లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ సుల్తాన్‌పూర్ జిల్లా పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంతో వెళ్తున్న బీఎండబ్ల్యూ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారు మొత్తం పూర్తిగా ధ్వంసమై తుక్కును తలపించింది. ఇంజిన్, ఇతర భాగాలు చెల్లాచెదురయ్యాయి.
ఈ ఘోర ప్రమాదంలో మృతి చెందిన ఓ యువకుడి తల, చేయి 20-30 దూరంలో ఎగిరిపడ్డాయి. ఘటన సమయంలో బీఎండబ్ల్యూ గంటకు 230కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది. కారులో వెళ్తూ వీరంతా ఫేస్‌బుక్ లైవ్‌లో స్పీడ్‌మీటర్‌పై పోకస్ చేసి వీడియో తీశారు. ఆ సమయంలో ఓ యువకుడు 'మేమంతా కాసేపట్లో చావబోతున్నాం' అని అన్నాడు. కాసేపటికే కారు ప్రమాదానికి గురై నలుగురూ చనిపోయారు.
అయితే మృతుల్లో ముగ్గురిని ఆనంద్ ప్రకాశ్(37), అఖిలేశ్ సింగ్(35), దీపక్ కుమార్(37)గా గుర్తించారు పోలీసులు. కానీ మరో యువకుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని చెప్పారు.
చదవండి: విషాదం.. ప్రాణాలు కాపాడే అంబులెన్సే మృత్యుపాశమైంది..!
Comments
Please login to add a commentAdd a comment