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడని పోలీసులు పేర్కొన్నారు. బాధితులను ఆరోగ్య పరిస్థితి వివరాలు తెలియాల్సి ఉంది. -
నిర్లక్ష్యం: కన్నుతెరవకుండానే కన్నుమూశాడు
లక్నో: వైద్యుడి నిర్లక్ష్యం ఆ పసికందు పాలిట శాపమైంది. ఆ తల్లికి తీరని శోకాన్ని మిగిల్చింది. ఉత్తర ప్రదేశ్‌లోని సుల్తాన్పూర్ దారుణం చోటు చేసుకుంది. 26 సంవత్సరాల రేష్మీకి పురిటినొప్పులు రావటంతో సుల్తాన్‌పూర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. మగబిడ్డను ప్రసవించటంతో ఆ కుటుంబంలో సంతోషం నెలకొంది. అయితే కాన్ఫు చేసిన వైద్యుడు బొడ్డు తాడును కత్తిరించే క్రమంలో నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. ఆ పసిగుడ్డు పీకను కొసేశాడు. కళ్లు తెరకుండానే ఆ పసికందు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అటుపై మృత శిశువు జన్మించిందని కుటుంబ సభ్యులను నమ్మించే యత్నం చేశాడు. అయితే గొంతుపై కత్తి గాటు గమనించిన బంధువులు వైద్యుడిని నిలదీయటంతో అసలు విషయం చెప్పి క్షమాపణలు కోరాడు. ఆగ్రహించిన కుటుంబ సభ్యులు అతనిపై దాడి చేసి పోలీసులకు అప్పగించారు. వైద్యుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
పాలమూరు జిల్లాలో దారుణం
మహబూబ్‌నగర్ జిల్లా ఫరూక్నగర్ మండలం చెటాన్‌పల్లిలో దారుణం చోటు చేసుకుంది. అనుమానంతో భార్య, కుమార్తె గొంతు కోసాడో కసాయి భర్త. ఆ ఘటనలో భార్య, కమార్తె రక్తపు మడుగులో కుప్పకూలిపోయారు. దాంతో నిందితుడు అక్కడి నుంచి పరారైయ్యాడు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని రక్తపుమడుగులో పడి ఉన్నవారిద్దరిని ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే భార్య మృతి చెందింది. కుమార్తె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. అనుమానంతోనే భార్య, కుమార్తెపై భర్త దాడి చేశాడని పోలీసుల విచారణలో స్థానికులు వెల్లడించారు.