Babri dispute
-
అసలు బాబ్రీ మసీదే లేదు: షియా వక్ఫ్ బోర్డు
లక్నో : రామ మందిరం- బాబ్రీ మసీదు నిర్మాణ వివాదం గురించి ఉత్తరప్రదేశ్ షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డు చైర్మన్ వసీం రిజ్వీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రామ జన్మభూమి అయిన అయెధ్యలో కేవలం రామ మందిర నిర్మాణం మాత్రమే జరుగుతుందంటూ ఆయన వ్యాఖ్యానించడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ‘అయోధ్యలో అసలు బాబ్రీ మసీదు అనేది లేనే లేదు. ఇక ముందు కూడా ఉండబోదు. అది రామ జన్మభూమి. అక్కడ కేవలం రామ మందిరం మాత్రమే నిర్మించబడుతుంది. బాబర్ సానుభూతి పరులంతా ఓడిపోవడానికి సిద్ధంగా ఉండండి’ అంటూ వసీం రిజ్వీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నుంచి ప్రయోజనం పొందేందుకే వసీం రిజ్వి ముస్లింల మనోభావాలు దెబ్బతీస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, గతంలో కూడా వసీం రిజ్వి పలు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ముస్లిం విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన మదర్సాలు టెర్రరిస్టులను తయారు చేసే కేంద్రాలుగా మారాయని... తక్షణమే మదర్సా వ్యవస్థను రద్దు చేయాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కి లేఖలు రాశారు. రామ మందిర నిర్మాణాన్ని వ్యతిరేకించే వారంతా పాకిస్తాన్‌కు వెళ్లిపోవాలి లేదా ఉగ్రవాద సంస్థల్లో చేరాలంటూ వ్యాఖ్యానించి విమర్శల పాలయ్యారు. -
అయోధ్య వివాదంలో ఊహించని మలుపు!
-
‘పర్సనల్ లా’ ముస్లింల హక్కు
► ఆలిండియా పర్సనల్ లా బోర్డు స్పష్టీకరణ ► బాబ్రీ అంశంలో కోర్టు వెలుపలి ఒప్పందాలకు నో లక్నో: ‘పర్సనల్ లా’ అనుసరించడమనేది ముస్లింల రాజ్యాంగపరమైన హక్కు అని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎమ్‌పీఎల్‌బీ) నొక్కి చెప్పింది. బాబ్రీ మసీదు విషయంలో సుప్రీంకోర్టు నిర్ణయానికి బోర్డు అంగీకరిస్తుందని, అయితే ‘కోర్టు వెలుపలి ఒప్పందాల’కు అంగీకరించేది లేదని స్పష్టం చేసింది. ట్రిపుల్ తలాక్ విషయంలో ప్రవర్తనా నియమావళిని జారీ చేయాలని బోర్డు నిర్ణయించిందని ఏఐఎమ్‌పీఎల్‌బీ ప్రధాన కార్యదర్శి మౌలానా వలీ రెహ్మానీ ఆదివారం చెప్పారు. షరియా (ఇస్లామిక్ లా) కారణాలు తెలపకుండా విడాకులు ఇచ్చే వారు సాంఘిక బహిష్కరణ ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. శుక్రవారం నమాజ్ సమయంలో ఈ ప్రవర్తనా నియమావళిని చదివి వినిపించాలని ఇమామ్‌లను బోర్డు అభ్యర్థించింది. షరియత్ చట్టాల్లో ఇతరుల జోక్యాన్ని సహించబోమని, దేశంలోని మెజారిటీ ముస్లింలు ‘పర్సనల్ లా’లో ఎలాంటి మార్పులు కోరుకోవడం లేదంది. పర్సనల్ లా అమలు చేయడంలో అడ్డంకులు సృష్టించొద్దని రెహ్మానీ అభ్యర్థించారు. తలాక్ దుర్వినియోగమైన మహిళలకు బోర్డు అండగా ఉంటుందని హామీ ఇచ్చా రు. బోర్డు మహిళా విభాగం అధ్యక్షురాలు అస్మా జహ్రా మాట్లాడుతూ.. తలాక్ విషయం మత సంబంధమైనది కాదని, సామాజిక సంబంధమైనది చెప్పారు. భారత్‌లో మహిళల సమస్యలు ఒకటేనని, ఈ అంశంలో ‘ముస్లిం లా’ని ఒక్కటే లక్ష్యంగా చేసుకోవడం సరికాదన్నారు. బాబ్రీ వివాదంపై...: రామ జన్మభూమి– బాబ్రీమసీదు వివాదాన్ని కోర్టు వెలుపల పరిష్కరించుకోవాలన్న సుప్రీంకోర్టు సూచనను ఏఐఎమ్‌పీఎల్‌బీ తిరస్కరిం చింది. సుప్రీంకోర్టు వెలువరించే తీర్పు మాత్రమే తమకు సమ్మతమని స్పష్టం చేసింది. కోర్టు వెలుపల ఒప్పందాలను అంగీకరించబోమని రెహ్మానీ చెప్పారు. ఈ మేరకు బోర్డు ఎగ్జిక్యూటివ్ సమావేశంలో తీర్మానించినట్లు తెలిపారు. అయోధ్య వివాదాన్ని కోర్టు వెలుపల పరిష్కరిం చుకోవాలని గత మార్చి 21న సుప్రీంకోర్టు సూచించింది. ఈ విషయంలో మధ్య వర్తిత్వం వహించేందుకు సిద్ధమని నాడు చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్ చెప్పారు. -
‘బాబ్రీ’పై సుప్రీం తీర్పును గౌరవిస్తాం
జమాతే–ఇ–ఇస్తామి హింద్ తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల అధ్యక్షుడు హన్మకొండ చౌరస్తా: బాబ్రీ మసీదు, అయోధ్య రామ మందిరం వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని జమాతే–ఇ–ఇస్లామి హింద్ తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల అధ్యక్షుడు మౌలానా హమీద్ మహ్మద్ ఖాన్ సాహెబ్ అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మ కొండలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బాబ్రీ వివాదంపై ఆరుసార్లు చర్చలు జరిగినా స్పష్టత లేక సమస్య అలాగే మిగిలిపోయిందని, గతం పునరావృతం కావద్దంటే న్యాయ స్థానమే సరైన తీర్పు చెప్పాలని, ఆ తీర్పుకు తాము కట్టుబడి ఉంటామన్నారు. వక్ఫ్‌బోర్డుకు జ్యుడీషియల్ అధికారాలు ఇవ్వాలని, అప్పుడే ఆయా ఆస్తులకు రక్షణ ఉంటుందని అభిప్రాయపడ్డారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేç Ùన్లు కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ రిజర్వేషన్లు అమలు చేయకుండా బీసీ కమిషన్‌ను నియమించడం సమంజసం కాదన్నారు.