ఉత్తరప్రదేశ్ షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డు చైర్మన్ వసీం రిజ్వీ
లక్నో : రామ మందిరం- బాబ్రీ మసీదు నిర్మాణ వివాదం గురించి ఉత్తరప్రదేశ్ షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డు చైర్మన్ వసీం రిజ్వీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రామ జన్మభూమి అయిన అయెధ్యలో కేవలం రామ మందిర నిర్మాణం మాత్రమే జరుగుతుందంటూ ఆయన వ్యాఖ్యానించడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ‘అయోధ్యలో అసలు బాబ్రీ మసీదు అనేది లేనే లేదు. ఇక ముందు కూడా ఉండబోదు. అది రామ జన్మభూమి. అక్కడ కేవలం రామ మందిరం మాత్రమే నిర్మించబడుతుంది. బాబర్ సానుభూతి పరులంతా ఓడిపోవడానికి సిద్ధంగా ఉండండి’ అంటూ వసీం రిజ్వీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నుంచి ప్రయోజనం పొందేందుకే వసీం రిజ్వి ముస్లింల మనోభావాలు దెబ్బతీస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కాగా, గతంలో కూడా వసీం రిజ్వి పలు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ముస్లిం విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన మదర్సాలు టెర్రరిస్టులను తయారు చేసే కేంద్రాలుగా మారాయని... తక్షణమే మదర్సా వ్యవస్థను రద్దు చేయాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కి లేఖలు రాశారు. రామ మందిర నిర్మాణాన్ని వ్యతిరేకించే వారంతా పాకిస్తాన్‌కు వెళ్లిపోవాలి లేదా ఉగ్రవాద సంస్థల్లో చేరాలంటూ వ్యాఖ్యానించి విమర్శల పాలయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment